హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చితికి నిప్పంటిస్తూ నారాయణ కంటతడి: ఆ మలుపు చాలా ప్రమాదకరం అందుకే..

హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మంత్రి నారాయణ తనయుడు నిషిత్ అంతిమ యాత్ర గురువారం ఉదయం ప్రారంభమైంది. పెన్నా నది తీరంలో అంత్యక్రియలు జరుగుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మంత్రి నారాయణ తనయుడు నిషిత్ అంతిమ యాత్ర గురువారం ఉదయం ప్రారంభమైంది. పెన్నా నది తీరంలో అంత్యక్రియలు జరిగాయి.

కొడుకు మృతదేహాన్ని చూసి నారాయణ ఇలా..కొడుకు మృతదేహాన్ని చూసి నారాయణ ఇలా..

ఎనిమిది కిలో మీటర్ల మేర అంతిమయాత్ర కొనసాగింది. ఇందులో పలువురు ప్రముఖులు, నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు. నిషిత్ భౌతిక కాయానికి మంత్రి నారాయణ నిప్పు పెట్టి బోరున విలపించారు.

స్టీరింగ్‌ను నియంత్రించలేక..

స్టీరింగ్‌ను నియంత్రించలేక..

హైదరాబాదులోని రోడ్డు నెంబర్ 36లో జరిగిన రోడ్డు ప్రమాదానికి పలు కారణాలు ఉన్నాయి. అతివేగంతో పాటు పలు కారణాలు ఉన్నాయి. నిషిత్, రాజా రవివర్మలు కారును అతి వేగంతో డ్రైవ్ చేస్తున్నారు.

స్టీరింగును నియంత్రించలేక పిల్లర్ ఢీకొట్టినట్లుగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట ఓ భవన నిర్మాణం జరుగుతోంది.

కందకాలు తవ్వారు..

కందకాలు తవ్వారు..

పెద్ద ఎత్తున తవ్విన కందకాల నుంచి బండరాళ్లు, మట్టిని లారీల ద్వారా బయటకు తరలిస్తున్నారు. అవి వర్షపు నీటితో రోడ్డు మీదకు చేరాయి. వాటిని చూసి పక్కకు తప్పించబోయి స్టీరింగ్ కంట్రోల్ చేయలేక పిల్లర్‌ను ఢీకొట్టి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

 ఈ నాలుగు కారణాలు

ఈ నాలుగు కారణాలు

రోడ్డు ప్రమాదానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి. ఒకటి అతివేగం, రెండు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, మూడు ప్రమాదకరమైన మలుపు, నాలుగు గాలి వాన బీభత్సం. అక్కడ మలుపు రైట్ తిరిగి వెంటనే లెఫ్ట్ తిరగవలసి ఉంటుంది.

అత్యంత వేగం

అత్యంత వేగం

ప్రమాదం జరిగిన తర్వాత వాహనంలో స్పీడో మీటర్‌ 210 దగ్గర ఆగి ఉంది. అంటే.. వాహనం వేగం కనీసం 120 దాటే ఉంటుందని చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వెళ్తుండటం, రోడ్డు ఎత్తు పల్లాలు ఉండటం వంటి అంశాలు ప్రమాదాన్ని నియంత్రించలేకపోయినట్లు అనుమానిస్తున్నారు.

English summary
Thousands attend funeral of Minister Narayana's son Nishith Narayana's funeral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X