వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్ పుట్టుకతోనే అబద్దాలకోరు..!ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లే వ్యక్తి నీతులా? బాబు ఫైర్!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : 43వేల కోట్ల కుంభకోణంలో ప్రమేయం ఉన్న వ్యక్తి, ప్రతి శుక్రవారం నాంపల్లి సీబిఐ కోర్టుకు హాజరయ్యే వ్యక్తి గుణగనాల గురించి తోటి మంత్రులు ప్రశంసలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉందని ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఉదహరిస్తూ టీడిపి జాతీయ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతి కోసం, సత్వర అబివృద్ది కోసం చిత్త శుద్దితో పనిచేసిన తనకు అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారని, చంద్రబాబు జగన్ తో పాటు ఆయన మంత్రి వర్గ సహచరులపైన ఆగ్రహం వ్యక్తం చేసారు.

కరకట్ట ఇళ్లపైన జగన్ తేల్చేసారు: పేదల విషయంలో మాత్రం ఉదారంగా: ఆ బాధ్యత మనపై ఉంది..!కరకట్ట ఇళ్లపైన జగన్ తేల్చేసారు: పేదల విషయంలో మాత్రం ఉదారంగా: ఆ బాధ్యత మనపై ఉంది..!

 43వేల కోట్ల కుంభకోణంలో జగన్..! నైతిక విలువల గురించి మాట్లడే అర్హత లేదన్న బాబు..!!

43వేల కోట్ల కుంభకోణంలో జగన్..! నైతిక విలువల గురించి మాట్లడే అర్హత లేదన్న బాబు..!!

ఏపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్దాయిలో ద్వజమెత్తారు. శుక్రవారం గుంటూరు లో మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ విధానాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతలు, అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తూ తాత్కాలిక ఆనందం పొందుతున్నారని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తప్పు చేసినవారు ఎప్పటికైనా శిక్షార్హులేనని అన్నారు.

అధికారులను జగన్ బెదిరిస్తున్నాడు..!

అధికారులను జగన్ బెదిరిస్తున్నాడు..!

ముఖ్యమంత్రి జగన్ ఒత్తిడి చేస్తే తప్పులు చేస్తారా? అంటూ అధికారులను ప్రశ్నించారు. స్వార్థం కోసం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, రివర్స్‌ టెండరింగ్‌ వల్ల రాష్ట్రానికి రూ. ఏడువేల ఐదు వందల కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన లేదని, ఎవరు చెప్పినా పట్టించుకోదని, మూర్ఖంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ తీరువల్ల 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.

అంతా చట్టాల ఉల్లంఘనే..!మూల్యం చెల్లించక తప్పదన్న ఏపి మాజీ సీఎం..!!

అంతా చట్టాల ఉల్లంఘనే..!మూల్యం చెల్లించక తప్పదన్న ఏపి మాజీ సీఎం..!!

గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షల్లో అవకతవకలు జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. పీపీఏలపై కేంద్రమంత్రి లేఖ రాసినా జగన్ పట్టించుకోవడం లేదని చంద్రబాబు మండిపడ్డారు.

 విద్యుత్ ఒప్పందాల్లో అవస్తవాలు..! అధికారులను బలిపశువులను చేయొద్దన్న చంద్రబాబు..!!

విద్యుత్ ఒప్పందాల్లో అవస్తవాలు..! అధికారులను బలిపశువులను చేయొద్దన్న చంద్రబాబు..!!

విద్యుత్ ఒప్పందాల్లో అవాస్తవాలను ప్రచారం చేసుకుంటున్నారని, అందుకు అధికారులను బలిపశువులను చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చట్లాలను ఉల్లంఘిస్తున్న జగన్ ప్రభుత్వం ఎప్పటికైనా మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. పిపిఏ ఒప్పందాలు రాష్ట్రానికి రాష్ట్రానికి మద్య వ్యత్యాసం ఉంటుందని, తాజా పరిణామాలను బట్టి మారుతుందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి పుట్టుకతోనే అబద్దాలు చెప్పడం అలవాటు చేసుకున్నడని, తాను చేస్తున్న తప్పులను ఇతరులపైన రుద్దడంలో జగన్ ది అందె వేసిన చెయ్యని చంద్రబాబు విమర్శిలు గుప్పించారు.

English summary
The man who was involved in the 43 thousand crore scandal, AP former cm, TDP National President Chandrababu Naidu, quoting CM Jagan Mohan Reddy, said that it was ridiculous to praise fellow ministers about the virtues of the person who attends the nampally CBI court every Friday They were.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X