• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నరేంద్ర చేసిన తప్పేంటో ప్రభుత్వం చెప్పాలి.!ధూళిపాళ్లను పరామర్శించిన నారా లోకేష్.!

|

అమరావతి/హైదరాబాద్ : రాజమండ్రి సెంట్రల్ జైలునుండి విడుదలై విజయవాడ చేరుకున్న టీడిపి నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకు సంఘీభావం తెలిపారు టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అక్రమ కేసులకు భయపడేది లేదని న్యయపోరాటం చేసే సామర్థ్యం తెలుగుతమ్ముళ్లకు ఉందని లోకేష్ నరేంద్రను ఓదార్చారు. సంగం డెయిరీ వ్యవహారంలో ఆ సంస్థ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటో అధికార వైసీపి ప్రభుత్వం చెప్పాలని నారా లోకేశ్‌ ప్రశ్నించారు.

 నరేంద్ర రాజ్యాంగాన్ని అతిక్రమించారా.. ఎందుకు జైలుకు పంపారని ప్రభుత్వాన్ని నిలదీసిన లోకేష్..

నరేంద్ర రాజ్యాంగాన్ని అతిక్రమించారా.. ఎందుకు జైలుకు పంపారని ప్రభుత్వాన్ని నిలదీసిన లోకేష్..

పాడి రైతులకు లీటరుకు నాలుగు రూపాయలు ఎక్కువ ఇవ్వడం, ఆస్పత్రి ఏర్పాటు చేసి రైతులకు 50 శాతం రాయితీతో వైద్యం అందించడం నరేంధ్ర చెసిన తప్పా అని లోకేష్ సూటిగా ప్రశ్నించారు. సంగం డెయిరీ కేసులో బెయిల్‌పై విడుదలైన ధూళిపాళ్ల నరేంద్రను నారా లోకేశ్‌ పరామర్శించారు. విజయవాడలోని ధూళిపాళ్ల ఇంటికి వెళ్లి ఆయనతో ఏకాంతంగా కాసేపు సమావేశమయ్యారు. ఆ తర్వాత కుటుంబసభ్యులను లోకేశ్‌ పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఏపీ జగన్మోహన్ రెడ్డిని ఓ అమూల్ బేబీగా లోకేష్ అభివర్ణించారు.

 ఇన్సైడ్ ట్రేడింగ్ పై స్టింగ్ ఆపరేషన్ చేసిన నరేంద్ర.. అందుకే ప్రభుత్వం కక్షగట్టిందన్న టీడిపి..

ఇన్సైడ్ ట్రేడింగ్ పై స్టింగ్ ఆపరేషన్ చేసిన నరేంద్ర.. అందుకే ప్రభుత్వం కక్షగట్టిందన్న టీడిపి..

అంతే కాకుండా దశాబ్దాల నుంచి రైతు ప్రయోజనాల కోసం పని చేస్తున్న సంగం డెయిరీపై కక్ష సాధింపు దుర్మార్గమైన చర్య అని, అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రను స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా నరేంద్ర బయటపెట్టినందుకే నరేంద్రపై ద్వేషం పెంచుకున్నారని లోకేష్ మండిపడ్డారు. అమూల్ డైయిరీ కోసం ప్రజా ధనం ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని, రాష్ట్రంలో డైయిరీలన్నీ గుజరాత్ కు కట్టబెట్టే యత్నం చేస్తున్నారని, అమూల్ డెయిరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు ప్రజాధనం వృధా చేస్తుందని లోకేష్ ఘాటుగా విమర్శించారు.

 కరోనా నియంత్రణలో చేతులెత్తేసారు. కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారన్న లోకేష్..

కరోనా నియంత్రణలో చేతులెత్తేసారు. కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారన్న లోకేష్..

కరోనా మహమ్మారితో ప్రజలు చనిపోతుంటే పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చారని ధ్వజమెత్తారు.
జగన్మోహన్ రెడ్డి కక్ష పూరిత రాజకీయాలతో తెలుగుదేశం నేతల్ని జైలుకు పంపుతున్నారని, కొందరు అధికారులు చట్టాల్ని ఉల్లంఘించి పని చేస్తున్నారని, అలాంటి అధికారులకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని లోకేష్ తెలిపారు. తాను ఏనాడూ తప్పు చేయలేదని, వేల కోట్లు దోపిడీ చేశానని ఆరోపణలు చేసి ఆఖరికి రైతుల్ని పరామర్శించడానికి వెళితే ట్రాక్టర్ రాష్ డ్రైవింగ్ కేసు తనపై పెట్టారని, ఇప్పటికైనా కక్షసాధింపు రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని లోకేష్ హితవు పలికారు.

 ధూళిపాళ్లకు చంద్రబాబు నాయుడు పరామర్శ.. టీడిపి అండగా ఉంటుందని భరోసా..

ధూళిపాళ్లకు చంద్రబాబు నాయుడు పరామర్శ.. టీడిపి అండగా ఉంటుందని భరోసా..

ఎసిబి అక్రమ కేసు కారణంగా అరెస్టై రాజమండ్రి జైలునుండి విడుదలైన సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నరేంద్ర ఆరోగ్య పరిస్థితిని వాకబుచేశారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు భయపడవద్దని యావత్ తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంగం డెయిరీని కాపాడుకునేందుకు నరేంద్ర నేతృత్వంలో పాల ఉత్పత్తిదారులు చేసే పోరాటానికి అండగా నిలుస్తామని నారా చంద్రబాబునాయుడు అన్నారు.

  Yellow Fungus Cases Reported In UP | Oneindia Telugu
  English summary
  Nara Lokesh visited Narendra, who was released on bail in the Sangam Dairy case. Went to the Narendra house in Vijayawada and met him in private for a while.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X