• search
 • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రాహుల్ హత్య : ఆ ఇద్దరు మహిళల ప్రమేయంపై అనుమానాలు-ఎవరా ఇద్దరు-ఆరోపణలపై కోగంటి సత్యం రియాక్షన్...

|

విజయవాడ మాచవరంలో యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్ హత్య రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. హత్యలో రాహుల్ వ్యాపార భాగస్వామి కోరాడ విజయ్ కుమార్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక లావాదేవీలే హత్యకు దారితీశాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయ్ కుమార్‌ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ హత్యలో ఇద్దరు మహిళల ప్రమేయం కూడా ఉండొచ్చుననే అనుమానాలు తాజాగా తెర పైకి వచ్చాయి.

  Lucknow Girl Vs Cab Driver : ముఖ్యమైన 5 విషయాలు ! || Oneindia Telugu
  ఎవరా ఇద్దరు మహిళలు...

  ఎవరా ఇద్దరు మహిళలు...

  రాహుల్ హత్య కేసులో గాయత్రి,పద్మజ అనే మహిళల పేర్లు వినిపిస్తున్నాయి. హత్య జరిగిన సమయంలో ఈ ఇద్దరూ కారులోనే ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఇద్దరు మహిళలతో కోరాడ విజయ్ కుమార్‌ గతంలో రాహుల్ ఇంటికి వెళ్లాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు మహిళల సమక్షంలోనే చాలాసార్లు విజయ్‌-రాహుల్‌ల మధ్య ఆర్థిక వివాదాలపై చర్చించినట్లు సమాచారం. దీంతో ఆ ఇద్దరు మహిళలు ఎవరు... ఈ వివాదంలోకి వారు ఎందుకొచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ మహిళల గురించి పోలీసులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.

  ఏడాదిన్నరగా కొనసాగుతున్న వివాదం...

  ఏడాదిన్నరగా కొనసాగుతున్న వివాదం...

  రాహుల్‌కు విజయ్‌ కుమార్‌కు నడుమ ఏడాదిన్నరగా ఆర్థిక లావాదేవీలపై వివాదం నెలకొన్నట్లు చెబుతున్నారు. ఆర్థికంగా దెబ్బతిన్న విజయ్ కుమార్ రాహుల్ కంపెనీల్లో తన వాటాను ఉపసంహరించుకోవాలని భావించారు. అయితే కంపెనీల విస్తరణపై ఫోకస్ చేసిన రాహుల్... ఇప్పట్లో అంత డబ్బు సర్దుబాటు కాదని చెప్పాడు. దీంతో రాహుల్‌కి చెందిన ఐదు కంపెనీల్లో జిక్సన్ సిలిండర్స్ కంపెనీని అమ్మేయాలని... తద్వారా వచ్చే డబ్బును తనకివ్వాలని విజయ్ ప్రతిపాదించాడు. అందుకు రాహుల్ ఒప్పుకోలేదు. దీంతో ఏడాదిన్నర కాలంగా ఈ వివాదం ఇలాగే సాగుతోంది.

  హత్య ఎలా జరిగింది...

  హత్య ఎలా జరిగింది...

  ఇదే వివాదంపై మాట్లాడేందుకు కోరాడ విజయ్ కుమార్ ఈ నెల 18వ తేదీన రాహుల్‌ను పిలిచినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గంటలో వస్తానని చెప్పి ఒంగోలులోని ఇంట్లో నుంచి బయలుదేరిన రాహుల్... చాలాసేపటి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఆ మరుసటిరోజు తెల్లవారుజామున రాహుల్ మృతదేహాన్ని మాచవరం సమీపంలో కారులో గుర్తించారు. కారులో దిండు,తాడు దొరికాయి. దీంతో ఊపిరాడకుండా చేసి అతన్ని హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  కోగంటి సత్యం పాత్రపై అనుమానాలు...

  కోగంటి సత్యం పాత్రపై అనుమానాలు...


