• search
 • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుని.. కొడుకునే చంపించింది:ఆ టీచర్‌ మాకొద్దు

By Suvarnaraju
|
  కూతురు భర్తతోనే సరసలాడుతున్న అత్త...!

  నెల్లూరు:కూతురు భర్తతోనే అక్రమ సంబంధం పెట్టుకొని కన్నకొడుకునే దారుణంగా హత్య చేయించిన ఆ అంగన్ వాడీ టీచర్ తమకు వద్దంటూ గమళ్లపాలెం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే...

  నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గమళ్లపాళెం అంగన్‌వాడీ కేంద్రం టీచర్‌ బొడుగు సీతారావమ్మ తమకు వద్దని గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అల్లుడితో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆమె సొంత కొడుకునే చంపించి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈ క్రమంలో గ్రామస్తులు అధికారులకు తమ వాదన వినిపించారు.

  The murderer doesnt want to be a teacher for our children: Parents Protest

  గమళ్లపాళెం అంగన్‌వాడీ కేంద్రం టీచర్‌ బొడుగు సీతారావమ్మ ను పోలీసులు హత్య కేసులో అదుపులోకి తీసుకున్నారని వార్తలు రావడంతో మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవో సునీలత సోమవారం ఈ విషయమై విచారణ చేసేందుకు గమళ్లపాళెం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు సీడీపీవో ఎదుట నిరసన తెలిపారు.

  ఇక్కడ అంగన్‌వాడీ కేంద్రానికి టీచర్‌గా ఉన్న సీతారావమ్మను వెంటనే తొలగించి మరొకరిని నియమించాలని కోరారు. అవసరమైతే ఈ విషయాన్ని కలెక్టర్‌కు కూడా తాము విన్నవించుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం సీడీపీవో మాట్లాడుతూ సునీలత మాట్లాడుతూ ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి పీడీకి, జేసీకి నివేదిక అందచేస్తానని వారికి హామీ ఇచ్చారు.

  గమళ్లపాళెంకు చెందిన బొడుగు కార్తీక్‌ (25) జూలై 17వ తేదీన హత్యకు గురయ్యాడు. జాతీయ రహదారి పక్కన కాల్వలో దొరికిన ఈ మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేకపోవడంతో అనాథ శవంగా భావించి ఖననం చేసేశారు. అలా మూడు వారాలుగా మిస్టరీగానే ఉండిపోయిన ఈ హత్య కేసులో పోలీసులకు ఉన్నట్లుండి లభించిన కీలక సమాచారంతో మిస్టరీ వీడటం ఖాయం అయింది.

  పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కార్తీక్‌ తల్లి తన పెద్ద కుమార్తె భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది కుమారుడికి తెలిసి అతడు రోజూ మద్యం తాగొచ్చి తల్లిని తీవ్రంగా దుర్భాషలాడటంతో పాటు కొట్టేవాడు. దీంతో ఎలాగైనా కొడుకును వదిలించుకోవాలని నిర్ణయించుకున్న అతడి తల్లి ఇదే విషయమై అల్లుడితో సంప్రదించి కొడుకు కార్తీక్‌ హత్యకు పథకం రచించింది. అందుకు కిరాయి హంతకులను మాట్లాడివారికి రూ. 5 లక్షలు సుపారి ముట్టచెప్పి కొడుకును చంపించినట్లు తెలుస్తోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  An Anganwadi teacher who was planned and cooperated for son murdered background of illegal contact with son in law. Following the arrest of the accused, the villagers held a protest against her for her removal from Anganwadi teacher post.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more