విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులు గంటా,అయ్యన్నమధ్య మళ్లీ రేగిన చిచ్చు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం:ఎపి మంత్రులు...పాత శత్రువులు అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య మళ్లీ ఓ విషయం చిచ్చు రేపింది. ఆ తరువాత ఈ చిచ్చు సెగ ఇన్చార్జ్ మంత్రి, విశాఖ జిల్లా కలెక్టర్ కు కూడా బాగా తాకి చివరకు రచ్చ రచ్చ అయింది.

ఇంతకీ విషయం ఏమిటంటే...విశాఖ జిల్లా పశుగణాభివృద్ధి సంస్ధ కమిటి ఛైర్మన్ విషయంలో మంత్రి అయ్యన్నపాత్రుడు ఆదేశాన్ని తోసిరాజని మరో మంత్రి గంటా శ్రీనివాసరావు సూచనలతను జిల్లా కలెక్టర్ ఫాలో కావడమే ఈ అగ్గి రాజుకోవడానికి కారణమైంది.

తాను స్పష్టంగా చెప్పినా వినకుండా తన ఆదేశాలను బేఖాతరు చేసి గంటా మాట వింటారా అంటూ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి చినరాజప్ప, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను దులిపేసిన మంత్రి అయ్యన్న ఇదే విషయంపై అవసరమైతే తన మంత్రి పదవికి రాజీనామాకైనా సిద్దమే అని ప్రకటించడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది.

వివాదం...ఎందుకంటే?...

వివాదం...ఎందుకంటే?...

విశాఖ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ పాలకవర్గం పదవీ కాలం ఈ నెల 5వ తేదీతో ముగియనుంది. కాంగ్రెస్‌ హయాంలో ఏర్పాటు చేసిన ఈ పాలకవర్గానికి రాఘవేంద్రరావు అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, రెండు దఫాలుగా ఈ కమిటీయే కొనసాగుతూవస్తోంది. ఈ నేపథ్యంలో పదవీకాలం ముగియనుండటంతో కొత్త పాలకవర్గం ఏర్పాటు కోసం కసరత్తు మొదలైంది. ఎప్పుడో కాంగ్రెస్ పాలనలో నియమించబడిన పాలకవర్గం ఇప్పటికీ కొనసాగుతుండటంపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వెంటనే కొత్త పాలకవర్గం ఏర్పాటు చేయాల్సిందేనని 2018 జనవరిలో కలెక్టర్‌ ప్రవీణ్ కుమార్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో పాత పాలకవర్గం స్థానంలో నూతనంగా 17మందిని నామినేట్‌ చేస్తూ కలెక్టర్‌ అదే నెలలో ఆదేశాలు జారీ చేశారు.

 అధ్యక్షపదవి విషయమై రగడ...

అధ్యక్షపదవి విషయమై రగడ...

అయితే నూతన పాలకవర్గంను నామినేట్‌ చేసిన 21 రోజుల తర్వాత కొత్త అధ్యక్ష పదవికి ఎన్నికల కోసం జనవరి 21న కలెక్టర్‌ పేరిట నోటీసులు జారీ అయ్యాయి. ఈ దశలో జనవరి 23న మంత్రి అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకొని కొత్తగా అధ్యక్ష పదవికి ఎన్నికలు వద్దని, పాత పాలకవర్గాన్ని కొనసాగించాలంటూ కలెక్టర్ కు మంత్రి అయ్యన్న పాత్రుడు సిఫార్సు లేఖ పంపారు. అయితే అప్పటికే కలెక్టర్ జారీ చేసిన ఎన్నికల నోటీసులు బైటకు రావడంతో మంత్రి గంటా సూచన ప్రకారం బైలా అనుసరించి జనవరి 27న ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో భీమిలికి చెందిన మాజీ ఎంపీపీ, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు గాడు వెంకటఅప్పడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించి సర్టిఫికెట్‌ కూడా ఇచ్చేశారు.

