వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోనసీమ విధ్వంసానికి ప్రభుత్వ వైఖరే కారణం.!సీఎం జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న సీపిఐ నారాయణ.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : కోనసీమ కదనరంగంపై రాజకీయ నేతల స్పందన మొదలైంది. అదికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష టీడిపి అధినేత చంద్రబాబు నాయుడు, సనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపి అద్యక్షుడు సోము వీర్రాజు తమదైన కోణంలో స్పందించారు. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ కొనసీమ కొట్లాటలపై ఘాటుగా స్పందించారు. అధికార పార్టీ ప్రమేయంతోనే హింస చోటుచేసుకుందని సంచలన వ్యాఖ్యలు చేసారు నారాయణ.

 ముందే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఏ సమస్యలు ఉండేవి కావు.. సీపిఐ నారాయణ విచారం

ముందే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఏ సమస్యలు ఉండేవి కావు.. సీపిఐ నారాయణ విచారం

కోనసీమ జిల్లాకు ముందే అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఏ సమస్యలు ఉండేవి కావు అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే కోనసీమ భగ్గుమందని బుధవారం నారాయణ మీడియాకి విడుదల చేసిన వీడియో సందేశంలో అభిప్రాయపడ్డారు. హింసను అదుపు చేయడంలో యంత్రాంగం పూర్తిగా విపలం చెందిందన్నారు నారాయణ.

 ఆరోజు జగన్ పట్టించుకోలేదు.. అందుకే ప్రజాగ్రహమన్న నారాయణ

ఆరోజు జగన్ పట్టించుకోలేదు.. అందుకే ప్రజాగ్రహమన్న నారాయణ


జిల్లాల విభజన తరుణంలోనే అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్లు వచ్చినా పట్టించుకోకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ఊగిసలాట ధోరణి వ్యవహరించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని నారాయణ పేర్కొన్నారు. కోనసీమకు అంబెడ్కర్ పేరు విషయంలో ప్రారంభం అయిన ఘర్షణలు చీలికి చిలికి గాలివానలా మారాయని చెప్పారు. చివరకు మంత్రి విశ్వరూప్ గృహ దహనం వరకు వెళ్లిందని, ఇది అత్యంత విచారకర సంఘటన అని నారాయణ పేర్కొన్నారు.

 ఓట్లు, రాజకీయ ఎత్తుగడలతో సీఎం జగన్ సంకుచిత వైఖరి.. ప్రజాస్వామ్యంలో మంచిదికాదన్న నారాయణ

ఓట్లు, రాజకీయ ఎత్తుగడలతో సీఎం జగన్ సంకుచిత వైఖరి.. ప్రజాస్వామ్యంలో మంచిదికాదన్న నారాయణ

ఈ ఘటనను కుల పరమైన ఘర్షణగా చూడలేమన్నారు నారాయణ. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు ప్రతిబింబంగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలి చూస్తున్న ప్రభుత్వ విధానాలపై వ్యతిరేక ఉద్యమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయాయని గుర్తు చేశారు. జిల్లాల ఏర్పాటు తరుణంలోనే అంబెడ్కర్ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని పేర్కొన్నారు. ఆ సమయంలో మొండిగా వ్యహరించి అనంతర కాలంలో ఓట్లు, రాజకీయ ఎత్తుగడలతో సీఎం జగన్ సంకుచిత వైఖరిని ప్రదర్శించారని, అందుకే ఇలాంటి మారణకాండ చోటుచేసుకుందని ఆరోపించారు.

 ఆత్మ స్తుతి పరనింద పనికి రాదు.. నారాయణ జగన్ కు హితబోద

ఆత్మ స్తుతి పరనింద పనికి రాదు.. నారాయణ జగన్ కు హితబోద

ఏ విషయంలో అయినా స్పష్టత ప్రదర్శించే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు చేశారని నారాయణ ప్రశ్నించారు. యంత్రాంగం నిర్లక్ష్యం ఫలితంగా కోనసీమలో ఘర్షణలు చెలరేగాయని, మొత్తంగా చూస్తే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక కారణంగానే చోటు చేసుకుందని స్పష్టం చేశారు నారాయణ. ఈ విషయంలో ఆత్మ స్తుతి పరనింద పనికి రాదని ప్రభుత్వానికి సూచించారు. ప్రజాస్వామ్య పద్దతిలో పాలన సాగిస్తే ఇటువంటి పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభుత్వానికి నారాయణ సూచించారు.

English summary
CPI (M) national secretary Dr K Narayana said there would have been no problems if Ambedkar had been named before Konaseema district. On Wednesday, Narayana said Konaseema had collapsed due to opposition to Chief Minister YS Jaganmohan Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X