వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నోటీసులతో బీజేపీకి సంబంధం లేదు...మాపై నిందలా?: పురంధేశ్వరి;బిజెపి కుట్రే:ఎంపి నాని

|
Google Oneindia TeluguNews

విజయవాడ:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపిన నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేత పురంధేశ్వరి స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ నోటీసు విషయమై బిజెపిపై నిందలు ఎలా వేస్తారని ప్రశ్నించారు.

ఎప్పటిదో 2010 నాటి కేసుకు సంబంధించి బీజేపీపై ఇప్పుడు నిందలు ఎలా...ఎందుకు వేస్తారని పురంధేశ్వరి నిలదీశారు. ఈ అంశంపై టిడిపి నేతలు మహారాష్ట్ర ప్రభుత్వాన్నే అడగాలన్నారు. ఎక్కడ ఏం జరిగినా టీడీపీ నేతలు...కేంద్రానికి ఆపాదిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని...తామే పూర్తి చేస్తామని పురంధేశ్వరి పునరుద్ఘాటించారు.

వాస్తవం లేదు:పురంధేశ్వరి

వాస్తవం లేదు:పురంధేశ్వరి

ఆంధ్రప్రదేశ్ కు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతుందనే ఆరోపణల్లో వాస్తవం లేదని, అయితే సాంకేతిక అంశాలతో కొంత జాప్యం జరిగి ఉండవచ్చునని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. మరోవైపు సిఎం చంద్రబాబుకు కోర్టు నోటీసులు ఖచ్చితంగా బిజెపి కుట్రేనని ఎంపి కేశినేని నాని తేల్చేశారు.బీజేపీ కుట్ర రాజకీయాలకు ఇది ఒక నిదర్శనమని...మోడీ,అమిత్ షా అంతా కలిసి ఈ కుట్ర చేశారని నాని ఆరోపించారు.కేస్ లేదని మోసం చేసి ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం ఎంత వరకు సమంజసమని నాని ప్రశ్నించారు.జగన్ తో కుమ్మక్కు అయ్యి ఈ రోజు మోడీ ఆడిన డ్రామానే బాబ్లీ కేస్ అని దుయ్యబట్టారు.వీటన్నింటికీ 2019 ఎన్నికల్లో మోడీకి దేశ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.

బిజెపి కుట్రే:కేశినేని నాని

బిజెపి కుట్రే:కేశినేని నాని

బాబ్లీ కేస్ లో కెసిఆర్ కుట్ర కూడా దాగి ఉందని...
ఎన్ని కుట్రలు చేసినా వారి ఆటలు సాగవన్నారు.రాజ్యాంగబద్ధ సంస్థలను కూడా మోడీ వాడుకుంటున్నారుని...చంద్రబాబు ఎదుగుదల...ఏపీ అభివృద్ధి చూసి ఓర్వలేకనే మోడీ ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని నాని విమర్శించారు.ఐక్యరాజ్యసమితి సమావేశానికి చంద్రబాబు హాజరు కావడం కూడా మోడీ కి ఇష్టం లేదన్నారు. అందుకే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారుని దుయ్యబట్టారు. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం 2010లో ఈ ఘటన జరిగిందని...దీనిపై కేసులు కూడా రద్దుచేపినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించిందని నాని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు...ఇన్నాళ్లకు కేసులేంటి?

ఇప్పుడు...ఇన్నాళ్లకు కేసులేంటి?

ఇన్నేళ్లు గడిచాక ఇప్పుడు మళ్లీ కేసులు పెట్టడం ఏమిటి...ఎప్పుడో 8 ఏళ్ల క్రితం జరిగిన విషయంపై ఒక ముఖ్యమంత్రికి నాన్ బెయిలబుల్ నోటీసులు ఇవ్వడం దేశ చరిత్రలో ఎన్నడైనా జరిగిందా...?...దీనినేమంటారు..? రాజకీయ కక్ష సాధింపు కాదంటారా..?...అని నాని నిలదీశారు. ప్రతిపక్ష నేతగా 10 ఏళ్ల మహారాష్ట్ర, కర్ణాటక అక్రమ ప్రోజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాం. రైతుల కోసం ఉద్యమాలు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేస్తారా..?... ఒకసారి కేసులు ఎత్తేశామని మహారాష్ట్ర ప్రకటించాక మళ్లీ ఇప్పుడు తప్పుడు కేసులు బనాయిస్తారా..?...అని మండిపడ్డారు.

అప్పుడు గుజరాత్...ఇప్పుడు ఆంధ్రా మోడల్

అప్పుడు గుజరాత్...ఇప్పుడు ఆంధ్రా మోడల్

నాలుగేళ్లలో కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి ప్రధాని నరేంద్రమోడీకి కంటిగింపుగా మారిందని...గతంలో గుజరాత్ మోడల్ అనేవారు...ఇప్పుడు దేశం అంతా ఆంధ్రప్రదేశ్ మోడల్ అనడం చూసి మోడీ అక్కసు పట్టలేకపోతున్నారని నాని విమర్శించారు.
ఈ నెల 23న ప్రకృతి సేద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ను ప్రసంగించాలంటూ ఐక్యరాజ్యసమితి పంపిన ఆహ్వానం చూసి ప్రధాని నరేంద్రమోడీ ఈర్ష్యతో రగిలిపోతున్నారని...ఏదో విధంగా చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలనే ఈ విధమైన కుతంత్రాలు పన్నుతున్నారని ఎంపి కేశినేని నాని ఆరోపించారు.

అక్కసు తీరలేదు...అందుకే

అక్కసు తీరలేదు...అందుకే

అందుకే ఈ నెల 23న అమెరికా వెళ్లకుండా చేసేందుకే 21 న ధర్మాబాద్ కోర్టుకు హాజరు కావాలని తప్పుడు కేసు వేయించి నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చేలా చేశారన్నారు. అంతర్జాతీయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్ట పెరగడం చూసి మోడీ, అమిత్ షా తట్టుకోలేక పోతున్నారని...నిధులు ఇవ్వకుండా, చట్టం అమలు చేయకుండా, హామీలు నెరవేర్చకుండా చేయడం వల్ల కూడా నరేంద్ర మోడీ అక్కసు తీరలేదని, ఇంకా ఏదో విధంగా చంద్రబాబును కేసులలో ఇరికించి రాజకీయ కక్ష సాధించాలని కుట్రలు చేస్తున్నారని ఎంపి నాని ఆరోపణల వర్షం కురిపించారు. ఈ మహా కుట్రలో తెర వెనుక కుట్రదారులు, పాత్రధారుల అందరి గుట్టు ఇప్పుడు రట్టు అయ్యిందని...వీరికి తగిన గుణపాఠం ప్రజలే చెబుతారని వ్యాఖ్యానించారు.

English summary
BJP leader Purandeshwari, said there was no connection with the notices to BJP sent to Chief Minister Chandrababu Naidu from Maharastra court. On Friday, she questioned TDP infront of media in Vijayawada why throwing allegations on BJP over the notices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X