వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా బాగుంది కానీ!: ఏపీ ప్రజలకు షాకిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Modi's Lok Sabha Speech : Why His Speech Disappoints AP?

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేశారు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ వల్లే అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినకుండా తెలంగాణ విభజనకు తాము మద్దతిచ్చామని గుర్తు చేశారు.

తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, తాము దాని పక్షాన కూడా ఉన్నామని చెప్పారు. ఏపీ నేతలను కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో చెప్పారు. కానీ విభజన సమయంలో చట్టంలో పొందుపర్చిన ప్యాకేజీ గురించి లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీల గురించి మాత్రం మాట్లాడలేదు.

<strong>కాంగ్రెస్ అరాచక రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ సాక్ష్యం: మోడీ</strong>కాంగ్రెస్ అరాచక రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ సాక్ష్యం: మోడీ

ప్రధాని ప్రసంగంపై ఆసక్తి

ప్రధాని ప్రసంగంపై ఆసక్తి

మూడ్రోజులుగా ఎంపీలు సభలో తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ బీజేపీ నేతలు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.

బడ్జెట్ బాగుంది కానీ

బడ్జెట్ బాగుంది కానీ


దేశవ్యాప్తంగా రైతులకు, యువతకు అందరికీ బడ్జెట్ బాగుందని, కానీ విభజనతో నష్టపోయిన ఏపీకి మాత్రం ఆశించినట్లుగా లేదని టీడీపీ, వైసీపీలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగం కోసం అందరూ ఆసక్తిగా చూశారు.

హోదా లేదు ప్యాకేజీ లేదు

హోదా లేదు ప్యాకేజీ లేదు

కానీ ప్రత్యేక హోదా గురించి లేదా ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రధాని మాట్లాడలేదు. తన వాక్చాతుర్యంతో కాంగ్రెస్‌ను విమర్శించిన తీరు, ఏపీ విభజన నుంచి దేశ విభజన వరకు కాంగ్రెస్ పార్టీపై చేసిన అంశాలు బాగానే ఆకట్టుకున్నప్పటికీ ఏపీకి మాత్రం ఆ ప్రసంగం సంతృప్తినివ్వలేదని అంటున్నారు.

ఏ ఒక్క డిమాండూ ప్రస్తావించలేదు

ఏ ఒక్క డిమాండూ ప్రస్తావించలేదు

రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగాన్ని మోడీ పొలిటికల్ స్పీచ్‌గా మార్చారని విమర్శిస్తున్నారు. ప్రధాని ప్రసంగం ఏపీని తీవ్రంగా నిరుత్సాహపరిచిందని చెబుతున్నారు. ఏపీకి చెందిన ఏ ఒక్క డిమాండూ మోడీ తన ప్రసంగంలో పేర్కొనలేదు.

English summary
There is no Andhra Pradesh poll promises in Prime Minister Narendra Modi's Lok Sabha speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X