• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అప్పుడు నారాయణ..ఇప్పుడు బొత్స..! బాబు వ్యూహానికి దిమ్మదిరిగే జగన్ ప్రతివ్యూహం..!!

|

అమరావతి/హైదరాబాద్ : 2014లో రాష్ట్ర విడిపోయిన తర్వాత చంద్రబాబు ఏపి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకూ రాజకీయాలకు పరిచయమే లేని నారాయణ విద్యా సంస్థల అధినేత పీ. నారాయణను ఏకంగా మంత్రిని చేసి కీలక పదవి కట్టబెట్టారు చంద్రబాబు బాబు. ఇప్పుడు 2019 జగన్ కేబినెట్ లో బొత్స సత్యనారాయణ కూడా అదే కీలక పాత్ర పోషిస్తున్నారు. బొత్స ఉత్తరాంధ్రలో ముఖ్యనేత. తూర్పు కాపు సామాజికవర్గంలో మంచి పలుకుబడి ఉన్న నాయకుడు. మొన్న రాజధాని మార్పుపై స్పందించి పెనుదుమారానికి కారణమయ్యారు. ఓ విధంగా చెప్పాలంటే వైసీపీ మంత్రివర్గంలో బొత్స మాత్రమే స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదంతా ఏపి సీఎం జగన్ తెరవెనుక నడిపిస్తున్న డ్రామా అయినా, దానికి సరైన పాత్రదారిగా బొత్సను ఎంపిక చేయటం మాత్రం అంత ఆషామాషీగా జరగలేదు. దీనికంటే ముందు బొత్స సీఎం పదవిని కొద్దిలో కోల్పోయారనేది కూడా గమనార్హం.

అమరావతి రాజధాని..! ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్..!!

అమరావతి రాజధాని..! ప్రస్తుత రాజకీయాల్లో హాట్ టాపిక్..!!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో అనూహ్యంగా కే.రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాది లోపు జరిగిన సంఘటనల కారణంగా అంత పెద్ద వయసులో పదవిని భారంగా భావించారు రోశయ్య. అంతే కాకుండా రోశయ్యకు కాంగ్రెస్ నేతలు చుక్కలు చూపించారని కూడా ప్రచారం జరిగింది. ఎప్పుడు సాగనంపుదామా అని చాలామంది ఎత్తులు వేసినట్టు చర్చ జరిగింది. వారిలో చాలామంది ఉన్నా, చివరకు కిరణ్ కుమార్ రెడ్డి పదవి తన్నుకుపోయి ఉమ్మడి ఏపీ ఆఖరి సీఎంగా పని చేసారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కావాలనే కోరికతో ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లొచ్చారనేది లెక్క తేల్చడం కూడా కష్టమే.

ఈటెల మాటలు గులాబీకీ తూటాల్లా పరిణమించాయా..? రచ్చ చేస్తున్న రాజేందర్ వ్యాఖ్యలు..!!

బొత్స సంచలన వ్యాఖ్యలు..! ఇంకా కొనసాగుతోన్న ఉత్కంఠ..!!

బొత్స సంచలన వ్యాఖ్యలు..! ఇంకా కొనసాగుతోన్న ఉత్కంఠ..!!

అయితే అదే సమయంలో నాటి మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మినారాయణ ఇద్దరూ సీఎం రేసులో ఉన్నారు. రెడ్డి వర్గాన్ని కాదని, కాపులకు సీఎం పీఠం ఇవ్వటం సంగతి ఎలా ఉన్నా, ఇద్దరూ గట్టి ప్రయత్నమే చేశారు. అదిష్ఠానంలో ఉన్న కీలక నేతలు ఒకరు బొత్సకు, మరో ప్రధాన నాయకుడు కన్నాకు సీఎం పీఠంపై మాటిచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇద్దరూ కాపు వర్గానికి చెందిన వారు కావటంతో రెడ్ల నుంచి వ్యతిరేకత మొదలైనట్టు తెలుస్తోంది. ఆ పరిస్థితిని అదిగమించేందకు బొత్సను వెనక్కి తగ్గమంటూ కన్నా వర్గం ఒత్తిడి తెచ్చినా ససేమిరా అనటంతో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కాగలిగాడనే ప్రచారమూ అప్పట్టో జరిగింది.

