వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయసాయిరెడ్డి లేఖ కాక: అందులో తప్పేముంది అంటోన్న విపక్షాలు, కన్నా, కనకమేడల మండిపాటు

|
Google Oneindia TeluguNews

ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాసిన లేఖ కాకరేపుతోంది. లేఖలో కుట్ర ఉందని, ముగ్గురి ప్రమేయంతోనే రాశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాయడంతో అగ్గిరాజేసింది. అయితే తాను ఎన్నికల కమిషనర్ హోదాలోనే లేఖ రాసినట్టు రమేశ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. దీంతో విపక్షాలు.. అధికార వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.

 తప్పేముంది..

తప్పేముంది..

విజయసాయిరెడ్డి తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుపట్టారు. రమేశ్ కుమార్ లేఖను తప్పుపట్టాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. రమేశ్ కుమార్ రాసిన లేఖను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని స్పష్టంచేశారు. దీనిపై వైసీపీ నేతలకు ఎందుకు అనుమానం వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. కరోనా బాధితుల గోడును ఆలకించడం మాని.. రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు.

 సంతకాలు ఫోర్జరీ..

సంతకాలు ఫోర్జరీ..


కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను అప్పటి కమిషనర్ రమేశ్ కుమార్ వాయిదా వేశారు. ఆయన తీరును ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ క్రమంలో తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖకు రమేశ్ కుమార్ లేఖ రాశారు. అందులోని సంతకాలు ఫోర్జరీకి గురయ్యాయని.. విచారణ జరపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు విజయసాయిరెడ్డి బుధవారం లేఖ రాశారు. దీనిపై రమేశ్ కుమార్ కూడా క్లారిటీ ఇచ్చారు. తానే లేఖ రాశానని చెప్పారు. కానీ విజయసాయిరెడ్డి లేఖను బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తప్పుపట్టారు.

 వాస్తవమే కదా..

వాస్తవమే కదా..

రమేశ్ కుమార్ రాసిన లేఖను కేంద్ర హోంశాఖ గుర్తించిందని సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు. రమేశ్ కుమార్ ప్రస్తావించిన అంశాలు అన్ని వాస్తవాలేనని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు చేసిన పనులను ఆయన కేంద్రానికి తెలియజేశారని పేర్కొన్నారు.

Recommended Video

High Court Dismisses GO'S On English Medium In AP Govt Schools
 అదరం బెదరం

అదరం బెదరం


రమేశ్ కుమార్ రాసిన లేఖను తనకు అంటగట్టాలని చూస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల ఆరోపించారు. విజయసాయిరెడ్డి కుట్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి మాదిరిగా తనపై 11 కేసులు లేవని చెప్పారు. వైసీపీ నేతల బ్లాక్ మెయిల్‌కు భయపడబోనని తేల్చిచెప్పారు.

English summary
there is no mistake on ramesh kumar letter bjp state president kanna laxminarayana said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X