విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్నిఫర్ డాగా...మజాకా... పోలీస్ కుక్కకు ఘనంగా అంత్యక్రియలు

|
Google Oneindia TeluguNews

ఒకటి కాదు రెండు ఏకంగా 130 కేసులను చేధించింది. క్రిమినల్స్ పట్టివ్వడంలో తన పాత్రను అధ్భుతంగా పోషించింది. అందుకే రాష్ట్రస్థాయి అవార్డును కూడ తీసుకుంది. అయితే దురదృష్టవశాత్తూ ఫుట్‌బాల్ అడుతూ గాయాలపాలైన వర్ష అనే పోలీస్ స్నిఫర్ డాగ్‌కు మృతి చెందింది. దీంతో దానికి ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు విజయనగరం పోలీసులు.

కుక్కకు సైతం ప్రభుత్వ లాంఛనాలు

కుక్కకు సైతం ప్రభుత్వ లాంఛనాలు

పోలీస్ వ్యవస్థలో ప్రజలకు సేవ చేసిన అధికారులు, అనధికారులకే కాదు క్రిమినల్స్‌ను పట్టించడంలో ప్రముఖపాత్ర పోషించిన కుక్కలకు కూడ ప్రముఖ స్థానం లభిస్తోంది. క్రిమినల్స్ పట్టుకోవడంలో పోలీసులు ఎంతగా ప్రయత్నాలు చేస్తారో తెలుసు అయితే ప్రయత్నాలకు స్నిఫర్ డాగ్స్ రూపంలో ఉన్న కుక్కలు అంతే కృషి చేస్తాయి. ఒక దశలో కుక్కలు పట్టించిన కీలక సాక్ష్యాలకే నిందితులను పట్టించేందుకు మూలాధారాలు చాల కేసుల్లో ఉన్నాయి. ఇందులో భాగంగానే తమకు పలు కేసుల్లో సహకరించి క్రిమినల్స్ పట్టించిన కుక్కులకు సైతం పోలీసులు ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేస్థారు. తాజగా విజయనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ స్నిఫర్ డాగ్‌కు కూడ పోలీసులు ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు.

ఇప్పటి వరకు 130 కేసుల్లో క్లూస్ అందించిన స్నిఫర్ డాగ్

ఇప్పటి వరకు 130 కేసుల్లో క్లూస్ అందించిన స్నిఫర్ డాగ్

వర్ష పోలీస్ స్నిఫర్ డాగ్ హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో ట్రైనింగ్ తీసుకుంది. కాగా వర్ష మూడు నెలల వయస్సులో ఉన్నప్పుడే క్రిమినల్స్ పట్టించిందని వర్షను హండీల్ చేసే పోలీస్ అధికారి శ్రీనివాస రావు తెలిపారు. ఇలా ఇప్పటి వరకు గత ఎనిమిదేళ్లుగా 130 కేసుల్లో పలువురి దోషులను పట్టించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే విజయనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ జరిగిన మహిళ తన భర్త చంపిన హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తుందని తెలిపారు.

ఫుట్‌బాల్ అడుతుండగా గాయాలు

ఫుట్‌బాల్ అడుతుండగా గాయాలు

కాగా ఇలాంటీ పలు కేసుల్లో నిందితులను వర్ష పట్టించదని తెలిపారు. మరోవైపు పోలీస్ కూంబింగ్‌లతోపాటు వీవీఐపీ భద్రతలో కూడ పాల్గోందని తెలిపారు. అయితే ఎనిమిది సంవత్సరాల వయస్సున్న తాను చేసిన సహాసాలకు గాను బెస్ట్ స్నిఫర్ డాగ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు కూడ తీసుకుంది.అయితే నాలుగు రోజుల క్రితం ఫుట్ బాల్ ఆడుతున్న సంధర్భంలో దవడలకు దెబ్బతాకి రక్తస్రావం జరిగింది. దీంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు, తీవ్ర రక్త స్రావం జరుగుతున్న వర్షకు మరోకుక్క యొక్క రక్తాన్ని కూడ ఎక్కించారు కాని డాక్టర్ల ప్రయత్నాలు ఫలించకపోవడం స్నిఫర్ డాగ్ మృతి చెందినట్టు ఎఏస్పీ తెలిపారు. దీంతో ప్రభుత్వ లాంచనాలతో ఆదివారం ఖననం చేశారు.

English summary
An eight-year-old, award-winning female police dog died after an injury in Vizianagaram on Saturday evening. She had helped the local police in cracking 130 criminal cases and was reportedly injured while playing football.The Vizianagaram police officers have cremated the Doberman- Varsha with full state honours on Sunday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X