వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డి దూరంగా ఉంటే: రాజకీయాల్లోకి వారసుడు, దూసుకెళ్తున్నాడు

నల్లారి కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు. ఆరు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో అడుగుపెట్టిన నల్లారి కుటుంబం ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పలు పదవులను అధిరోహించింది.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: నల్లారి కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు. ఆరు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో అడుగుపెట్టిన నల్లారి కుటుంబం ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు పలు పదవులను అధిరోహించింది.

అప్పుడు బాధపడ్డా, నేను-అన్నయ్య ఒకే పార్టీలో: కిరణ్ రెడ్డి సోదరుడుఅప్పుడు బాధపడ్డా, నేను-అన్నయ్య ఒకే పార్టీలో: కిరణ్ రెడ్డి సోదరుడు

అప్పుడు ప్రారంభం

అప్పుడు ప్రారంభం

1962లో నల్లారి కుటుంబం నుంచి నల్లారి అమర్నాథ్ రెడ్డి వాయల్పాడు అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. నాడు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డిపై పోటీ చేసి గెలిచిన అమర నాథరెడ్డికి పోటీ చేసేందుకు తగిన వయసు లేదని అనర్హత వేటు వేయడంతో ఉపఎన్నికలు వచ్చాయి.

ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి

ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి

నాటి నుంచి ప్రారంభమైన నల్లారి కుటుంబం రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం మూడో తరానికి విస్తరించిన ఈ కుటుంబం నుంచి అమర్నాథ్ రెడ్డి తనయుడు కిరణ్ కుమార్‌ రెడ్డి వాయల్పాడు, పీలేరు అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ చీఫ్‌విప్‌, శాసనసభాపతితో పాటు ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు.

కిరణ్ రెడ్డి తర్వాత..

కిరణ్ రెడ్డి తర్వాత..

అమర్నాథ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల తర్వాత.. ఇప్పుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తనయుడు నల్లారి అమర్నాథ్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేస్తున్నారు. నల్లారి కుటుంబం తొలుత కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. విభజన వరకు ఆ పార్టీ కాంగ్రెస్‌లోనే ఉంది.

మూడున్నరేళ్లు రాజకీయాలకు దూరం

మూడున్నరేళ్లు రాజకీయాలకు దూరం

విభజన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో నల్లారి కుటుంబం మూడున్నరేళ్ల పాటు క్రియాశీలక రాజకీయా లకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది.

విస్తృతంగా కిషోర్ రెడ్డి పర్యటన, తండ్రి వెంటే తనయుడు

విస్తృతంగా కిషోర్ రెడ్డి పర్యటన, తండ్రి వెంటే తనయుడు

కిషోర్ కుమార్ రెడ్డి ఇటీవల పీలేరు నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ పర్యటన, సమావేశాలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకోగా, నల్లారి కుటుంబం నుంచి మూడోతరం యువ నాయకుడు నల్లారి అమర్నాథ్ రెడ్డి తన తండ్రి కిషోర్ కుమార్ రెడ్డి వెంట పాల్గొనడం చర్చనీయాంశమైంది.

కిరణ్ రెడ్డి దూరం ఉండే అవకాశం

కిరణ్ రెడ్డి దూరం ఉండే అవకాశం

కిరణ్‌ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. కాబట్టి ఆయన ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండవచ్చు. సోదరుడు సంతోష్ కుమార్ రెడ్డి కూడా నియోజకవర్గ రాజకీయాలపై విముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎండగడుతున్న అమర్నాథ్ రెడ్డి

ఎండగడుతున్న అమర్నాథ్ రెడ్డి

ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తనకు తోడుగా ఉండి నియోజకవర్గంలో రాజకీయాలను పర్యవేక్షించేందుకు స్వంత వ్యక్తి అవసరమైన దృష్ట్యా కూడా తనయుడిని కిషోర్‌ కుమార్ రెడ్డి రాజకీయల్లోకి తీసుకు వచ్చారని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తండ్రి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం తండ్రి వెంట క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఆత్మీయ సమావేశాల్లో మాట్లాడుతున్నారు. అంతేకాదు, రాజకీయ ప్రత్యర్థుల తీరును ఎండగడుతున్నారు. ఇది యువతను ఆకట్టుకుంటోంది.

English summary
Third generation entering into politics from Nallari family. Nallari Amarnath Reddy, son of Kiran Kumar Reddy's brother, is participating in meetings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X