  మాట్లాడుదామని పిలిపించిన కోరాడ విజయ కుమారే రాహుల్ హత్యకు పాల్పడ్డాడా... లేక మరొకరితో హత్య చేయించాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో కోగంటి సత్యం అనే రౌడీ షీటర్ పేరు కూడా తెర పైకి వచ్చింది. రాహుల్ ఎప్పుడైతే జిక్సన్ సిలిండర్స్ కంపెనీని అమ్మేందుకు నిరాకరించాడో సత్యంను అతను రంగంలోకి దించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కంపెనీని కొంటానని రాహుల్‌తో సత్యం టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సత్యం విజయ్ కుమార్ మనిషి అని తెలిసి రాహుల్ దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ హత్యకు స్కెచ్ గీశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  అతని పైనే రాహుల్ కుటుంబ సభ్యుల అనుమానం...

  అతని పైనే రాహుల్ కుటుంబ సభ్యుల అనుమానం...

  ఐదేళ్ల క్రితం కెనడా నుంచి తిరిగొచ్చిన రాహుల్ 2015 నుంచి ఇప్పటివరకూ ఐదు కంపెనీలు పెట్టాడు. ఇందులో కోరాడ విజయ్ కుమార్,స్వామి కిరణ్,రాఘవ అనే వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నారు. రాహుల్ హత్యపై అతని తల్లిదండ్రులు కూడా విజయ్ కుమార్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయకుమార్ కుటుంబ సభ్యులు, అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.రాహుల్‌ హత్యకు నిందితులు పక్కా స్కెచ్‌ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

  ఆరోపణలను ఖండించిన కోగంటి సత్యం

  ఆరోపణలను ఖండించిన కోగంటి సత్యం

  తనపై వస్తున్న ఆరోపణల పట్ల కోగంటి సత్యం స్పందించారు. రాహుల్‌ హత్యతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు,రాహుల్ హత్య కేసులో ఓ పార్టీ వ్యక్తుల ప్రమేయం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రెండేళ్ల క్రితం జిక్సన్ సిలిండర్స్ కంపెనీని కొనుగోలు చేసిన ప్రయత్నం నిజమేనన్నారు. రాహుల్,విజయ్ మధ్య గొడవలు అందరికీ తెలిసినవేనని... అయితే ఆ గొడవలు ఎందుకనేది తనకు తెలియదన్నారు. విజయ్‌తో చాలాకాలంగా టచ్‌లో లేనని చెప్పారు.
  పోలీసుల విచారణలో అన్ని నిజాలు తేలుతాయన్నారు.

  కోగంటి సత్యంపై పలు కేసులు

  కోగంటి సత్యంపై పలు కేసులు

  గతంలో హైదరాబాద్‌లో స్టీల్ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో కోగంటి పేరు వినిపించింది. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా కోగంటి ఉన్నారు. విజయవాడ బెంజి సర్కిల్‌లో రూ.కోట్ల విలువైన భూమి ఇప్పటికీ ఆయన ఆధీనంలోనే ఉందని చెబుతుంటారు. బిషప్ భగవాన్ దాస్ హత్య కేసుతో పాటు 2008లో కాట్రగడ్డ బాబుపై కాల్పుల కేసులోనే కోగంటిపై ఆరోపణలున్నాయి. 2010లో కోగంటిపై కోకా యాక్ట్ కింద కేసు నమోదవడంతో నగర బహిష్కరణ కూడా విధించారు. భూవివాదంలో బోండా ఉమ, కోగంటి మధ్య జరిగిన గొడవల్లోనూ అతనిపై కేసు నమోదైంది. ఒక్క విజయవాడలోనే కోగంటిపై 30కి పైగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రికార్డుల్లోకి ఎక్కని కేసులు ఇంకా చాలానే ఉండొచ్చునని అంటున్నారు.గతంలో పాత సీసాల వ్యాపారం చేసిన కోగంటి ఇప్పుడు కోట్లకు పడగలెత్తారని చెబుతుంటారు.రాహుల్ హత్య కేసులో కోగంటి పాత్రపై ఆరోపణలు తప్పితే ఇప్పటికైతే ఎటువంటి ఆధారాలు లభించలేదు. కేసులో కీలక నిందితుడైన విజయ్ కుమార్ దొరికితే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

  English summary
  The murder of young industrialist Karan Rahul in Vijayawada Machavaram is causing a sensation in the state. Suspicions have been raised over the role of Vijay Kumar, Rahul's business partner in the murder. There is a propaganda that financial transactions led to the murder.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X