వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో డీజీపీ పదవి రావాలంటే ఓ సెంటిమెంట్ ఉందట .. ఏంటది ? ఏమా కథ ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో డీజీపీ పదవి రావాలంటే ఓ సెంటిమెంట్ ఉందట .. ఇప్పుడు ఏపీలో అందరూ ఆ సెంటిమెంట్ గురించే చర్చించుకుంటున్నారు. ఆ భవనం పని చేసిన వారికే బాస్ అయ్యే ఛాన్స్ వుందట. ఇంతకీ ఏ భవనం ? ఏమిటా కథ అంటే

మద్యం నిషేధంపై కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం .. ఏడాదికి 20 శాతం మద్యం దుకాణాలు బంద్ మద్యం నిషేధంపై కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం .. ఏడాదికి 20 శాతం మద్యం దుకాణాలు బంద్

 ఎన్టీఆర్ భవన్ లో పని చేసిన వారికే డీజీపీగా అవకాశం .. సెంటిమెంట్ గా మారిన ఎన్టీఆర్ భవన్

ఎన్టీఆర్ భవన్ లో పని చేసిన వారికే డీజీపీగా అవకాశం .. సెంటిమెంట్ గా మారిన ఎన్టీఆర్ భవన్

ఆ భవనంలో పని చేసిన వారికి డీజీపీగా పదవి లభించే అవకాశం రావటంతో ఇప్పుడు చర్చంతా ఆ భవనంపైనే జరుగుతుంది. డీజీపీలకు సెంటిమెంటుగా ఎన్టీఆర్‌ భవనంలో కొలువు మారింది.
అక్కడి వేర్వేరు విభాగాలలో పనిచేసిన నలుగురికీ చాన్స్‌ రావటంతో పోలీస్ సిబ్బందిలో విజయవాడలోని ఎన్టీఆర్‌ పరిపాలనా భవనంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో పని చేసిన ఐపీఎస్ లు వరుసగా డీజీపీలు అవుతున్న నేపధ్యంలోనే ఇంత చర్చ జరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో వేగవంతంగా పూర్తి అయిన నిర్మాణం ఎన్టీఆర్‌ పరిపాలనా భవనమే. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ భవనంలోపని చేసిన వారికి డీజీపీగా అవకాశం రావటం జరిగింది.

రాష్ట్ర విభజన నాటి నుండి ఇప్పటి వరకు ఈ భవనంలో పని చేసిన వారికే అవకాశం

రాష్ట్ర విభజన నాటి నుండి ఇప్పటి వరకు ఈ భవనంలో పని చేసిన వారికే అవకాశం

ఇక ఈ భవనాన్ని ఆర్టీసీ ఎండీ హోదాలో నండూరి సాంబశివరావు సిద్ధం చేశారు. ఆ తరువాత ఆయన 2016 జూలై 22న రాష్ట్ర పోలీస్‌ బాస్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆ పోస్టులోకి వచ్చిన మాలకొండయ్యను 2017 డిసెంబర్‌ 31న డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2018 జూన్‌ 30న పదవీ విరమణ చెందిన మాలకొండయ్య స్థానంలో, అదే భవనంలో రెండో అంతస్తులోని ఏసీబీ కార్యాలయంలో ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించింది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా నియమించడంతో అప్పటి వరకూ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న గౌతమ్‌ సవాంగ్‌ ఎన్టీఆర్‌ పరిపాలనా భవనంలోని మూడో అంతస్తులో ఉన్న కార్యాలయంలో పని చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మారడంతో గౌతమ్‌ సవాంగ్‌ను డీజీపీ పదవి వరించింది.

పోలీస్ శాఖలో ఎన్టీఆర్ పరిపాలనా భవనం పై చర్చ

పోలీస్ శాఖలో ఎన్టీఆర్ పరిపాలనా భవనం పై చర్చ

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్‌ అధికారుల్లో 1986 బ్యాచ్‌కు చెందిన కౌముది కేంద్ర సర్వీసుల్లో ఉండగా, ఠాకూర్‌ ఇప్పటి వరకూ డీజీపీగా కొనసాగారు. అదే బ్యాచ్‌కు చెందిన సవాంగ్‌ డీజీపీగా ఎంపికవగా, మరో అధికారి రే వినయ్‌ రంజన్‌ ఈ ఏడాది పదవీ విరమణ చెందబోతున్నారు. ఆ తర్వాత 1987 బ్యాచ్‌కు చెందిన సురేంద్రబాబుకే డీజీపీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తానికి ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో పని చేస్తే వారికి డీజీపీ అయ్యే అవకాశం వుంటుంది అని ఒక భావన పోలీస్ శాఖలో ఉంది.

English summary
There is a sentiment to get DGP in the AP. Now everyone in the AP is talking about the sentiment. Now all the discussion is done on the building, as the people who have worked in the building have a chance to become a DGP. The NTR building has become a sentiment for DGPs. Police personnel will have an interesting debate over the NTR administrative building in Vijaywada, where the four of them are working in different departments. The debate takes place in the backdrop of the IPS who work in the NTR administrative building, where the DGPs are respectively. After the division of the state, NTR administration building is the fastest building constructed in Vijayawada. Since then, it has been possible for those in the building to become DGP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X