వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో రెండు రోజులు భారీ వర్షాలే..! బంగాళా ఖాతంలో అల్పపీడనమే కారణమంటున్న అదికారులు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాలు || Oneindia Telugu

అమరావతి/హైదరాబాద్ : ఏపిలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో ముసురుపట్టి, ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఇందుకు కారణమని వాతావరణ శా: అదికారులు చెప్పుకొస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా జల్లులు పడుతున్నాయి. ఈ జిల్లాలో శుక్రవారం సగటున 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ జిల్లాలో సగటు వర్షపాతం 52.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీలో పలు ప్రాంతాలతోపాటు మెట్ట, మైదాన, డెల్టా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.

గడిచిన 24 గంటల్లో ఈ జిల్లాలో 2192.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వేటకు వెళ్లిన మత్స్యకారులను తిరిగి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. గడిచిన 24గంటల్లో ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో గరిష్ఠంగా 63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. రెండురోజులుగా వర్షాలతో విశాఖ నుంచి ప్రకాశం జిల్లా వరకు వర్షపాతం మెరుగైంది. ప్రకాశం జిల్లాలో 4.6 మి.మిసాధారణం కన్నా అధికంగా వర్షపాతం నమోదయింది.

The next two days are heavy rains..!

తూర్పుగోదావరిలో వాన లోటు 6.5ు, గుంటూరు జిల్లాలో 10.3మి.మీ, విశాఖజిల్లాలో 12.1మిమీ, కృష్ణా జిల్లాలో 13.8మిమీ, పశ్చిమగోదావరిలో 18మిమీ, చిత్తూరులో 19.8శాతానికి వానలోటు తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ లో 251.7మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటికి 196.6 మి.మీ. కురిసింది. ఫలితంగా 91మండలాల్లో అధిక వర్షాలు కురవగా, 199మండలాల్లో సాధారణ స్థాయిలో వర్షాలు పడ్డాయి. కడప, అనంతపురం జిల్లాల్లో వానలోటు కొనసాగుతోంది. మిగిలిన జిల్లాల్లో వర్షపాతం కాస్త మెరుగయింది. దీంతో వ్యవసాయ దారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

English summary
The southern coastal districts of the Aegean have a mask and a downpour of rainfall. The only reason for this is the low pressure in the Bay of Bengal. In Krishna, Guntur, Prakasam and Kurnool districts, there are no incessant showers. The district recorded an average rainfall of 20 millimeters on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X