• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీడీపీ తొలి మహానాడు జరిగింది ఇలా.!అంతా ఉత్కంఠే.!ఎన్టీఆర్ ప్రసంగానికి ముగ్దులైన జాతీయ నాయకులు.!

|

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ తొని మహానాడు అత్యంత ఉత్కంఠ పరిస్థితుల మద్య జరిగినట్టు తెలుస్తోంది. సర్గీయ నందమూరి తారక రామారావుకు ఎవ్వరూ కూడా సలహాలు, సూచనలు ఇచ్చే సహసాలు చేయలేరు గనక మొత్తం కార్యక్రమం ఎన్టీఆర్ ఆలోచనలకు అనుకూలంగా జరిగినట్టు చెప్తుంటారు. మొదట్లో మహానాడు అంటే సమావేశమా? వేడుకా? బహిరంగ సభా అని చాలా మంది నేతలకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది తెలుగుతమ్ముళ్ల అతిపెద్ద పండగగా అవతరించబోతోంది ఈ మహానాడు అని.

తొలి టీడిపి మహానాడు.. పసుపుమయమైన గుంటూరు..

తొలి టీడిపి మహానాడు.. పసుపుమయమైన గుంటూరు..

తెలుగు దేశం పార్టీ తొలి మహానాడును 1983 మే 26, 27, 28 తేదీల్లో నిర్వహించారు. తెలుగు దేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఎన్టీఆర్. పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే టీడీపీ తొలి మహానాడు జరగడంతో, ఎంతో అట్టహాసంగా జరిగింది. తెలుగు తమ్ముళ్లు పండుగలా భావించారు. గుంటూరులోని శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ స్టేడియంలో తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభ జరిగింది. చివరిరోజైన మే 28న భవానీపురం మీదుగా బందర్ రోడ్డు వరకు బ్రహ్మండమైన ఊరేగింపు జరిగింది. తెలుగు తమ్ముళ్ల ర్యాలీతో గుంటూరు మొత్తం పసుపుమయంగా మారిందని చెబుతారు.

తెలుగు తమ్ముళ్ల ర్యాలీ.. జనమయమైన క్రిష్ణ,గుంటూరు జిల్లాలు..

తెలుగు తమ్ముళ్ల ర్యాలీ.. జనమయమైన క్రిష్ణ,గుంటూరు జిల్లాలు..

అదే రోజు సాయంత్రం శాతవాహన్ నగర్ లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.
తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభలు అప్పట్లో దేశంలో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ కోటలు బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన అన్న ఎన్టీఆర్ కు దేశ వ్యాప్తంగా క్రేజీ వచ్చింది. కాంగ్రెస్ వ్యతిరేక శక్తులకు ఆయన కేంద్రంగా మారిపోయారు. అందుకే తెలుగు దేశం మహాసభలకు ఎన్టీఆర్ పిలవగానే.. అప్పటి కాంగ్రెసేయేతర పార్టీల నేతలంతా గుంటూరు వచ్చేశారు.

అద్బుతంగా సాగిన ఎన్టీఆర్ ప్రసంగం.. ఆశ్యర్యపోయిన జాతీయనాయకులు..

అద్బుతంగా సాగిన ఎన్టీఆర్ ప్రసంగం.. ఆశ్యర్యపోయిన జాతీయనాయకులు..

అప్పటి రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న ఎంజీ రామచంద్రన్, బాబు జగ్జీవన్ రావు, ఫరూఖ్ అబ్దుల్లా, హెచ్ఎస్ బహుగుణ, చండ్ర రాజేశ్వర్ రావు వచ్చారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎల్ కే అద్వానీ, అటల్ బిహార్ వాజ్ పేయ్, రామకృష్ణ హెగ్దే, అజిత్ సింగ్ , శరద్ పవార్, ఉన్నికృష్ణన్, ఎస్ఎస్ మిశ్రా, రవీంద్ర వర్న, మేనకాగాంధీలు హాజరయ్యారు. ఒక రకంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలంతా తెలుగు దేశం పార్టీ ప్రధమ మహాసభలకు రావడం అప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

  Niti Aayog On Covid Vaccination Drive పారదర్శక పద్ధతిలోనే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు!
  అప్పుడు మొదలైన ప్రస్థానం.. అప్రతిహతంగా కొనసాగుతున్న మహానాడు..

  అప్పుడు మొదలైన ప్రస్థానం.. అప్రతిహతంగా కొనసాగుతున్న మహానాడు..

  తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం వచ్చిన ప్రతినిధుల కోసం ప్రత్యేక కుటీరాలు నిర్మించారు. మహానాడుకు వచ్చిన జాతీయ నేతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టీడీపీ మహానాడులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అప్పటి ప్రముఖ సినీ కళాకారులు వినోద కార్యక్రమాలతో అలరించారు. మొత్తంగా 1983 మే26,27,28 తేదీల్లో గుంటూరులో అప్పటి ముఖ్యమంత్రి అన్న ఎన్టీ రామారావు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రధమ మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా జరిగాయని అంటారు. మహానాడు వంటి అరుదైన ఘనత ఏ పార్టీకి దక్కలేదనే చర్చ కూడా ప్రజల్లో చోటుచేసుకుంది.

  English summary
  The first Mahanada of the Telugu Desam Party was held on May 26, 27 and 28, 1983. NTR took over as the Chief Minister in just nine months after founding the Telugu Desam Party. A few days after the party came to power, the first Mahanada of the TDP took place and it was a great success.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X