వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ నాయకుల సిత్రాలు .. ఉదయం వైసీపీ తీర్ధం .. సాయంత్రానికి టీడీపీ బాట

|
Google Oneindia TeluguNews

Recommended Video

Leaders Who Joined The YCP In The Morning,Walked Through The TDP In The Evening | Oneindia Telugu

నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా వుంది ఏపీలోని కొందరు నాయకుల పరిస్థితి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే చోటు చేసుకుంటున్న చిత్ర విచిత్రాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని పార్టీల్లో జంప్ జిలానీల సందడి నెలకొన్నా ఉదయం వైసీపీ లో చేరి మళ్ళీ తిరిగి సాయంత్రానికే టీడీపీ కండువా కప్పుకున్న చిత్రాలైతే ఇప్పట వరకు కనిపించలేదు. తాజాగా అలాంటి విచిత్రమూ చోటు చేసుకుంది.

<strong>ఎయిర్ ఇండియా ఉమెన్స్ డే స్పెషల్ : మహిళా సిబ్బందితోనే పూర్తి సర్వీసులు</strong>ఎయిర్ ఇండియా ఉమెన్స్ డే స్పెషల్ : మహిళా సిబ్బందితోనే పూర్తి సర్వీసులు

ఉదయం వైసీపీలో చేరిన కొందరు తిరిగి సాయంత్రానికే టిడిపి బాట పట్టి తూచ్ అదేం లేదు అంటూ అందరినీ అవాక్కయ్యేలా చేసిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన కొందరు కార్యకర్తలు ఉదయం ఒక పార్టీ లో చేరి.. సాయంత్రం కల్లా తిరిగి తమ సొంత పార్టీలోకి చేరిపోయారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఆదుకుంటామని చెప్తే ముందు వైసీపీలో చేరామని , వారు చెప్పింది అబద్ధం అని తెలియటంతో తిరిగి టీడీపీ కి వచ్చామని చెప్తున్న వారి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

The peculiarities of the AP leaders.. joined YCP in the morning AND TDP in the evening


అసలు విషయానికి వస్తే గుంటూరు జిల్లా మునగోడు లో వ్యక్తిగత కారణాలు, ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న తమను ఆదుకుంటామని ప్రతిపక్ష పార్టీ నాయకుల మాటలు నమ్మి ఉదయం టీడీపీని వదలి వైసీపీలో చేరారట కొందరు కార్యకర్తలు. పార్టీలో చేరిన తరువాత ఆ పార్టీ నాయకులు చెప్పిన మాటలు అబద్దమని తెలిసి తిరిగి సాయంత్రానికి తెలుగుదేశం పార్టీలో చేరారట .. గ్రామానికి చెందిన కొందరు స్థానిక నాయకుల మాటలు విని నియోజకవర్గ ఇన్‌చార్జి నంబూరి శంకరరావు సమక్షంలో క్రోసూరు పార్టీ కార్యాలయంలో వైసీపీలో చేరారు. కండువాలు వేసిన తరువాత తమను ఆదుకుంటామని చెప్పి భోజనం పెట్టి పంపించారని, కోపంతో మరలా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ వద్దకు వచ్చి తాము తప్పు చేశామని తాము టీడీపీ కట్టుబడి ఉంటామని మళ్లీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ విచిత్రం చూసిన వాళ్ళంతా నోరెళ్ళబెట్టి మరీ అవాక్కయ్యారు. అసలు ఆదుకోవటం అంటే ఏమిటో గానీ మొత్తానికి బడా నేతలే కాదు చోటా మోటా లీడర్లు కూడా అవకాశవాద రాజకీయాల్లో ఆరితేరిపోయారు అనేది ఈ ఘటనతో అర్ధం అవుతుంది.

English summary
A strange incident took place in Munagodu village of Guntur district. In the backdrop of the coming election, they joined the YCP. Leaders who joined the YCP in the morning walked through the TDP in the evening. The yCP leaders told them that they would be able to sustain themselves with financial difficulties, but the joinees said they were wrong in the evening and they told that they will continue in TDP only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X