వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'విజయసాయి వల్లే జైలుకు జగన్, అలా చెప్తే తప్పేంటి.. ఓటుకు నోటులో బాబు పాత్ర లేదు'

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి తప్పుడు సలహాల వల్లే వైసీపీ అధినేత వైయస్ జగన్ జైలుకు వెళ్లారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం మండిపడ్డారు.

చదవండి: అవిశ్వాసంతో దిగొచ్చిన కేంద్రం! రేపు కేబినెట్ భేటీ, ఏం లాభం.. పవన్‌కు బాబు దిమ్మతిరిగే షాక్

విజయసాయి రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. సీనియర్ ఐఏఎస్‌లు సతీష్ చంద్ర, వెంకటేశ్వర రావుపై విజయసాయి విమర్శలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. జగన్ దురాశకు 12 మంది ఐఏఎస్‌లు కేసుల్లో ఇరుక్కున్నారని ధ్వజమెత్తారు.

చదవండి: బీజేపీపై టీడీపీ 'ప్రత్యేక' అస్త్రం: షాకివ్వబోయి పవన్ వ్యూహంలో జగన్ గిలగిల

ఏం చేయాలో చంద్రబాబుకు తెలుసు

ఏం చేయాలో చంద్రబాబుకు తెలుసు

తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ దోపిడీకి పాల్పడ్డారని సోమిరెడ్డి ఆరోపించారు. విభజన హామీలు, ప్యాకేజీ వంటి వాటితో కేంద్రం వల్ల ఏపీకి న్యాయం జరగకుంటే చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసునని చెప్పారు. జగన్ లాలూచీని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని క్షమించరు

కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని క్షమించరు

ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు క్షమించరని సోమిరెడ్డి అన్నారు. బీజేపీ నేత, మంత్రి మాణిక్యాల రావు చేసిన వ్యాఖ్యల్లో అర్థం లేదన్నారు. మాది పోతే వెంట్రుక, వారిది బోడిగుండు అంటూ మాణిక్యాల రావు వ్యాఖ్యానించారు. దీనిపై సోమిరెడ్డి పైవిధంగా స్పందించారు.

విధిలేని పరిస్థితుల్లో ప్రత్యేక హోదా

విధిలేని పరిస్థితుల్లో ప్రత్యేక హోదా

నీతి అయోగ్‌ను సాకుగా చూపి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామన్నారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగించినందున ఏపీకి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హోదా రాయితీలు ఇస్తామని చెప్పిన కేంద్రం మోసం చేసిందన్నారు.

ఢిల్లీలో కాళ్లు పట్టుకొని, ఫోజులు

ఢిల్లీలో కాళ్లు పట్టుకొని, ఫోజులు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో కాళ్లు పట్టుకొని ఇక్కడ ఫోజులు కొడుతున్నారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. వైసీపీ మాత్రం రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటోందన్నారు.

ఓటుకు నోటులో బాబు తప్పేమిటి, అలా చెప్పారు

ఓటుకు నోటులో బాబు తప్పేమిటి, అలా చెప్పారు

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర లేదని సోమిరెడ్డి అన్నారు. ధైర్యంగా ఓటేయమని కోరడం తప్పు కాదన్నారు. బడ్జెట్‌ను భగవద్గీతతో పోల్చిన సాక్షి మీడియా.. ఇప్పుడు మేమేదో తప్పు చేశామంటున్నారని విమర్శించారు. నిధులు రాకుంటే నిలదీయాల్సింది కేంద్రంనా, టీడీపీనా అని ప్రశ్నించారు. జగన్‌కు బీజేపీతో సంబధం ఏమిటన్నారు.

English summary
Telugu Desam Party leader Somireddy Chandramohan Reddy on Wednesday said that there is no Chandrababu Naidu role in Cash for vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X