వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ పరిపాలనా అసమర్థత వల్లే ఇదంతా : నారా లోకేష్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో తాజా పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. మాస్కులు మరియు ఇతర నిత్యావసరాల గురించి వివరిస్తూ సెల్ఫీ వీడియో షేర్ చేసినందుకు నగరి మునిసిపల్ కమిషనర్ వెంకటరామి రెడ్డి సస్పెండ్ చెయ్యటం చూసి ప్రజలు షాక్ అయ్యారని ఆయన పేర్కొన్నారు . ఇది ఇటీవల డాక్టర్ సుధాకర్‌ను నర్సిపట్నంలో సస్పెండ్ చేసిన తరువాత జరిగిన ఘటన కాగా రెండూ ఒకే తరహాలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త ! Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !

సిబ్బందిపై అణచివేత ధోరణికి నిదర్శనమే సీఎం చర్యలు

సిబ్బందిపై అణచివేత ధోరణికి నిదర్శనమే సీఎం చర్యలు

సిబ్బందిపై ఇలాంటి జాలి దయ లేని చర్యల వల్ల వారిలో ఉన్న అసమ్మతి అణచివేసే ప్రయత్నం జరుగుతుందని నారా లోకేష్ పేర్కొన్నారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల స్పూర్తిని దెబ్బ తీసేలా సీఎం జగన్ చర్యలు ఉన్నాయని నారా లోకేష్ అన్నారు . ఏపీ ప్రజలు ఇలాంటి పరిణామాలను చూడటం విచారకరం అని చెప్పిన నారా లోకేష్ సీఎం జగన్ పరిపాలనా అసమర్థత వల్లే , సరైన నాయకత్వ లక్షణాలు లేకపోవటం వల్లే అని నారా లోకేష్ ధ్వజమెత్తారు .

చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా జగన్ అంటూ ప్రశ్న

చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా జగన్ అంటూ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ లో నియంత పాలన నడుస్తుంది. చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా జగన్ అంటూ ప్రశ్నించారు .అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేశారు. మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు కొనడానికి ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వడం లేదు అని పేర్కొన్నారు . ఇక అంతే కాదు ఏపీలో తాజా పరిస్థితుల్లో పేదలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నారా లోకేష్ ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా పేద ప్రజలు అన్ని విధాలుగా చితికిపోయారని ఆయన పేర్కొన్నారు . ఇప్పుడు మళ్ళీ లాక్‌డౌన్ పొడిగింపు వార్తలు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.

Recommended Video

Lockdown : Trains Likely To Available From 15th April
లాక్ డౌన్ పొడిగిస్తే పేదలను ఆదుకోవాల్సింది ప్రభుత్వమే

లాక్ డౌన్ పొడిగిస్తే పేదలను ఆదుకోవాల్సింది ప్రభుత్వమే

ప్రతీ పేద కుటుంబానికీ.. రూ.5 వేలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పనులు లేవు, తినడానికి తిండి లేదు, ఎక్కడకి కదలలేని పరిస్థితి, అప్పు పుట్టే అవకాశమే లేదని అన్నారు . ఇలాంటి సమయంలో జగన్ గారు ఆదుకోవాలని సూచించారు.అటు రైతుల కష్టాలు కూడా వర్ణనాతీతమని పేర్కొన్నారు . మద్దతు ధర, రవాణా సౌకర్యం లేక లాక్ డౌన్ దెబ్బకి పండిన పంట పొలాల్లోనే వదిలేస్తున్నారని తెలిపారు. దీనికి తోడు అకాల వర్షాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని నారా లోకేష్ ట్విట్టర్ లో తెలిపారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి, నష్ట పరిహారం చెల్లించి, వారిలో ధైర్యాన్ని నింపాలి అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

English summary
Dictatorial rule continueing in Andhra Pradesh.Nara lokesh asked whether the government would be suspended if anyone raises the problems .The accounts were frozen. Nara Lokesh tweeted that the state government should urgently help the poor in the latest situation in AP. Nara lokesh said that eerybody Shocked to see Nagari Municipal Commissioner Venkatarami Reddy getting suspended for sharing a selfie video explaining the lack of masks & other essentials. It follows the recent suspension of Dr. Sudhakar in Narsipatnam on similar lines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X