పెద్దిరెడ్డికి షాక్, అందరినీ ప్రతివాదులుగా చేర్చాలని చెప్పిన హైకోర్టు, ఎమ్మెల్యేగా?
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి కష్టాలు ఎదురైనాయని ఆ నియోజక వర్గం ప్రజలు అంటున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అందరినీ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చాలని అదే నియోజక వర్గం నుంచి పోటీ చేసిన బీసీవైపీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రా యాదవ్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా చెడ్డి (వైసీపీ), చల్లా రామచంద్రా రెడ్డి (టీడీపీ), భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రా యాదవ్ పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వానేనా అంటూ పెదదిరెడ్డి, చల్లా రామచంద్రా రెడ్డి కౌంటింగ్ రోజు చివరి రౌండ్ వరకు పోటీపడ్డారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బోడే రామచంద్ర యాదవ్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చల్లా రామచంద్రా రెడ్డి రెండో స్థానానికి పరిమితం అయ్యారు.

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా చల్లా రామచంద్రా రెడ్డికి కూడా భారీగా ఓట్లు పోలైనాయి. సుమారు 6 వేల మెజారిటీ మాత్రమే పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆయన భార్యకు సంబంధించి 142 స్థిరాస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించకుండా చాలా సీక్రేట్ గా ఎన్నికల్లో పోటీ చేశారని, ఎన్నికల సంఘాన్ని, ప్రజలను మోసం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎన్నికను రద్దు చెయ్యాలని బీసీవైపీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రా యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇటీవల హైకోర్టులో పిటిషన్ విచారణ జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తరపు న్యాయవాదులు, బోడే రామచంద్ర యాదవ్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్. వి. శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసిన అభ్యర్థులందరినీ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు బోడే రామచంద్ర యాదవ్ ను ఆదేశించింది.
పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ పిటిషన్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ఉంటుందని, వారి పేర్లు వ్యాజ్యంలో చేర్చాలని బోడే రామచంద్ర యాదవ్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ విచారణ ఇదే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తరువాత అత్యధిక ఓట్లు సాధించిన చల్లా రామచంద్రా రెడ్డి పేరు కూడా ఇప్పుడు వ్యాజ్యంలో చేరనుంది. పెద్దిరెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని దాఖలు అయిన పిటిషన్ హైకోర్టులో విచారణకు రావడంతో పుంగనూరు నియోజక వర్గంలో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications