• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహానటి సావిత్రి దాతృత్వానికి అద్దం పట్టే మరో ఘటన:వెలుగులోకి తెచ్చిన నెటిజన్లు

By Suvarnaraju
|

గుంటూరు:అలనాటి మేటి నటి సావిత్రి జీవిత్ర చరిత్ర ఆధారంగా నిర్మించిబడి సూపర్ హిట్ గా నిలిచిన మహానటి చిత్రం ఎందరినో ఆమె గురించిన అనుభవాలు మళ్లీ కలబోసుకునేలా చేస్తోంది. ఆ మహానటి సావిత్రి గురించి తాము విన్న, కన్నఘటనలను గురించి మిగిలినవారితో పంచుకునేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు.

ఈ క్రమంలో సావిత్రి దాతృత్వానికి అద్దం పట్టే మచ్చుతునక లాంటి ఒకనాటి ఘటనను ఎవరో ఆధారంతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడా పోస్ట్ వైరల్ గా మారింది. ఆనాటి పోస్టు ను తాజాగా వెలుగులోకి తేవడం ద్వారా సావిత్రిలోని దాన గుణమే కాదు దేశ భక్తిని తేటతెల్లం చేసిన ఈ పోస్టు అందరి అభిమానాలను చూరగొంటోంది.

ఇంతకూ సావిత్రి దాతృత్వానికి అద్దం పట్టే ఆ ఘటన ఇదే... అది 1965 భారత్ పాక్ మధ్య

రెండవసారి యుద్దం జరుగుతున్న సమయం...

This incidents is evidence of Savitris Philanthropy:Shared by Netizens

ఆ యుద్ధంలో భారత్ దగ్గర

మందుగుండు సామగ్రి అయిపోయింది...ఆ

నాటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి మందుగుండు సామాగ్రి కొనుగోలు కోసం విరాళాలు విరివిగా ఇవ్వమని దేశప్రజలను అభ్యర్థించాడు.

ఆ క్రమంలో...1965 సెప్టెంబర్ నెల...ప్రధాని ఛాంబర్ లోనికి ఆయన గుమస్తా వచ్చి మీ కోసం ఒక దక్షిణాది ప్రముఖ నటిగారు వేచి ఉన్నారని చెప్పాడు...

ప్రధాని శాస్త్రిగారు ఆలోచిస్తూ సరే లోపలికి పంపండి అన్నారు...5 నిమిషాల తర్వాత అప్పటికి సుమారు 28 సంవత్సరాల వయస్సు వున్నఒక అందమైన యువతి చిరునవ్వుతో మొహం కళకళలాడుతుండగా వంటినిండా నగలతో ధగధగలాడుతూ ప్రధాని గారికి నమస్కారం చేస్తూ లోనికి ప్రవేశించింది...ప్రధాని లాల్ బహుదూర్

శాస్త్రిగారికి తాను ఎవరో పరిచయం చేసుకుంది...శాస్త్రిగారూ అభినందన పూర్వంగా నవ్వారు...

ఆ తర్వాత ఆమె తాను వచ్చిన పని చెబుతూ...

తను ధరించిన ఆభరణాలన్నింటిని తీసి

శాస్త్రిగారి టేబుల్ మీద పెడుతూ...

ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని అన్నది...

తాళిబొట్టు తప్ప అన్నీ నిలువుదోపిడీ ఇచ్చిన ఆమె వంక ఆశ్చర్యపోయి చూస్తుండి పోయారు ఆనాటి మన ప్రధానిగారు..

ఆ తర్వాత తేరుకొని ఆనందం నిండిన కళ్ళతో...

"భేటీ నువ్వు మహనీయురాలమ్మా...

నీ దేశభక్తికి అభినందనలు" అన్నారట...

ఆమెతో కరచాలనం చేసి, ఎంతో గౌరవంగా గుమ్మం వరకు వచ్చి సాగనంపారట...!!

ఇంతకూ ఆమె ఎవరో కాదు మన మహానటి సావిత్రినే!...అందుకు ఆధారంగా ఆనాటి ఫోటోను సైతం జతపరిచారు. ఇది ఆమెలోని దాతృత్వానికి అద్దం పట్టడమే కాదు ఆమె లోని దేశభక్తికి నిదర్శనం కూడా.

ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయబడిన కథనం ఇది. అయితే ఇది యథాతథంగా అలాగే జరిగి ఉండకపోవచ్చు...ఎందుకంటే ఇందుకు సంబంధించిన చిత్రంలో జెమినీ గణేషన్ తో పాటు శివాజీ గణేషన్ కూడా ఉండటం మన గమనించవచ్చు. అయితే వారిద్తరూ తమిళ నటులు కాగా వారితో పాటు మన మహానటి సావిత్రి మాత్రమే ఉండి ప్రధాని ఆభరణాలు నిలువు దోపిడీ దానంగా ఇవ్వడం ద్వారా ఆ ఘటన, అందుకు సంబంధించిన పూర్వాపరాలు మాత్రం వాస్తవమేనని అర్థం చేసుకోవచ్చు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The story of the Great actress Savitri bio pic movie and the super hit cinema 'Mahanati' that makes everybody experiencing their memories about her greatness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more