వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విధులు నిర్వహిస్తున్న ఎస్సైపై దొంగలముఠా దాడి: ఎస్సైకి గాయాలు

జిల్లాలోని మార్టూరు ఎస్‍ఐ నాగమల్లేశ్వరరావుపై దొంగలముఠా దాడిచేసింది.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

ప్రకాశం: జిల్లాలోని మార్టూరు ఎస్‍ఐ నాగమల్లేశ్వరరావుపై దొంగలముఠా దాడిచేసింది. అర్దరాత్రి మార్టూరు మండలం బొల్లాపల్లి వద్ద జాతీయరహదారిప్తె అర్దరాత్రి గస్తీ నిర్వహిస్తున్న ఎస్‍ఐ నాగమల్లేశ్వరరావుకు దొంగలముఠా తారసపడింది. మార్టూరు జాతీయరహదారిలో దారిదోపిడీలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్ఐ వాటిపై దృష్టి సారించారు.

బొల్లాపల్లి సమీపంలో జాతీయరహదారిపై సివిల్ డ్రస్సులొ తన సిబ్బందితో ఉన్న ఎస్‍ఐపై దుండగులు దాడిచేసారు. జాతీయరహదారిప్తె వెళుతున్న ప్రయాణీకులుగా భావించిన దొంగలు దోపిడీ చేయటానికొచ్చారు. అప్రమత్తమ్తెన ఎస్ఐ, సిబ్బంది పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ముగ్గురు నిందితులు ఎస్ఐపై కత్తితో దాడిచేసి పరారయ్యారు.

Thieves attacked on SI with knife in Prakasam district

గాయమైన ఎస్‍ఐ నాగమమల్లేశ్వరరావును చిలకలూరిపేట ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదం తప్పటంతో ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నిందితులకోసం పోలీసులు ముమ్మరంగా గాలింపుచేపట్టారు.

విష జ్వరంతో 5 ఏళ్ల చిన్నారి మృతి

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణం 4 వ వార్డులో విష జ్వరంతో కనమర్లపూడి చరణ్(5) అనే బాలుడు మృతి చెందాడు. చరణ్ గత నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు వైరల్ జ్వరమని స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్వరం తగ్గినట్లే తగ్గి మళ్లీ జ్వరం తిరగబెట్టింది.

నాలుగు రోజులుగా జ్వరం మరలా రావటంతో జ్వరం తో బాధపడుతున్న చరణ్ ను స్థానిక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం తీసుకెళ్లారు. కాగా, సోమవారం ఉదయం బాలుడు మృతి చెందాడు, చరణ్ పట్టణంలో ఒక ప్రవేటు పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. తల్లితండ్రులకు ఒకగానోక కుమారుడు కావటంతో తల్లడిల్లుతున్నారు.

English summary
Thieves created terror at Bollapalli Toll Plaza of Prakasam district. According to reports, the thieves robbed the lorry drivers by stopping the lorries. With the information was given by a lorry driver police reached the spot where thieves attacked SI Naga Malleswara Rao with a knife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X