వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాంధ్రపై ఆ యువ నేత‌ల గురి..! ఎవ‌రిది పై చేయి..? రాజ‌కీయ వ‌ర్గాల్లో నెల‌కొన్న ఉత్కంఠ‌..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైద‌రాబాద్: ఏపి రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుదైల‌న నేప‌థ్యంలో రాజ‌కీయ పార్టీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. గెలుపు గుర్రాల పై క‌స‌ర‌త్తు చేస్తూనే రాజ‌కీయాల్లో త‌మ స‌త్తా చాటేందుకు ముఖ్య‌నేత‌లు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇక ఊరికి ఉత్తరాన ఆ ఇద్దరు కీల‌క నేత‌లు దృష్టి పెట్టారు. ఇప్పుడు వారిద్దరూ ఎక్కడ పోటీ నుంచి చేస్తార‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో ఉత్కంఠ‌గా మారింది. ఎన్నికల షెడ్యూల్ ప్రక‌టించ‌డంతో అన్ని పార్టీల్లో టికెట్ల టెన్షన్ ప‌ట్టుకుంది. ఆ ఇద్దరు కీల‌క నేత‌లు మాత్రం త‌మ పోటీ విష‌యంలో స్పష్టత‌కు రాలేక‌పోతున్నారు. ఇద్దరి చూపు ఉత్తరాంధ్రపై ఉన్నప్పటికీ, పోటీ విష‌యంలో మాత్రం త‌ర్జన‌భ‌ర్జన ప‌డుతున్నారు. ఇంత‌కీ వారిద్దరూ ఎవ‌ర‌నుకుంటున్నారా.? వ‌ఆరిలో ఒక‌రు టీడీపీ యువ‌నేత‌, మంత్రి నారా లోకేష్ కాగా మ‌రొక‌రు జ‌నసేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.

<strong>టీడిపి ఎంపీ అభ్య‌ర్థులు వీరే..! మ‌రో రెండు మూడు రోజుల్లో అదికారికంగా ప్ర‌క‌టించ‌నున్న బాబు..!!</strong>టీడిపి ఎంపీ అభ్య‌ర్థులు వీరే..! మ‌రో రెండు మూడు రోజుల్లో అదికారికంగా ప్ర‌క‌టించ‌నున్న బాబు..!!

ఉత్త‌ర దిక్కుపై క‌న్నేసిని యువ‌నేత‌లు..! ఏపిలో ఆస‌క్తిగా మారిన రాజ‌కీయాలు..!!

ఉత్త‌ర దిక్కుపై క‌న్నేసిని యువ‌నేత‌లు..! ఏపిలో ఆస‌క్తిగా మారిన రాజ‌కీయాలు..!!

చంద్రబాబు వారసుడిగా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన నారా లోకేష్ ఇప్పటివ‌ర‌కు ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అనుభ‌వం లేదు. ఆయ‌న పూర్తిస్థాయి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక జ‌రుగుతున్న ఎన్నిక‌లు ఇవే కావ‌డంతో, ఇప్పుడు ఆయ‌న పోటీపై స‌ర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండానే లోకేష్ మంత్రి అయ్యారు. 2017లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో గెలిచి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. ఆ త‌ర్వాత ప్రసంగాల్లో త‌డ‌బ‌డ్డా, మంత్రిగా మాత్రం స‌మ‌ర్థవంతంగా ప‌నిచేస్తున్నార‌న్న ముద్ర‌ను వేసుకోగ‌లిగారు లోకేష్.

లోకేష్ నియోజ‌క‌వ‌ర్గంపై రాని స్ప‌ష్ట‌త‌..! అందుకే ఉత్త‌రాంద్ర‌ను ఎంపిక చేసుకున్న యువ మంత్రి..!!

లోకేష్ నియోజ‌క‌వ‌ర్గంపై రాని స్ప‌ష్ట‌త‌..! అందుకే ఉత్త‌రాంద్ర‌ను ఎంపిక చేసుకున్న యువ మంత్రి..!!

