• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంతలో ఎంత మార్పు..వాళ్లు చీడ పురుగులు..!ఆ ఎంపీలను పచ్చిగా దూషిస్తున్న తెలుగు తమ్ముళ్లు..!!

|

అమరావతి/హైదరాబాద్ : పార్టీలో ఉన్కప్పుడు ఒక లెక్క.. పార్టీని విడిచి పెట్టినప్పుడు ఒకలెక్క అంటున్నారు తెలుగుతమ్ముళ్లు. దేశంలోనే అత్యంత సమర్థవంతమైన నెట్ వర్క్ ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీని ఎంతో మంది పేర్కొన్నారు. అందుకే 85 శాతం సీట్లతో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా 40 శాతం రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు.

ఈరోజు పార్టీని వీడిన నలుగురు ఎంపీలు తెలుగుదేశం పార్టీకి నలుగురు కార్యకర్తలతో కూడా సమానం కాదనే చర్చ తెలుతమ్ముళ్లలో నడుస్తోంది. ఎందుకంటే కార్యకర్తలు పార్టీని మోస్తే... ఈ నలుగురు పార్టీపై ఆధారపడ్డారు. ఇంకా చెప్పాలంటే, పార్టీ ఈ నలుగురి వల్ల ప్రజల్లో డ్యామేజ్ అయ్యింది. అవినీతి నేతలను భరిస్తోందన్న ముద్ర వేసుకుంది. పార్టీ మారిన నలుగురులో ముగ్గురిపై విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వారిని వెనకేసుకురాలేక టీడీపీ తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యిందని కూడా తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్న తెలుస్తోంది.

 చీడ వెళ్లిపోవాల్సిందే..! ఆ నలుగురిపై మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు..!!

చీడ వెళ్లిపోవాల్సిందే..! ఆ నలుగురిపై మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు..!!

పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వీరి వల్ల పార్టీకి ఇంత తలనొప్పి అవసరమా అని ఫీలయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం పార్టీకి కొంచెం ఆర్థిక అండ తప్పించి ఏ విధంగా పార్టీకి వీరి వల్ల ఉపయోగం లేదు. అయితే, వారి వల్ల పార్టీకి కలిగే మేలు కంటే కూడా డ్యామేజ్ చాలా ఎక్కువ. ఎన్నికల సమయంలో ఇది పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇలాంటి వారు టీడీపీకి అని అభిమానులు కూడా ఫీలయిన సందర్భాలున్నాయి. అయితే, ఆ నలుగురు టీడీపీని వదిలిన అవినీత చీడ అని ఇపుడు పార్టీ మారడంతో అవినీతి బీజేపీలో అవినీతి నేతలు చేరడంతో మా పార్టీ ప్రక్షాళన అయ్యిందని కామెంట్ చేస్తున్నారు తెలుగుదేశం అభిమానులు. నిజానికి అభిమానుల ఆలోచన కరెక్టే. ఈ కామెంట్ కు మంచి లైకులు పడుతున్నాయి. నెట్లో ఇది హాట్ కామెంట్ గా వైరల్ అవుతోంది.

బెదిరింపులకు భయపడేది లేదు..! టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటు స్పందన..!!

బెదిరింపులకు భయపడేది లేదు..! టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటు స్పందన..!!

బెదిరింపులకు భయపడేది లేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. పార్టీ మారిన ఎంపీలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎంపీలు పార్టీ మారిన గంటలోపే బెదిరింపులు మొదలయ్యాయని ఆరోపించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనకు ఫోన్‌ చేసి బెదిరించారని, బీజేపీలో చేరిన ఎంపీలపై అనవసర వ్యాఖ్యలు చేస్తే జైల్లో పెడతారని తనను భయానికి గురి చేసేందుకు ప్రయత్నించారని అన్నారు. 'సుజనా చౌదరి ఇంటి నుంచి లక్ష్మీప్రసాద్‌ నాకు ఫోన్‌ చేసి బెదిరించారు. జైలులో పెడతారని, పార్టీ మారిన ఎంపీలపై విమర్శలు మానుకోవాలని సూచించారు. మీలాగే నాపై కేసులులేవని చెప్పాను. నేనేమైనా బ్యాంకులు దోపిడీ చేశానా అని అడిగాను' అని వెంకన్న వివరించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనన్న వెంకన్న.. బాబు తమకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారని చెప్పారు. లక్ష్మీప్రసాద్‌ బెదిరింపులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని వెంకన్న చెప్పారు.

