వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో వైసీపీకి 43 శాతం..టీడీపీకి 38 శాతం ఓట్ షేరింగ్ : హిందూ- సీఎస్‌డిఎస్-లోక్‌నీతి స‌ర్వే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Exit Polls 2019 : YCPకి-43శాతం,TDPకి-38శాతం హిందూ- సీఎస్‌డిఎస్ : లోక్‌నీతి స‌ర్వే..! || Oneindia

ఏపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి మ‌రో కీల‌క‌మైన సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించింది. ప్ర‌ముఖ జాతీయ దిన ప‌త్రిక ది హిందూ- సీఎస్‌డిఎస్-లోక్‌నీతి సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్‌ను ప్ర‌క‌టించారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏకు 40-42 శాతం వ‌ర‌క‌రు ఓట్ షేరింగ్ జ‌రిగింద‌ని అంచ‌నా వేసిన ఈ సంస్థ‌..యుపీఏకు 28-30 శాతం వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. ఇక‌, ఏపీకి సంబంధించి ఈ సంస్థ సైతం వైసీపీకే అధిక శాతం ఓటింగ్ న‌మోదైంద‌ని విశ్లేషించింది.

ఏపీలో వైసీపీకే అధిక్య‌త‌..
ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తార‌నే అంశం పై ప‌లు సంస్థ‌లు ఎగ్జిట్ పోల్ అంచ‌నాలు వెల్ల‌డించాయి. దీని మేర‌కు దాదాపు తొమ్మ‌ది సంస్థ‌లు వైసీపీకే అధికారం అని చెబుతుండ‌గా...ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటితో పాటుగా మ‌రో రెండు సంస్థ‌లు మాత్రం టీడీపీ తిరిగి అధికారం ద‌క్కించుకుంటుంద‌ని అంచ‌నాల‌ను వెల్ల‌డించాయి. ఇదే స‌మ‌యంలో మ‌రో ప్ర‌ముఖ సంస్థ హిందూ- సీఎస్‌డిఎస్-లోక్‌నీతి ఎగ్జిట్ పోల్ అంచ‌నాల‌ను వెల్ల‌డించింది. దీని మేర‌కు జాతీయ స్థాయిలో ఎన్డీఏకు 40-42 శాతం..యూపిఏకు 28-30 శాతం, ఇత‌రుల‌కు 18-20 శాతం వ‌ర‌కు ఓట్ షేరింగ్ ఉంద‌ని అంచ‌నా వేసింది.

కౌంట్‌డౌన్ స్టార్ : అమ‌రావ‌తిలో అగ్రనేత‌లు : జ‌గ‌న్‌తో పాటు పీకే.. వారి పైనే స్పెష‌ల్ ఫోక‌స్‌..!కౌంట్‌డౌన్ స్టార్ : అమ‌రావ‌తిలో అగ్రనేత‌లు : జ‌గ‌న్‌తో పాటు పీకే.. వారి పైనే స్పెష‌ల్ ఫోక‌స్‌..!

ఇక‌, ఏపీలో ఇత‌ర జాతీయ ఎగ్జిట్ పోల్స్ త‌ర‌హాలోనే వైసీపీకి అధికంగా 43 శాతం..టీడీపీకి 38 శాతం ఓట్ షేరింగ్ ఉంద‌ని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్ల‌డించింది. అంటే ఏపి ఎన్నిక‌ల్లో దాదాపు ఈ రెండు పార్టీల మ‌ధ్య ఈ సంస్థ స‌ర్వే ప్ర‌కారం అయిదు శాతం తేడా ఉంది. 2014 ఎన్నిక‌ల్లో కేవ‌లం 1.95 శాతం ఓట్ల తేడా ఉంటే..వైసీపీ 67 సీట్లు.. టీడీపీ 102 సీట్లు సాధించాయి. ఇక‌, ఇప్పుడు అయిదు శాతం వైసీపీకి ఎక్కువ‌గా ఓటింగ్ జ‌రిగిన‌ట్లు తేల్చారు.

The Hindu-CSDS-Lokneeti exit poll survey predict YCP may get 43 percent and TDP get 38 percent vote share in AP

అసెంబ్లీ- లోక్‌స‌భ పోలింగ్‌లో ఇదే తీరు..

ఏపీలో మొత్తం 25 లోక్‌స‌భ స్థానాలు ఉండ‌గా..వైసీపీ అయిదు శాతం అధికంగా ఓట్ షేర్ ద‌క్క‌టంతో అధిక సంఖ్య‌లో లోక్‌స‌భ సీట్లు ద‌క్కించుకొనే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన జాతీయ సంస్థ‌లు వైసీపీకి దాదాపుగా 18 నుండి 22 లోక్‌స‌భ స్థానాలు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసాయి. అయితే, ల‌గ‌డపాటి స‌ర్వేలో మాత్రం టీడీపీకి అధికంగా ఓట్లు..సీట్లు వ‌స్తాయ‌ని లెక్క‌లు చెప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం టీడీపీ 1983 నుండి స‌ర్వేలు చేస్తోంద‌ని..తాజాగా ఎగ్జిట్ పోల్స్ ప్ర‌క‌టించిన సంస్థ‌లు ఏపీలో ఓటరు నాడి ప‌ట్టుకోవ‌టంలో విఫ‌లం అయ్యార‌ని ఆరోపించారు.

వంద‌కు వెయ్యి శాతం టీడీపీ విజ‌యం సాధిస్తుంద‌ని చంద్ర‌బాబు ధీమాగా చెబుత‌న్నారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ అధినేత త‌మ‌కు లాండ్ స్లైడ్ విజ‌యం ఖాయ‌మ‌ని చాలా ధీమాగా చెప్పారు. ఇక‌, ఎగ్జిట్ పోల్స్ సైతం ఎక్కువ‌గా వైసీపీకే మొగ్గు చూపాయి. తాజాగా హిందూ- సీఎస్‌డిఎస్-లోక్‌నీతి స‌ర్వే అంచ‌నాలు సైతం వైసీపీకే మ‌ద్ద‌తుగా ఉండంతో.. మ‌రి కొద్ది గంట‌ల్లో ప్రారంభం కానున్నా ఓట్ల లెక్కింపు మ‌రింత ఉత్కంఠ‌కు దారి తీస్తోంది.

English summary
The Hindu-CSDS-Lokneeti exit poll survey predict YCP may get 43 percent and TDP get 38 percent vote share in AP Elections. many national exit polls expressed same opinion on Ap voting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X