విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ జిల్లాల్లో మరి కొంతసేపట్లో పిడుగులు పడే అవకాశం...ఈ నెల 22 లేదా 23న అల్పపీడినం

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఇటీవలి కాలంలో వాతావరణంలోని మార్పులను ఖచ్చితత్వానికి దగ్గరగా అంచనా వేయగలుగుతున్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తాజాగా మరో కీలకమైన హెచ్చరిక చేసింది.

వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పుల కారణంగా మరికొద్ది సేపట్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు పడే అశకాశం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమప్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేసింది. విశాఖలోని చోడవరం, బుచ్చయ్యపేట, కశింకోట, రావికమతం, మాకవరపాలెం, యలమంచిలి, మునగపాకలో పిడుగులు పడే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు తెలిపారు.

The possibility of thunderbolts down in these districts:State Disaster Management Department

అలాగే తూర్పుగోదావరి జిల్లాలో అడ్డతీగల, వై.రామవరం, గంగవరం, రంపచోడవరం మండలాలకు పిడుగు హెచ్చరికలు జారీచేశారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆరుబయట నుంచి వీలైనంత త్వరగా సురక్షిత భవనాలకు తరలివెళ్లి తలదాచుకోవాలని వారు సూచించారు.

ఇదిలా ఉండగా ఒడిసా నుంచి కోస్తా మీదుగా తమిళనాడువరకు ద్రోణి కొనసాగుతున్న క్రమంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ నెల 22 లేదా 23న దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనున్నదని ఆర్టీజీఎస్‌, ఇస్రో నిపుణుడు ముందస్తు హెచ్చరిక చేశారు.

English summary
Amaravathi:The State Disaster Management Department has issued warnings the areas of Visakhapatnam and East Godavari districts is likely to be face the thunderbolts In a while.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X