బొత్స సుధీర్ఘ రాజకీయ అనుభవం..! బొత్స తో పలికిస్తున్న ఎపి సీఎం..!!

బొత్స సుధీర్ఘ రాజకీయ అనుభవం..! బొత్స తో పలికిస్తున్న ఎపి సీఎం..!!

రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లో అంతటి ఇమేజ్, చాకచక్యం ఉన్న బొత్స తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీలోకి చేరేముందే తాను రెండు మెట్లు కిందకు దిగి వస్తున్నానంటూ జగన్ తో చెప్పానంటూ స్పందించారు. కాబట్టి, ఇప్పుడు తనను పార్టీలో ఉంచినా, పదవి నుంచి తొలగించినా తనకేం కాదనే సంకేతం కూడా వైసీపీ అధినేత జగన్ కు ఇచ్చినట్టయింది. బొత్సను రాజధాని అంశంలో ప్రోత్సహించటం ద్వారా, జగన్ మూడు పనులు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకటి, బొత్స కాపు నాయకుడు కాబట్టి.. కమ్మ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడటం.. నిజంగానే అమరావతి చుట్టూ ఉన్న గ్రామాలు, భూ సేకరణకు ముందుకు వచ్చిన రైతులు కమ్మ వారే కావటం కూడా బొత్స కామెంట్స్ ను కాపులు, బీసీ వర్గాలు సానుకూలంగానే తీసుకుంటాయి.

బాబుకు అండగా నారాయణ..! ఇప్పుడు జగన్ కు కుడి భుజంగా బొత్స..!!

బాబుకు అండగా నారాయణ..! ఇప్పుడు జగన్ కు కుడి భుజంగా బొత్స..!!

గతంలో నారాయణ చేసిన తప్పులను బొత్స ద్వారా బయటపెట్టించటం వల్ల, చంద్రబాబు కాపు నేతలను అడ్డుపెట్టుకుని ఎంతటి అవినీతికి పాల్పడ్డాడనే ఎమోషన్ ను కాపుల్లోకి ఎక్కించటం.. పరోక్షంగా బొత్సను హీరో చేయటం ద్వారా కాపులను తమ వైపు తిప్పుకోవాలనేది జగన్ ఎత్తుగడ కావచ్చు. ఇంతటి వ్యతిరేకత ఉండటానికి కేవలం కమ్మ వర్గం వున్న చోట రాజధాని నిర్మించటమే కారణమనేదాన్ని ఫోకస్ చేస్తారు, ఫలితంగా కొత్త రాజధాని ప్రాంతాన్ని ప్రజలు కోరుకుంటున్నారనే అంశానికి బలం చేకూర్చుతారు. ఇదంతా బొత్స కనుసన్నల్లో జరిపించటం ద్వారా, రాజధాని మార్పులో జగన్, రెడ్డి వర్గం ఎక్కడా వేలు పెట్టలేదనే అంశాన్ని జగన్ చాలా తెలివిగా జనాల్లోకి జొప్పిస్తారు. తాము అనుకున్న పనిని తెలివిగా ముగిస్తారు. ఆ నాడు నారాయణ. బాబుకు కుడిభుజంగా ఎలా నడిపించారో, ఇప్పుడు జగన్ ఆలోచనను బొత్స ఆచరణలో ఉచంటం ద్వారా తాను కీలకంగా కాబోతున్నారనేది బహిరంగ సహస్యంగా మారింది.

English summary
After the breakup of the state in 2014, Chandrababu became the chief minister of the AP. Narayana, who was not acquainted with politics until then, was the head of educational institutions P.Narayana has been made a minister and the key position is the Chandrababu Babu's Cabinet. Now 2019 jagan's cabinet, Botsa Satyanarayana is also playing the same key role.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X