వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు సీబీఐ కోర్టుకు హాజరుకాని జగన్ ... రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

ఏపి సిఎం జగన్‌ నేడు సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కాలేదు. జగన్ అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని సి.బి.ఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరు కావాల్సిన విషయం తెలిసిందే. నేడు కోర్టుకు హాజరు కావలసిన సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టులో విచారణకు హాజరుకాలేదు. ఏపీలో ఓ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ రోజు మినహాయింపు కోరడంతో ఆయన చేసుకున్న అభ్యర్థనను సీబీఐ న్యాయస్థానం అంగీకరించినట్లుగా తెలుస్తోంది.

రాజధానిపై త్వరలో సీఎం జగన్ ప్రకటన : బొత్సా స్పష్టీకరణరాజధానిపై త్వరలో సీఎం జగన్ ప్రకటన : బొత్సా స్పష్టీకరణ

జగన్ అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణ సీబీఐ కోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది. తాజాగా సీబీఐ కోర్టు జగన్ కు ఝలక్ ఇచ్చిన నేపధ్యంలో ఆయన హాజరు తప్పనిసరిగా మారింది. సీఎంగా బిజీ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో మినహాయింపు ఇవ్వాలని కోరినప్పటికీ కుదరదని తేల్చి చెప్పడంతో, కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేయడంతో ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.

This is the reason why Jagan didnt attended the CBI court

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కావాలని, ఒక సీఎంగా తనకున్న బిజీ షెడ్యూల్, ప్రోటోకాల్ నేపథ్యంలో తాను కోర్టుకు హాజరు కావటం సాధ్యపడదని ఆయన కోర్టులో పిటీషన్ వేశారు. అంతే కాదు సెక్యూరిటీ కోసం దాదాపుగా 60 లక్షలు ఖర్చు అనవసరపు వ్యయం అవుతుందని పిటిషన్ దాఖలు చేశారు. అయితే జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు అవకాశమిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని సిబిఐ తరఫు న్యాయవాది గట్టిగా వాదించడంతో కోర్టు జగన్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

English summary
AP CM Jagan was not attended at the CBI court today. The CBI has been asked to appear before the CBI special court in Nampally, Hyderabad, every Friday. CM Jagan Mohan Reddy, who is scheduled to appear in court today, did not attend court. The CBI court seems to have accepted his request for an exemption today in the wake of a visit by Union Minister Dharmendra Pradhan in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X