వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యామినిపై ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకురాలు .. అసలు కథ ఏమిటి అంటే

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైయస్ జగన్ పార్టీ వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాలు చాలా హాట్ గా మారుతున్నాయి. నిన్నటి వరకు వైసీపీ అధినేత వైయస్ జగన్ మీద నోరుపారేసుకున్న నాయకురాలు సాధినేని యామిని ఇప్పుడు తన పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను సృష్టించి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పి కి సాధినేని యామిని ఫిర్యాదు చేశారు

తన పేరుతో నకిలీ ఖాతాలు నిర్వహిస్తున్నారని సాధినేని యామిని ఫిర్యాదు

తన పేరుతో నకిలీ ఖాతాలు నిర్వహిస్తున్నారని సాధినేని యామిని ఫిర్యాదు

తాను కేవలం రెండు ఫేస్ బుక్ ఖాతాలను మాత్రమే నిర్వహిస్తున్నట్లుగా యామిని పేర్కొన్నారు.తన పేరుతో కొందరు కావాలని నకిలీ ఖాతాలను సృష్టించి అసభ్యకరమైన పోస్టులను పెడుతున్నారని పేర్కొన్న యామిని ఈ విషయం తన దృష్టికి ఈ ఏడాది మార్చిలో వచ్చిందని పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో తను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా ఆమె తెలిపారు. ఇంతకీ ఆమె హడావిడిగా పోలీసులకు ఫిర్యాదు చెయ్యటానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఆమె పేరుతో సర్క్యులేట్ అవుతున్న పోస్ట్ విషయంలో ఆమెను వైసీపీ టార్గెట్ చెయ్యటంతో యామిని పోలీసులను ఆశ్రయించారు.

 జగన్ ను కించపరుస్తూ యామిని పేరుతో పోస్ట్ .. ట్రోల్ చేస్తున్న వైసీపీ .. అందుకే యామిని ఫిర్యాదు

జగన్ ను కించపరుస్తూ యామిని పేరుతో పోస్ట్ .. ట్రోల్ చేస్తున్న వైసీపీ .. అందుకే యామిని ఫిర్యాదు

అయితే అసలు విషయం ఏంటంటే టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అగౌరవపరిచేలా ఫేస్‌బుక్‌లో వివాదాస్పదమైన పోస్ట్ పెట్టారంటూ ప్రచారం జరుగుతోంది. ‘తిరుపతి పర్యటన లో భాగంగా విచ్చేసిన ప్రధాని మోడీ కాళ్ళు పట్టుకునేందుకు లైన్లో నిలబడి మరీ వెంపర్లాడిన మా పులివెందుల పులి.. వీడా మోడీ మెడలు వంచి మనకు హోదా, రైల్వే జోన్ తెచ్చేది' అని ఆమె పేరుతో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక దీంతో వైసీపీ కార్యకర్తలు, నెటిజన్లు మండిపడుతున్నారు. టీడీపీలో బాధ్యతగల పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. యామిని నోరు అదుపులో పెట్టుకోవలంటూ హెచ్చరిస్తున్నారు. లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందన్నారు.
ఈ వివాదం నేపథ్యంలోనే సాధినేని యామిని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీన్ రివర్స్ .. జగన్ ను కించపరుస్తున్నారని యామినిపై వైసీపీ ఫిర్యాదు ..

సీన్ రివర్స్ .. జగన్ ను కించపరుస్తున్నారని యామినిపై వైసీపీ ఫిర్యాదు ..

ఇదిలా ఉంటే సాధినేని యామిని శర్మ పై వైసిపి మహిళా విభాగం సైతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో సీఎం జగన్ ని కించపరుస్తూ ఫేస్ బుక్ లో యామిని పోస్ట్ చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది .యామిని పై ఫిర్యాదు చేసిన వైసిపి నాయకురాలు ఝాన్సీ ఇప్పటికైనా సాధినేని యామిని నోరు అదుపులో పెట్టుకోకపోతే అని హెచ్చరిస్తున్నారు యామిని ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోపే వైసిపి మహిళా విభాగం సైతం ఆమెపై ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

English summary
TDP official spokesperson Sadineni Yamini had filed a complaint . In this caseYamini has been accused of creating false face book accounts in her name and raising abusive posts. Even the YCP Women's Section on Yamini Sharma complained to the police. A complaint was lodged in the Pattabiburam police station in Guntur. The Complaint alleging that yamini insulted AP CM Jagan in her face book post . The YCP leader Jhansi, who complained about Yamini, has been warned that Yamini's mouth was not kept in control she will face serious problems in future. Few hours after Yamini's complaint, the YCP women's division complained against her .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X