వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిసీజ్ మై పెర్ఫార్మెన్స్.. ఎనీ డౌట్స్: మంత్రి లోకేష్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రతిపక్షాలను ఏకి పారేసిన లోకేష్..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రిగా తన పనితీరు విషయంలో ఎలాంటి సందేహాలు, అనుమానాలు అవసరం లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన తాను ఐటీ శాఖ మంత్రి అయిన తరువాత రాష్ట్రానికి అనేక కంపెనీలు వచ్చాయన్నారు.

ఈ సందర్భంగా తన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద కామెంట్స్ చేసిన బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజుకు ఘాటుగా కౌంటర్ ఇస్తూనే ప్రతిపక్షపార్టీలకు కూడా లోకేష్ చురకలు అంటించారు.

అందరూ వినండి.. ఇదీ నా ప్రగతి...

అందరూ వినండి.. ఇదీ నా ప్రగతి...

‘అసెంబ్లీకి వచ్చినవారు.. రానివారూ అందరూ వినండి.. ఇదీ నేను సాధించిన ఐటీ ప్రగతి' అంటూ నారా లోకేష్ శుక్రవారం ఆవేశంగా తాను ఏపీ ఐటీ శాఖలో తెచ్చిన, తెస్తున్న మార్పులు.. అలాగే ఏవిధంగా అభివృద్ది పథంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారో వివరించారు. చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వంపై అనేక కంపెనీలకు విశ్వాసం ఉన్నందుకే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.

మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమిదే...

మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమిదే...

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు 21 రోజుల్లోనే భూములతో పాటు అన్ని అనుమతులూ ఇస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో రూ.1600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవబోతున్న హీరో మోటోకార్ప్ సంస్థ మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. లక్షమందికి ఉద్యోగాలు కల్పించామన్నారు.

బురద జల్లడం కాదు, చేతనైతే...

బురద జల్లడం కాదు, చేతనైతే...

తనపై బురదజల్లేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని వైసీపీ, బీజేపీలను ఉద్దేశించి మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ‘మీకు దమ్ముంటే ఒక్క కంపెనీని రాష్ట్రానికి తీసుకురండి?' అంటూ సవాల్ విసిరారు. ‘మీకు విమాన టిక్కెట్లు నేను బుక్ చేస్తా.. హోటల్ ఖర్చులు కూడా నేనే భరిస్తా.. ప్రయత్నించండి.. రాష్ట్రానికి రెండు ఐటీ కంపెనీలను తీసుకురండి..' అంటూ నిప్పులు చెరిగారు లోకేష్. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు.

ప్రతిపక్ష నేత కేసులతో బిజీగా...

ప్రతిపక్ష నేత కేసులతో బిజీగా...

ఇక అసెంబ్లీకి ప్రతిపక్షం హాజరుకాకపోవడంపై ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లోనూ సెటైర్లు వేశారు. ప్రతి శుక్రవారం మన ప్రతిపక్ష నేత జగన్ కోర్టు కేసులతో బిజీగా ఉంటే.. మన ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి పనుల్లో నిమగ్నమవుతున్నారు. 1500 మందికి ఉద్యోగాలిచ్చే హీరో ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు... ఇదీ చంద్రబాబుకి జగన్‌కి ఉన్న తేడా..' అంటూ తన శైలికి విరుద్ధంగా మంత్రి లోకేష్ సెటైర్లు పేల్చారు.

English summary
Andhra Pradesh IT Minister Nara Lokesh on Friday while talking in AP Assembly challenged the Opposition Parties that they can bring IT companies to State. Lokesh offered Free Flight tickets, Hotel stay and asked YCP and BJP leaders to bring the IT Companies to establish firms in the state. He also critisized YCP Chief YS Jagan that every friday he is busy in attending the Courts, at the same time CM Chandrababu Naidu is busy in the development activities of AP. He also stated that no one can doubt his abilities and performance as a Minister for IT to the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X