• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో ప్రారంభం అయిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌... దేశ వ్యాప్తంగా 19 స్థానాల్లో ఎన్నికలు

|

దేశవ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు నేడు జరుగుతున్న పోలింగ్ లో భాగంగా ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు నేడు జరగనున్న పోలింగ్ లో నలుగురు సభ్యులకు గాను ఐదుగురు సభ్యులు రేసులో ఉన్నారు.అధికార పార్టీ నుండి నలుగురు పోటీ చేస్తుండగా, టిడీపి కూడా అభ్యర్థిని రంగంలోకి దించింది. దీంతో ఎన్నిక అనివార్యమైన పరిస్థితి కనిపిస్తుంది.

ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి..అక్రమ కేసులు అన్యాయం .. ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

ఏపీలో నాలుగు స్థానాలకు ఐదుగురు పోటీ

ఏపీలో నాలుగు స్థానాలకు ఐదుగురు పోటీ

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా పరిమళ్ నత్వానీ,మోపిదేవి వెంకటరమణ,ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ నుండి వర్ల రామయ్య బరిలో ఉన్నారు. మొత్తం 175 మంది శాసనసభ్యులు ఏపీ అసెంబ్లీలో నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు పోలింగ్ కొనసాగనున్న నేపథ్యంలో అసెంబ్లీ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశారు.

రాజ్యసభ ఎన్నికకు కావాల్సిన బలం లేకున్నా అభ్యర్థిని రంగంలోకి దించిన టీడీపీ

రాజ్యసభ ఎన్నికకు కావాల్సిన బలం లేకున్నా అభ్యర్థిని రంగంలోకి దించిన టీడీపీ

ఇక వాస్తవానికి టీడీపీకి రాజ్యసభ ఎన్నికకు అవసరమైనబలం లేనప్పటికీ, రాజకీయ వ్యూహంలో భాగంగానే వర్ల రామయ్య బరిలోకి దించి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించింది. దీంతో ప్రస్తుతం ఏపీలో ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇక ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పోలింగ్ కు ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఏర్పాట్లను సమీక్షించారు.

వైసీపీకి బలమున్నా వర్ల రామయ్య బరిలో ఉండటంతో ఆసక్తి

వైసీపీకి బలమున్నా వర్ల రామయ్య బరిలో ఉండటంతో ఆసక్తి

ఇక ఒక్కో అభ్యర్థి రాజ్యసభకు ఎన్నిక అయ్యేందుకు 36 తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరమవుతాయి. పోలింగ్లో పాల్గొనే వారి సంఖ్య తగ్గితే ఆ మేరకు గెలిచేందుకు అవసరమైన ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతమున్న సంఖ్యాబలాన్ని బట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. కానీ టిడిపి చాలా వ్యూహాత్మకంగా వర్ల రామయ్య బరిలోకి దించటంతో ఈ ఎన్నిక ఆసక్తిని కలిగిస్తుంది. రాజ్యసభ అభ్యర్థుల పోలింగ్ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి పరిమళ్‌ నత్వానీ తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు .

 దేశ వ్యాప్తంగా 19 స్థానాల్లో కొనసాగుతున్న ఎన్నికలు

దేశ వ్యాప్తంగా 19 స్థానాల్లో కొనసాగుతున్న ఎన్నికలు

ఒక ఏపీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఏడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 19 రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీలో 4, గుజరాత్ 4, మధ్యప్రదేశ్ లో 3, రాజస్థాన్లో 3, జార్ఖండ్ లో రెండు, మణిపూర్లో 1, మిజోరాంలో 1 మేఘాలయాలో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది. ఇక వైఎస్సార్సీపీ తరఫున ఏపీ అసెంబ్లీ హాల్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, టిడిపి తరఫున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పార్టీ ప్రతినిధులుగా పోలింగ్ బూత్ లో కూర్చున్నారు.

English summary
Polling for four Rajya Sabha seats in AP began today as part of polling for 19 Rajya Sabha seats across the country. Five members are in the race for four seats in four Rajya Sabha seats in AP today. This makes the election inevitable and interesting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X