 టీడీపీ రాజ్యసభా పక్ష నేతగా సీతారామలక్ష్మి..! ఎంపిక చేసిన టీడిపి...!!

టీడీపీ రాజ్యసభా పక్ష నేతగా సీతారామలక్ష్మి..! ఎంపిక చేసిన టీడిపి...!!

నలుగురు టీడీపీకి చెందిన రాజ్య సభ సభ్యులు సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌ , సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు గురువారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ పక్షాన్ని విలీనం చేస్తున్నట్లుగా చేసిన తీర్మాన లేఖను రాజ్యసభ చైర్మెన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి వారు అందచేశారు. అయితే టీడీపీ పక్షం విలీనం చెల్లదంటూ రాజ్య సభ చైర్మన్ వెంకయ్యనాయుడుకి టీడీపీ ఎంపీలు కలిసి ఓ లేఖ సమర్పించారు. అనంతరం, మీడియాతో గల్లా జయదేవ్ మాట్లాడుతూ, బీజేపీలో టీడీపీ రాజ్యసభా పక్షం విలీనం రాజ్యాంగ విరుద్ధమని, నలుగురు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని తమ లేఖలో కోరామని చెప్పారు. రాజ్యాంగం 10వ షెడ్యూల్ ప్రకారం రాజకీయ పార్టీల విలీనానికే అవకాశం ఉందని అన్నారు. పార్టీ మారిన టీడీపీ ఎంపీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. టీడీపీ రాజ్యసభాపక్ష నేతగా సీతారామలక్ష్మిని ఎంపిక చేశామని, ఈ విషయాన్ని వెంకయ్యనాయుడికి చెప్పామని అన్నారు.

 పూర్తైన విలీన ప్రక్రియ..! రాజ్యసభ రికార్డు జాబితాలో మార్పులు..!!

పూర్తైన విలీన ప్రక్రియ..! రాజ్యసభ రికార్డు జాబితాలో మార్పులు..!!

టీడీపీకి చెందిన రాజ్య సభ సభ్యులు సీఎం రమేశ్‌, టీజీ వెంకటేశ్‌ , సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు గురువారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా టీడీపీ పక్షాన్ని విలీనం చేస్తున్నట్లుగా చేసిన తీర్మాన లేఖను రాజ్యసభ చైర్మెన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి వారు అందచేశారు. 10వ షెడ్యూల్‌లోని 4వ పేరా నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని ఉపరాష్ట్రపతిని కోరారు. ఆ వెంటనే టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసుకుంటున్నామని తెలుపుతూ ఆపార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా రాసిన లేఖను బీజేపీ నేతలు ఉపరాష్ట్రపతికి ఇచ్చారు. ఈ రెండు లేఖలపై రాజ్యసభ ఛైర్మన్‌ వెంటనే నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలోకి టీడీపీ విలీన ప్రక్రియకు ఆమోదముద్ర వేశారు. దీంతో రాజ్యసభ రికార్డుల్లో పార్టీల వారీ జాబితాలో మార్పులు చేశారు.దీనితో రాజ్యసభలో బీజేపీలోకి టీడీపీ విలీన ప్రక్రియ పూర్తయింది. ఆ నలుగురు ఎంపీలను బీజేపీ సభ్యులుగా రాజ్యసభ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. నేడు ఈ నలుగురు ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేమైన విషయం తెలిసిందే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP Cadre sayinf that party became a public nuisance due to these four mp's. The impression that corrupt leaders are enduring. Three of the four people who turned the party have been accused of gross corruption. It is also reported that the TDP has been in serious trouble for not getting behind them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more