వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

APలో జీన్స్, టీ షర్టులు వేసుకోవద్దు! జుట్టు వదులుగా వదిలేయకూడదు!!

|
Google Oneindia TeluguNews

వైద్య విద్యార్థులు జీన్స్‌ ప్యాంట్లు, టీ షర్టులు వేసుకోవద్దని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) స్పష్టంచేసింది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు చీర ధరించాలి లేదంటే చుడీదార్లు మాత్రమే వేసుకోవాలని సూచించింది. డీఎంఈ కార్యాలయంలో వారాంతపు సమీక్ష జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను బోధనాసుపత్రులకు పంపించారు. ప్రధానంగా ఈ డ్రస్‌ కోడ్‌ను ప్రస్తావించారు.

ఎంబీబీఎస్‌, పీజీ వైద్య విద్యార్థులు ఇకనుంచి శుభ్రంగా ఉండే దుస్తులు ధరించడంతోపాటు గడ్డం గీసుకోవాలి. మహిళలు తమ జుట్టు వదిలేయకూడదు. స్టెతస్కోప్‌, యాప్రాన్‌ను తప్పనిసరిగా ధరించాలని డీఎంఈ కార్యాలయం సూచించింది. నిర్దేశించిన డ్రస్‌ కోడ్‌ను కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది పాటించడంలేదు.

 The State Director of Medical Education (DME) has clarified that medical students should not wear jeans pants and T-shirts.

ఈ విషయాన్ని గమనించిన ఉన్నతాధికారులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. బోధనాసుపత్రులకు వచ్చే రోగులను ఇన్‌పేషంట్లుగా చేర్చుకోవాల్సిన సందర్భం వస్తే.. వారివెంట సహాయకులు లేరని తిరస్కరించరాదని ఆదేశించింది. ఫేస్ రికగ్నైజ్డ్ హాజరు విధానాన్ని అమలు చేయాలని డీఎంఈ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేశారు.

ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న విడుదల రజని రాష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రులతోపాటు ప్రధానమైన ఆసుపత్రులన్నింటినీ ఒక షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేసుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో తాను గుర్తించినవాటిని ఉన్నతాధికారులతో చర్చించి అమలు చేయిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి జిల్లాకు ఒక బోధానాసుపత్రి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నారు.

English summary
The State Director of Medical Education (DME) has clarified that medical students should not wear jeans pants and T-shirts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X