వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్రి గోల్డ్ వివాదంలో బిజెపి నేత కన్నా, టిడిపి మంత్రి కాల్వల మధ్య మాటల యుద్ధం...హెచ్చరికలు

|
Google Oneindia TeluguNews

అమరావతి:అగ్రిగోల్డ్‌ బాధితులకు మద్దతుగా బిజెపి సోమవారం నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన నేపథ్యంలో ఇటు భాజపా నేతలు అటు టిడిపి నాయకుల మధ్య ఈ వ్యవహారంపై మాటల యుద్ధం జరుగుతోంది.

విజయవాడలో రిలే నిరాహార దీక్షల శిబిరం ప్రారంభాన్ని పురస్కరించుకొని బిజెపి ఎపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ టిడిపిపై విమర్శల వర్షం కురిపించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోమంటే...టిడిపి నాయకులు ఆ సంస్థ ఆస్తులు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు మంత్రి కాల్వ శ్రీనివాసులు అగ్రిగోల్డ్ విషయమై బిజెపి నేతల విమర్శలను తిప్పికొట్టారు.

ఆ నెపంతో...చౌకగా కొట్టేస్తున్నారు

ఆ నెపంతో...చౌకగా కొట్టేస్తున్నారు

విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూఅగ్రిగోల్డ్ ఆస్తుల విలువ లెక్కలు చెప్పమంటే టిడిపి నేతలు సంవత్సరానికి ఒక లెక్క చెప్తున్నారని ఎద్దేవా చేశారు.అగ్రి గోల్డ్‌ కుంభకోణంలో ఆ సంస్థ యాజమాన్యాన్ని రక్షిస్తామనే నెపంతో ఆ సంస్థ వందల కోట్ల విలువైన ఆస్తులను చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్‌ సహా టిడిపి నాయకులు అన్యాక్రాంతం చేశారని కన్నా ఆరోపించారు.

అందుకే...బిజెపి పోరాటం:కన్నా

అందుకే...బిజెపి పోరాటం:కన్నా

రూ. 2000 కోట్ల విలువ చేసే హాయ్ ల్యాండ్ ను కారు చౌకగా రూ.270కోట్లకే కొట్టేయాలని చూస్తున్నారని కన్నా ఆరోపించారు.
విజయవాడలో రూ.30 కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్ ఆస్తులను 11 కోట్లకు టీడీపీ నేతలు కొనుగోలు చేశారని కన్నా ఆరోపణలు చేశారు. అగ్రి గోల్డ్ బాధితులైన 35 లక్షల కుటుంబాలను ఆదుకోవడానికే తమ పార్టీ బీజేపీ పోరాటం చేస్తోందని కన్నా స్పష్టం చేశారు.

సాయం చేయాలనే...మా ప్రభుత్వం

సాయం చేయాలనే...మా ప్రభుత్వం

మరోవైపు అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామంటూ బిజెపి నేతలు ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలపై టిడిపి నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ...అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు ఎంతోకొంత ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతోనే...ప్రభుత్వం ప్రకటన చేసిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి తోడ్పాటు అందజేస్తున్నారని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పుకొచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో డిఫాల్టర్లకు ఈ విథంగా సహాయం అందుతుందా అని ఆయన ప్రశ్నించారు.

కొంతమంది...దుష్ప్రచారం

కొంతమంది...దుష్ప్రచారం

ప్రతి కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ కేసు పురోగతిని తాము సమీక్ష చేస్తున్నామని...ప్రభుత్వం తరఫున ఏ రకమైన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నదానిపై సమీక్ష చేయడం చేస్తున్నామన్నారు. కానీ ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం ఇలాంటివి చేయడంలేదని కాల్వ చెప్పారు. అయినా కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని బీజేపీని ఉద్దేశించి ఆయన ఎత్తిపొడిచారు.

వాస్తవాలు...తెలుసుకోండి:కాల్వ

వాస్తవాలు...తెలుసుకోండి:కాల్వ

ఇది చాలా దుర్మార్గమని అన్నారు...అగ్రి గోల్డ్ బాధితులకు సాయం అందకుండా ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని మంత్రి కాల్వ అన్నారు. రూ. 60 వేల లోపు డిపాజిట్లను బాధితులకు వెంటనే చెల్లించాలని ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టినట్లు కాల్వ తెలిపారు. దీనికి అందరూ చేయూతని ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా వారు వాస్తవాలు తెలుసుకోవాలని కాల్వ శ్రీనివాస్ హితవు పలికారు.

English summary
Amaravathi: The war of words between the TDP leaders and the BJP is taking place in the backdrop of the BJP five-day statewide relay hunger strike to support of the Agri gold victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X