వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడిపి అనుబంధ సంఘాల అద్య‌క్షులు వీరే..! తెలుగుయువ‌త అద్యక్షుడుగా దేవినేని అవినాష్..!

|
Google Oneindia TeluguNews

అమరావతి : తెలుగుదేశం పార్టీ సంస్థాగ‌త బ‌లోపేత దిశాగా అడుగులు వేస్తోంది. అనుబంద సంఘాల‌కు అద్య‌క్షుల‌ను నియ‌మించి ఎన్నిల‌కు సై అంటోంది ఏపీ టీడిపి. టీడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టలో పలు అనుబంధ సంఘాలకు అధ్యక్షులను నియమించారు. మొత్తం పది అనుబంధ సంఘాల అధ్యక్షుల పేర్లను సీఎం వెల్లడించారు. తెలుగు యువత అధ్యక్షుడిగా దేవినేని అవినాశ్ (కృష్ణా), తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పోతుల సునీత (ప్రకాశం), తెలుగు రైతు అధ్యక్షుడిగా కంభం విజయరామిరెడ్డి (నెల్లూరు), బీసీ సెల్‌ అధ్యక్షుడిగా బోనబోయిన శ్రీ‌నివాస యాదవ్‌ (గుంటూరు), ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా ఎంఎస్‌ రాజు (అనంతపురం), ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా ఎంవీవీ ప్రసాద్‌ (విశాఖపట్నం)లను నియమించారు. ఇక, మైనారిటీ సెల్‌‌కు ఇంతియాజ్‌ అహ్మద్‌ (కర్నూలు), క్రిస్టియన్‌ సెల్‌‌కు మద్దిరాల జోసెఫ్‌ ఇమ్మాన్యువల్‌ (గుంటూరు), టీఎన్‌టీయూసీకి బి. నరేశ్‌ కుమార్‌ రెడ్డి (చిత్తూరు), అంగన్‌వాడీ యూనియన్‌‌కు భీమినేని వందనాదేవి (గుంటూరు)లను అధ్యక్షులుగా నియమించారు.

These are the leaders of the TDP affiliates..! Devanine Avinash President of Telugu Youth..!!

తెలుగు యువ‌త అద్యక్షుడుగా ఎన్నికైన దేవినేని అవినాష్ త‌న నియామ‌కం ప‌ట్ల చంద్ర‌బాబుకు క్రుత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమ‌ర్శించే స్థాయి ప్రతిప‌క్ష వైసీపికి లేద‌ని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యువత పార్టీ వైపు ఆకర్షితులు అయ్యే విధంగా పనిచేస్తానని చెప్పారు. తన మీద నమ్మకంతో చంద్రబాబు తెలుగుయువత అధ్యక్ష పదవిని ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లో బలంగా తీసుకువెళ్లానని తెలిపారు. మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలు కలసిఇ చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నారని ఆయన్ను తాకాలంటే ముందు తెలుగు యువతను దాటి రావాలని అవినాష్ ఆవేశంగా స్పందించారు.

English summary
The Telugu Desam Party is moving towards institutional strengthening. AP TDP president Chandrababu Naidu appointed chairpersons of various affiliates in the party. The names of the chairpersons of all ten subsidiary associations were revealed by babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X