హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్‌కు తెలంగాణ, ఎపిఎన్జీవోకు జగన్ ఝలక్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ని తెలంగాణవాదులు శనివారం అడ్డుకున్నారు. ఓ కార్యక్రమానికి హజరై వెళ్తుండగా యూసఫ్‌గూడలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు కాన్వాయ్‌ని అడ్డుకొని తెలంగాణ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ యాదగిరినగర్‌లోను సిఎంను అడ్డుకునేందుకు తెరాస కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సంఘటనలో 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఎపిఎన్జీవోలు ఏర్పాటు చేసిన సమైక్య శంఖారావానికి పలు రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. అయితే సమైక్యాంధ్ర ఐకాస ఏర్పాటు చేసి ఉమ్మడిగా ఉద్యమించాలన్న ఎపిఎన్జీవోల యత్నాలు ఫలించలేదు. మరికొన్ని నెలల్లో శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇప్పటికిప్పుడు రాజకీయ ఐకాస ఏర్పాటు చేయలేమని, ఒకవేళ ఏర్పాటు చేసినా పెద్దగా ఫలితం ఉండబోదని కొన్ని పార్టీలు అభిప్రాయపడ్డాయి.

ఉమ్మడి ఐకాస లేకపోయినా ప్రస్తుతం విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో వర్గాలు, పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొంటున్నారని పేర్కొన్నాయి. అందువల్ల ఐకాస ఏర్పాటు అంత ముఖ్యం కాదని తేల్చేశాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రధానపాత్ర పోషిస్తున్న ఎపిఎన్జీవోలు రాజకీయ పక్షాలను కలుపుకోవడం, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడం లక్ష్యాలుగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ముఖ్యమంత్రి 1

ముఖ్యమంత్రి 1

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ని తెలంగాణవాదులు శనివారం అడ్డుకున్నారు. ఓ కార్యక్రమానికి హజరై వెళ్తుండగా యూసఫ్‌గూడలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు కాన్వాయ్‌ని అడ్డుకొని తెలంగాణ నినాదాలు చేశారు.

ముఖ్యమంత్రి 2

ముఖ్యమంత్రి 2

పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ యాదగిరినగర్‌లోను సిఎంను అడ్డుకునేందుకు తెరాస కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సంఘటనలో 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి 3

ముఖ్యమంత్రి 3

కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ని తెలంగాణవాదులు శనివారం అడ్డుకున్నారు. ఓ కార్యక్రమానికి హజరై వెళ్తుండగా యూసఫ్‌గూడలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు కాన్వాయ్‌ని అడ్డుకొని తెలంగాణ నినాదాలు చేశారు.

ముఖ్యమంత్రి 4

ముఖ్యమంత్రి 4

పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ యాదగిరినగర్‌లోను సిఎంను అడ్డుకునేందుకు తెరాస కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సంఘటనలో 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎపిఎన్జీవో 1

ఎపిఎన్జీవో 1

ఎపిఎన్జీవో అఖిల పక్షంలో రాష్ట్ర మంత్రి శైలజానాథ్, పార్లమెంటు సభ్యులు వైఎస్ చౌదరి, సిఎం రమేశ్, కొనకళ్ళ నారాయణ, సబ్బం హరి, శాసనసభ్యులు పయ్యావుల కేశవ్, కేఈ ప్రభాకర్, శివరామరాజు, ఉగ్ర నర్సింహారెడ్డి, సిపిఎం నేతలు వెంకటేశ్వర రావు, వీరయ్య, లోక్‌సత్తా, సమాజ్‌వాదీ పార్టీల నేతలు కటారు శ్రీనివాస్ రావు, జగదీశ్ యాదవ్, సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నేత జగదీశ్, సమైక్య ఉద్యమ నేతలు చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పిఎన్జీవో 2

పిఎన్జీవో 2

అశోక్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హాజరు కాలేదు. అంతకుముందు రోజే ఆ పార్టీ రాలేమంటూ లేఖ రాసింది.

ఎపిఎన్జీవో 3

ఎపిఎన్జీవో 3

భేటీలో అజెండాలో ప్రధానాంశమైన 'రాజకీయ ఐకాస' ఏర్పాటు విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేత సబ్బం హరి మాట్లాడుతూ 'ఇప్పటికిప్పుడు ఐకాస ఏర్పాటు చేయడం కంఫర్టబుల్ కాదు. అసలు అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు అందరం కలిసే పనిచేస్తున్నాం కదా!' అని పేర్కొన్నారు.

ఎపిఎన్జీవో 4

ఎపిఎన్జీవో 4

సమావేశంలో పాల్గొన్న మరికొందరు నేతలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో 'జేఏసీ ఏర్పాటుపై తర్వాత యోచిద్దాం. ఇప్పటికైతే సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలోనే ఉద్యమం చేద్దాం' అని నిర్ణయించారు.

ఎపిఎన్జీవో 5

ఎపిఎన్జీవో 5


ఇక రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ఎలా ఎదుర్కోవాలన్న విషయమై చర్చ వచ్చింది. బిల్లును అధ్యయనం చేయాల్సిందిగా శాసనసభ్యులను కోరామని, ఇరు ప్రాంతాలకు సంబంధించిన ఆదాయాలు, అప్పులు తదితర వివరాలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరామని, ఇస్తామని చెప్పారని, ఈ మేరకు అధికారులను ఆదేశించారని పయ్యావుల కేశవ్ చెప్పారు.

ఎపిఎన్జీవో 6

ఎపిఎన్జీవో 6

మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ... 'ఉద్యమం విషయంలో వ్యూహాత్మకంగా వెళదాం. పార్టీలకతీతంగా ఉద్యమంలో అందరూ పాల్గొనాలి' అని సూచించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం చరిత్రాత్మకం, ఇది చారిత్రక అవసరం అని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి అందరం కలిసే వెళదామన్నారు.

ఎపిఎన్జీవో 7

ఎపిఎన్జీవో 7

"సీమాంధ్ర ప్రాంతంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏడెనిమిది మంది మాత్రమే విభజనకు అనుకూలంగా, అంటే అధిష్ఠానానికి అనుకూలంగా ఉన్నారు. ఇంతమందికి వ్యతిరేకంగా ఆ కొద్దిమంది ఏమీ చేయలేరు. అయినప్పటికీ వాళ్లపైనా ఒత్తిడి తెద్దాం'' అని శైలజానాథ్ పిలుపునిచ్చారు.

English summary
APNGOs chief Ashok Babu said that there is no need for a JAC, but all parties have to fight together for United Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X