వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం ప్రకటనలో స్పష్టత లేదు..!వారోత్పవాలు కాదు..! ఇసుక వార్ ఉత్సవాలన్న లోకేష్..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక ఎపిసోడ్ డైలీ సీరియల్ లోని ట్విస్టులను తలపిస్తోంది. ఇసుక కొరతపై అధికార పార్టీ చేస్తున్న ప్రకటనలకు, ప్రతిపక్ష పార్టీల లెక్కలకు పొంతన లేకుండా ఉంది. ఇసుకను అందుబాటులోకి తేవడమే కాకుండా ఏపీలో ఇసుక వారోత్పవాలు నిర్వహిస్తామని ఏపి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను ఎమ్మెల్సీ లోకేష్ ఎద్దేవా చేసారు.

 జగన్ ఇచ్చే చిల్లర కోసం నాపై ఇలాంటి తప్పుడు ప్రచారామా?: నారా లోకేష్ ఫైర్ జగన్ ఇచ్చే చిల్లర కోసం నాపై ఇలాంటి తప్పుడు ప్రచారామా?: నారా లోకేష్ ఫైర్

ఉసుక వారోత్సవాలని ప్రకటించి వారం, పది రోజులు గడుస్తున్నా ఇంత వరకూ రాష్ట్రంలో ఇసుక అందుబాటులోకి రాకపోడంతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని లోకేష్ ఆరోపిస్తున్నారు. అసలు సీఎం ప్రకటించిన ఇసుక "వారోత్సవాలకు" అర్థం వేరని లోకేష్ సెటైర్ వేసారు.

There is no clarity in CM statement in Sand availability..!

ఏపిల నెలకొన్న ఇసుక కొరత పట్ల ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు అర్థం వేరని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇసుక వారోత్సవాలు అని ఏపీ సీఎం జగన్ అంటే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డానని, జగన్మోహన్ రెడ్డి అన్నది ఇసుక 'వార్' ఉత్సవాలు అని తరువాత అర్థం అయ్యిందని వ్యంగ్యాస్త్రం సంధించారు. మాజీ మంత్రి నారా లోకేష్ ఇసుక పై ట్వీట్ చేశారు. ఇసుక వార్ లో భాగంగా ఇసుక వాటాల కోసం వైసీపీ నాయకులు కర్రలతో దాడులు చేసుకొని, తలలు పగలు కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు.

ఒక పక్క వైసీపీ నాయకులు ఇసుకలో వాటాల కోసం వీధి రౌడీల్లా కొట్టుకుంటుంటే, అదే గుంటూరు జిల్లా, పెదకాకానిలో జగన్ చేతగాని పాలనకి మరో భవన నిర్మాణ కార్మికుడు పీట్ల శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేూసారు. వైసీపీ ఇసుక వార్ ఉత్సవాలు, ఇసుక పంచాయితీ డ్రామాలు కట్టి పెట్టి, కార్మికులకు వెంటనే జీవనోపాది కల్పించాలని లోకేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

English summary
Lokesh claimed that the chief Minister's statement towards the shortage of sand in the AP. Instead of the sand celebrations, it was later understood to be the sand ' war ' celebrations, said mlc Lokesh on twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X