వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రి ...'గంట' మోగించి బాంబ్ పేల్చిన ఏపీ మంత్రి .. స్కామ్ ఇదే!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కి సంబంధించిన మాజీ మంత్రులకు టెన్షన్ పట్టుకుంది. వరుసగా ఒక్కొక్క మాజీ మంత్రి అరెస్టు అవుతున్న పరిస్థితులు మిగతా మాజీలకు నిద్ర పట్టకుండా చేస్తుంది. వైసీపీ నేతలు కూడా ఏపీలో తెలుగుదేశం పార్టీలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది ముందే చెప్పేస్తున్నారు. ఆసక్తికర వ్యాఖ్యలు, ట్వీట్లు చేస్తూ మాజీ మంత్రుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు.

వర్తమానం లేదు.. భవిష్యత్తు లేదు.. చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు : విజయసాయి వ్యంగ్యంవర్తమానం లేదు.. భవిష్యత్తు లేదు.. చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు : విజయసాయి వ్యంగ్యం

 టీడీపీలో నెక్స్ట్ టార్గెట్ ఆయనే .. బాంబు పేల్చిన మంత్రి

టీడీపీలో నెక్స్ట్ టార్గెట్ ఆయనే .. బాంబు పేల్చిన మంత్రి

ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, వైసిపి నేత మోకా భాస్కర హత్యకేసులో కొల్లు రవీంద్ర అరెస్టయి విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారంగా మారాయి.

నెక్ట్స్ టార్గెట్ గంటా శ్రీనివాస్ అంటూ అవంతి విమర్శలు

నెక్ట్స్ టార్గెట్ గంటా శ్రీనివాస్ అంటూ అవంతి విమర్శలు

ఒకవైపు టిడిపి నేతలు ఏపీలో పరిస్థితులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాటం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్‌ను కలిసి గత 13 నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న దౌర్జన్యకర వాతావరణం, రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న ఘటనల గురించి రాష్ట్రపతికి వివరించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి అవంతి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను అరెస్టు చేశామని, నెక్ట్స్ టార్గెట్ గంటా శ్రీనివాస్ అంటూ నేరుగా మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడం చూస్తే ప్రభుత్వం కావాలనే టీడీపీలో కొంతమంది నేతలను టార్గెట్ చేసినట్లు అర్థమవుతోందని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

వైజాగ్ లో భూకుంభకోణం చేసిన గంటా అనుచరులు

వైజాగ్ లో భూకుంభకోణం చేసిన గంటా అనుచరులు

బెదిరింపు వాతావరణం ఏపీలో పెరుగుతోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు హయాంలో అన్ని కుంభకోణాలు జరిగాయని, విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో విశాఖలో 400 కోట్ల భూమి అన్యాక్రాంతం కాకుండా చూశామని, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక గజం కూడా ఆక్రమణకు గురి కాలేదని పేర్కొన్నారు. అంతేకాదు గంటా శ్రీనివాస్ అరెస్ట్ కాకతప్పదని వ్యాఖ్యానించారు.

స్కూల్ పిల్లల సైకిళ్ళ కొనుగోలు కుంభకోణం

స్కూల్ పిల్లల సైకిళ్ళ కొనుగోలు కుంభకోణం

అయితే అవంతి వ్యాఖ్యలకు ముందే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గంటా శ్రీనివాస్ ను టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా గంటా అవినీతి అక్రమాలను తూర్పారబట్టారు .స్కూల్ పిల్లల కోసం కొనుగోలు చేసిన సైకిళ్ళలో ఐదు కోట్ల అవినీతి జరిగిందని తుప్పు సైకిళ్లపై గంట శీను గణ గణ... 12 కోట్ల కొనుగోళ్లలో ఐదు కోట్ల అవినీతి... ఎస్కే బైక్స్ వద్దనుండి కొన వద్దని బ్లాక్ లిస్ట్ చేసినా బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేయడంతో ఫిర్యాదుల వెల్లువ అంటూ పేర్కొన్నారు.

శీను మాయ త్వరలో తెలుస్తుందన్న విజయసాయి

శీను మాయ త్వరలో తెలుస్తుందన్న విజయసాయి

అంతేకాదు బడికొస్తా పథకం పేరుతో 1,82,000 సైకిల్స్ పంపిణీ చేశారట. ఎవరికి అందాయో, ఇచ్చినట్టు రికార్డుల్లో రాశారో దర్యాప్తులో వెల్లడవుతుంది. 30 40 ఏళ్ల కిందటి సైకిల్స్ ఇప్పటికి రోడ్లపైన కనిపిస్తుంటే, మూడేళ్లలోనే అమ్మాయిలు సైకిళ్ల గంటలు ఎందుకు మూగబోయాయో శీను మాయ తెలియాల్సి ఉంది అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెక్స్ట్ గంటా శ్రీనివాస్ మెడకు ఉచ్చు బిగుస్తోంది అన్న భావన కలిగిస్తుంది. ఈ వ్యాఖ్యలకు ఊతమిస్తూ అవంతి శ్రీనివాస్ నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది గంటా శ్రీనివాస్ అని తేల్చిచెప్పడంతో ఇప్పుడు ఏపీలో సైకిళ్ల కుంభకోణంపై ఆసక్తి నెలకొంది.

సైలెంట్ గా ఉన్నా గంటాకు అరెస్ట్ తప్పేలా లేదని సంకేతాలు

సైలెంట్ గా ఉన్నా గంటాకు అరెస్ట్ తప్పేలా లేదని సంకేతాలు

ఇప్పటికే గంటా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఒక దశలో వైసీపీ తీర్ధం పుచ్చుకోవాలని కూడా ప్రయత్నం చేశారు . ఇక ఇంతగా వివాదాలకు దూరంగా ఉంటున్నా అవంతి శ్రీనివాస్ మాత్రం గంటా శ్రీనివాస్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు . దీంతో తాజాగా గంటా విషయంలో ఏం జరగబోతోంది అన్న ఆసక్తి కనిపిస్తుంది. టిడిపి నేతలలో మాత్రం భయంకరమైన ఆందోళన కనిపిస్తుంది. ఎప్పుడు ఎవరిని వైసీపీ సర్కార్ టార్గెట్ చేస్తుందో అన్న భయం వారిని వేధిస్తుంది.

English summary
Tensions are running high for former TDP ministers in the state of Andhra Pradesh. The circumstances under which ex-ministers are being arrested in a row will make the rest of the former ministers sleep deprived. YCP leaders are also predicting who will be the next target in the Telugu Desam Party in the AP. Ganta Srinivas has joined the fray, ycp minister avanthi srinivas and mp vijaya sai reddy making interesting comments and tweets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X