హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గణేషుని చేతిలో భారీ లడ్డూ, గవర్నర్ ప్రత్యేక పూజలు

రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన గణపతిగా పేరొందిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఎత్తు ఈ ఏడాది 60 అడుగులకు చేరింది.

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన గణపతిగా పేరొందిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఎత్తు ఈ ఏడాది 60 అడుగులకు చేరింది. ఈ మహాగణపతి ఎత్తు ఇదే చివరిసారి కానుంది. ప్రతి సంవత్సరం కూడా ఎంతో అందమైన గణపతి విగ్రహం ఇక్కడ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.

1954లో ఖైరతాబాద్‌లో మహాగణపతిని తొలిసారి ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరంతో 60 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో 60 అడుగుల ఎత్తైన మహాగణపతిని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది నుండి ఇంత ఎత్తైన మహాగణపతి విగ్రహం ఉండదని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇంత అందమైన ఎత్తైన రూపం ఈ ఏడాదే చివరిసారి కానుంది. ఆ తర్వాత ఏడాది నుండి ఒక్కో అడుగు తగ్గనుంది.

The Height of Khairathabad Ganesh Will be Fixed at 60 Feet

ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహనికి శ్రీ కైలసా విశ్వరూపరమహాగణపతిగా నామకరణం చేశారు. రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ఈ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు అమితాసక్తిని కనబరుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సురిచి పుడ్స్ సంస్ద తయారుచేసిన 5000 కిలోల లడ్డు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు చేరింది. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ క్రేన్ ద్వారా లడ్డూని వినాయకుడి చేతిలో పెట్టారు.

గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు వినాయక చవతి శుభాకాంక్షలు

గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులు ప్రజలకు వినాయకచవతి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ నరసింహన్ సతీ సమేతంగా ఖైరతాబాద్ మహాగణపతికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్‌ నేత దానం, అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఈ ఏడాది విశేషాలు

* మహాగణపతి బరువు 40 టన్నులు
* ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 40 టన్నులు
* గోనె సంచులు 10వేల మీటర్లు
* చాక్ పౌడర్ 100 బ్యాగులు
* సిబ్బంది 150 మంది
* నార రెండున్నర టన్నులు

English summary
The Ganesh Utsav Committee has decided to fix the height of the popular Khairathabad Ganesh idol at 56 feet from next year. The committee has the tradition to increase the height of the Ganesh idol every year by one feet and this year it has reached to 56 feet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X