దీంతో అవమానంగా...భావించిన అయ్యన్న

దీంతో అవమానంగా...భావించిన అయ్యన్న

అయితే తాను పాత అధ్యక్షుడినే కొనసాగించాలని చెప్పినా తన మాట తోసిరాజని కలెక్టర్ ఎన్నిక నిర్వహించడం...తన మద్దతుదారుడిని తొలగించి ఆ పదవిలో
మంత్రి గంటా శ్రీనివాసరావు మద్దతుదారుడిని నియమించటంతో మంత్రి అయ్యన్నపాత్రుడు రగిలిపోయారు. ఈ విషయాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప దగ్గర ప్రస్తావించి పంచాయితీ పెట్టినట్లు తెలుస్తోంది. ఒక వైపు టిడిపి సీనియర్ నేత పట్టుదల మరోవైపు పార్టీ బాగుకోసమేనంటున్న మంత్రి గంటా మాటలతో క్లిష్టతరంగా మారిన ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్ధంకాక నిమ్మకాయల చినరాజప్ప సతమతమైపోయారు.

 నియామకాలు...నిలుపుదల

నియామకాలు...నిలుపుదల

జిల్లా పశుగణాభివృద్ధి సంస్ధ కమిటి ఛైర్మన్ గా ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని ఈ కమిటీకి చైర్మన్‌గా ఎలా నియమిస్తారంటూ కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అయ్యన్నపాత్రుడు ఇదే విషయాన్నిఇన్‌చార్జి మంత్రి చినరాజప్పతో పాటు సీఎంఒ కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికను వెంటనే నిలుపు చేయకుంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ చినరాజప్పకు స్పష్టం చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో కలెక్టర్ తప్పనిసరి పరిస్థితుల్లో పశుగణాభివృద్ధి సంస్థ ఈవోతోపాటు పశుసంవర్ధక శాఖ జేడీ, ఇతర అధికారులను పిలిపించుకొని పరిస్థితిని సమీక్షించారు. తొలుత 17మందిని నామినేట్‌ చేయడమే కాకుండా ఎన్నికల నిర్వహణకు స్వయంగా ఆదేశాలిచ్చిన కలెక్టర్‌ మంత్రి అయ్యన్నపంతంతో కొత్త పాలకవర్గ నియామకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాల్సివచ్చింది. అయితే ఈ విషయంపై మంత్రి గంటా కూడా పట్టుదలతో ఉండటంతో ఈ వ్యవహారం ఎక్కడకు దారితీస్తుందోనని ఇటు టిడిపి మద్దతుదారులు, అటు అధికారులు అందరూ భయపడుతున్నారు.

క్లిష్ట సమయంలో...తలనొప్పిగా వివాదం

క్లిష్ట సమయంలో...తలనొప్పిగా వివాదం

ఎపిలో రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు నెలకొన్నఈ సమయంలో ఇద్దరు మంత్రులు ఇలా అనవసర విషయంలో జోక్యం చేసుకోవడమే కాకుండా...దాన్ని సర్ధుబాటు దిశలో కాకుండా ఇద్దరూ పంతానికి పోయి పార్టీ పరువును బజారు కీడ్చేవరకు వెళ్లడంపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. ఇద్దరు మంత్రులు పార్టీకి అండగా నిలవాల్సిన ఈ సమయంలో ఇరువురూ మరింత ఇబ్బందిపెట్టేలా వ్యవహరిస్తుండటం...తమ వ్యక్తిగత అజెండాలతో పార్టీకి చేటు కలిగించే తీరులో వ్యవహరించడం క్షమార్హం కాదని...పరిస్థితి ఇంత సంక్లిష్టంగా మారిన తరువాతైనా తెలుసుకొని పార్టీ శ్రేయస్సే లక్ష్యంగా వ్యవహరిస్తే మేలని టిడిపి శ్రేణులు కోరుకుంటున్నాయి.

English summary
Visakhapatnam:The war for political dominance between state ministers Ch Ayyanna Patrudu and Ganta Srinivasa Rao has not just created chaos among the Telugu Desam Party cadres but also caught the district administration in the crossfire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X