వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సమక్షంలో వైసీపీలోకి తోట త్రిమూర్తులు : మరి కొంత మంది సిద్దంగా ఉన్నారు: ఎమ్మెల్సీగా హామీ..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ నేత తోట త్రిమూర్తులు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రెండు రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన త్రిమూర్తులు ప్రధాన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. అంతకు ముందు రామచంద్రాపురంకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్..వేణు అనుచరులు కొంత మంది పార్టీ కార్యలయంలో ముఖ్యులతో సమావేశమయ్యారు. త్రిమూర్తులను తీసుకోవటం పైన సందేహాలు వ్యక్తం చేసారు. దీని పైన ఎటువంటి అనుమానాలు అవసరం లేదని పార్టీ తేల్చి చెప్పింది. ఇదే సమయంలో తోట త్రిమూర్తులు మీద పోటీ చేసిన వేణుతో పాటుగా అదే నియోజకవర్గానికి చెందిన డిప్యూటీ సీఎం బోస్ సైతం తోట త్రిమూర్తులు పార్టీలో చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు. ముగ్గురం కలిసి పని చేస్తామని ప్రకటించారు. మరి కొంత మంది నేతలు వైసీపీలో చేరటానికి సిద్దంగా ఉన్నారని నేతలు చెబుతున్నారు. సీఎం జగన్ డోర్లు ఓపెన్ చేస్తే ఊహించని నేతలు వైసీపీలోకి వస్తారని వారు స్పష్టం చేసారు.

Thota Trimurthulu joined in YCP in presence of CM jagan

వైసీపీలో చేరిన తోట త్రిమూర్తులు..
టీడీపీ మాజీ ఎమ్మెల్యే..తూర్పు గోదావరి జిల్లా కీలక నేత తోట త్రిమూర్తులు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయన టీడీపీకి రాజీనామా చేసారు. గత ఎన్నికల్లో రామచంద్రా పురం నుండి పోటీ చేసిన తోట త్రిమూర్తులు వైసీపీ అభ్యర్ధి వేణు చేతిలో పరాజయం పాలయ్యారు. ఎన్నికల సమయంలోనే ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ, చంద్రబాబు నుండి ఒత్తిడి రావటంతో ఆయన పార్టీ మారలేదు. ఇక.. ఎన్నికల తరువాత టీడీపీ అధినాయకత్వం మీద త్రిమూర్తులు అసహనంతో ఉన్నారు. పార్టీకి చెందిన కాపు నేతలతో సమావేశమయ్యారు. అప్పటి నుండి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటన సమయంలోనూ పాల్గొనలేదు. కాపు వర్గానికి తగిన ప్రాధాన్యత పార్టీలో లేదని తోట త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ రాయబారంతో తోట త్రిమూర్తులు వైసీపీలో చేరాలని నిర్ణయించారు. తాను రాష్ట్ర భవిష్యత్ కోసం పని చేస్తానని పార్టీలో చేరిన అనంతరం త్రిమూర్తులు ప్రకటించారు. బోస్.. ఎమ్మెల్యే వేణు తో కలిసి పని చేస్తామని హామీ ఇచ్చారు. తమ నియోకవర్గంలో కులాల మధ్య వైరం లేదని..ఒకే కులంతో రాజకీయం చేయటం సాధ్యం కాదన్నారు. పవన్ కళ్యాణ్ మీద త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన రెల్లి కులంలో పుట్టాలని కోరుకుంటున్నానని చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు.

Thota Trimurthulu joined in YCP in presence of CM jagan

పార్టీలోకి రావటానికి చాలామంది సిద్దంగా ఉన్నారు...
డిప్యూటీ సీఎం బోస్ సైతం త్రిమూర్తులు పార్టీలోకి రావటాన్ని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు పార్టీ కోసం..ప్రజల కోసం కలిసి పని చేస్తామని ప్రకటించారు. తమ మధ్య రాజకీయంగా మినహా ఎటువంటి వైరుధ్యాలు లేవన్నారు. తోట త్రిమూర్తుల మీద విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే వేణు సైతం త్రిమూర్తులతో కలిసి పని చేస్తామని ప్రకటించారు. తాను..త్రిమూర్తులు..బోస కలిసి నియోజకవర్గం కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ అంగీకరిస్తే చాలా మంది కాపు నేతలు వైసీపీలో చేరటానికి సిద్దంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఆమంచి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాము ఎవరికీ భయపడమని స్పష్టం చేసారు. ఇక.. తోట త్రిమూర్తులను వైసీపీకి తీసుకొచ్చేందుకు ఆమంచి చాలా రోజులుగా ప్రయత్నాలు చేసారు. ఇక, ఇప్పుడు తోట త్రిమూర్తుల ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు నేతలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటుగా త్రిమూర్తులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ దక్కినట్లు సమాచారం. కాపు సామాజికవర్గాన్ని దగ్గర చేసుకోవటామే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది.

English summary
Thota Trimurthulu joined in YCP in presence of CM jagan. Assured him for MLC seat in future. Depurty Cm Bose and local MLA Venu announced co operation for Trimurhtulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X