వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశ్చర్యం: పదో తరగతి చదువుతున్న బాలిక కంటి నుంచి నెత్తుటి ధార

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: కూతురి కంటి నుంచి రక్తం ధారగా రావడంతో ఆ తల్లిదండ్రులకు ఒక్కసారిగా కంగారుపడ్డారు. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆ రక్తం రావడం వెనుక కారణాన్ని వైద్యులు వెల్లడించడంతో ఆశ్చర్యపోయారు. వివరాల్లోకి వెళితే కంటి నుంచి రక్త ధారతో కింది చిత్రంలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ముమ్మడి మధుబాల.

తూర్పుగోదావరిజిల్లా కరప మండలం నడకుదురుకు చెందిన ఆమె స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం మధుబాల ఇంట్లో కూర్చుని చదువుతుండగా ఒక్కసారిగా ఆమె ఎడమ కంటి నుంచి రక్తం రావడం ప్రారంభమైంది.

ఆమె తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రక్తం ఆగలేదు. దీంతో తమ కుమార్తెకు ఏమైందోనని కంగారు పడిన మధుబాల ఆమెను హుటాహుటిన కారులో కాకినాడలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ విద్యార్ధిని పరీక్షించిన వైద్యులు మందులు, ఐ డ్రాప్స్‌ ఇచ్చి ఇంటికి పంపించివేశారు.

The girl who bleeds from her eyes in east godavari

అయితే అవి వేసుకున్నా బుధవారం ఉదయం మరోసారి కంటి నుంచి రక్తం రావడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు వైద్యపరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆమె కంటిపై రెప్పలోని నరం చిట్లినట్టు వైద్యులు గుర్తించారు. నరం చిట్లడానికి గల కారణాలను ఆరా తీయగా నాలుగు రోజుల క్రితం స్కూల్లో తన స్నేహితురాలు కంటిపై గుద్దినట్టు మధుబాల పేర్కొనడం విశేషం.

దీంతో బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా కంగుతిన్నారు. స్కూల్లో చదువుకోమని పంపిస్తే, నువ్వు చేసే నిర్వాహకం ఇదా అంటూ బాలికపై ఆగ్రహాం వ్యక్తం చేశారు.

చాతబడి చేస్తున్నారని చితక్కొట్టారు
చాతబడులు చేస్తున్నాడని ఓ వ్యక్తిని చితక్కొట్టిన సంఘటన విజయనగరం జిల్లాలోని లంకపట్నంలో చోటు చేసుకుంది. తమపై చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో రాము అనే వ్యక్తిని స్థానికులు చితకబాదారు. అనంతరం అతడిని స్ధానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన అయితే సీఐ దుర్గాప్రసాద్‌ చాతబడుల విషయమై వారికి ఓ అవగాహన సదస్సు నిర్వహించారు.

English summary
The girl who bleeds from her eyes in east godavari, Parents hurry to taken her near by hospital in kakinada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X