ఇక అసెంబ్లీ ఎన్నిక‌లు రావ‌డంతో ఆయ‌న ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? పోటీ చేస్తే గెలుస్తారా..! అన్న అంశాల‌పై ఆస‌క్తి నెల‌కొంది. తొలుత అమ‌రావ‌తి ప్రాంతంలోని ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని ప్రచారం జ‌రిగినా.. త‌ర్వాత ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాల‌ని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు రాయ‌ల‌సీమ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌టంతో లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం మేర‌కు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భీమిలి నుంచి పోటీ చేయాల‌న్న ఆలోచ‌న తెర‌పైకి వ‌చ్చింది. ఇందుకుగానూ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఈసారి అనకాప‌ల్లి ఎంపీగా పోటీ చేయించే ఆలోచ‌న‌లో చంద్రబాబు ఉన్నారు. లేదా విశాఖ ఉత్తరం నియోజ‌క‌వ‌ర్గం ఇవ్వాల‌ని భావిస్తున్నారు.

 విశాఖ పై లోకేష్ చూపు..! అదిష్టానం నిర్ణ‌యం కోసం ఎదురుచూపు..!!

విశాఖ పై లోకేష్ చూపు..! అదిష్టానం నిర్ణ‌యం కోసం ఎదురుచూపు..!!

తాజాగా భీమిలి నుంచి పోటీపై లోకేష్ స్పష్ట‌త ఇవ్వలేదు. ఇక్కడి స‌మీక‌ర‌ణాల దృష్టి భీమిలి నుంచి పోటీ చేయాలా.. లేదా విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయాల‌న్న దానిపై తేల్చుకోలేక‌పోతున్నారు. మ‌రోవైపు సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీలోకి చేరితే భీమిలి సీటు ఇవ్వాల‌ని చంద్రబాబు భావిస్తున్నారు. అదే జ‌రిగితే లోకేష్ విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అప్పుడు గంటా శ్రీ‌నివాస‌రావు అన‌కాప‌ల్లి లేదా విశాఖ ఎంపీగా పోటీ చేయ‌వ‌చ్చు. ఇలా లోకేష్ పోటీ విష‌యంలో భీమిలి లేదా విశాఖ ఉత్తరం నియోజ‌క‌వ‌ర్గాల‌పై స్పష్టత రావాల్సి ఉంది.

ఉత్త‌రాంద్ర‌లో ప్ర‌భావం చూపిస్తానంటున్న గ‌బ్బ‌ర్ సింగ్..! పోటీ చేసే స్థానం పై టెన్స‌న్..!!

ఉత్త‌రాంద్ర‌లో ప్ర‌భావం చూపిస్తానంటున్న గ‌బ్బ‌ర్ సింగ్..! పోటీ చేసే స్థానం పై టెన్స‌న్..!!

ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కల్యాణ్ కూడా ఉత్తరాంధ్రపైనే దృష్టి పెట్టారు. పార్టీకి అక్కడే ఎక్కువ‌గా ప‌ట్టుంద‌న్న భావ‌న‌లో ఆయ‌న ఉన్నారు. మొద‌ట్నుంచి ఉత్తరాంధ్ర, తూర్పు, ప‌శ్చిమ గోదావరి జిల్లాల‌పై ప‌వ‌న్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎక్కువ సీట్లు అక్కడే సాధించాల‌న్న తాప‌త్రయంతో ఉన్నారు. ఒకే సామాజికవ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు ఆయా జిల్లాల్లో ఎక్కువ‌గా ఉండ‌టం కూడా ఇందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది. ప‌వ‌న్ తొలుత చెప్పిన‌ట్లు తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తార‌ని అందరూ భావించారు. తాజాగా ఆయ‌న గాజువాక నుంచి కూడా పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో ఎక్కడా పోటీ చేసినా, సానుకూల ఫ‌లితాలే వ‌స్తాయ‌ని పార్టీ అంత‌ర్గత స‌ర్వేలో తేలింది. గాజువాక లేదా పిఠాపురం.. ఏ స్థానంలో బ‌రిలోకి దిగాల‌న్న దానిపై ప‌వ‌న్ త‌ర్జన‌భ‌ర్జన ప‌డుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మ‌రో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంది. మొత్తానికి ఏపి కి చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఉత్త‌రాంద్ర పై క‌న్నేయండంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక్క‌సారిగా ఆస‌క్తి నెల‌కొంది.

English summary
The AP Politics coming in to warm. The two key leaders are unable to clarify their competition. While both are on the north, they are debating the competition. Who are they all here? One of the throws is the TDP young man, Minister Nara Lokesh while the other is Janasana's chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X