వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని రైతులకు జనసేన అండ.... పవన్ కళ్యాణ్... అమరావతిలో పార్టీ బృందం పర్యటన

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధానిపై సీఎం జగన్ చేసిన ప్రకటనలతో మరోసారి రాజధాని రగడ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రాజధాని నిర్మాణంపై అధికార పార్టీ సభ్యులు చేస్తున్న వాదనలను నిజం చేస్తూ...అనధికారికంగా సీఎం జగన్ ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే...అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ది చెందాలంటే... మూడు రాజధానులు రావచ్చంటూ ఆయన ప్రకటించారు. దీంతో రాజధానిపై అనుకూల వ్యతిరేక వర్గాలు తమ గళాన్ని విప్పుతున్నాయి.

ఒక్క దానికే దిక్కు లేదు! మూడు రాజధానులా?: వైఎస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహంఒక్క దానికే దిక్కు లేదు! మూడు రాజధానులా?: వైఎస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

ఈ నేపథ్యంలోనే అమరావతిలో జనసేన బృందం పర్యటించనున్నట్టు ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అమరావతిలో నెలకొన్న పరిస్థితులను పరీశీలించేందుకు పార్టీ సీనియర్ నేత నాదేండ్ల మనోహర్ నేతృత్వంలో పార్టీ సభ్యులు పర్యటించనున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం ఈ బృందం పర్యటించనున్నట్టు పేర్కోన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలను జనసేన బృందం తెలుసుకుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

The Janasena team will be visiting Amaravathi

ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంత ప్రజలకు జనసేన అండగా నిలబడుతుందని హమీ ఇచ్చారు. కాగా పార్టీ బృందం పర్యటనలో రాజధానిపై నిపుణుల నివేదిక వచ్చే వరకు అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ బృందం, రైతులతో చర్చిస్తుందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో పేర్కోన్నారు. కాగా రాజధానిపై సీఎం జగన్ ప్రకటన చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే..ఒక్క రాజధానికే దిక్కు లేనప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఆయన ఫైర్ అయ్యారు.

English summary
The Janasena team led by senior party leader Nadendla Manohar will be visiting Amaravathi said janasena Chief PawanKalyan. they look into the situation in Amravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X