• search
  • Live TV
రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తాత్కాలిక రాజధానిలా రాజమండ్రి, ముస్లీంల పుష్కర స్నానం(పిక్చర్స్)

By Srinivas
|

రాజమండ్రి: రాజమహేంద్రవరంలోని దివాన్‌ చెరువులో ఏర్పాటు చేసిన మహా పుష్కరవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ప్రారంభించారు. మొక్కలు నాటారు. ఏపీ వెలిగిపోతుందని మనస్ఫూర్తిగా చెబుతున్నానన్నారు. 250 ఎకరాల్లో తలపెట్టిన పుష్కరవనం పైలాన్ ఆవిష్కరించారు.

శనివారం సాయంత్రం, పుష్కరాల ముగింపు వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. ముగింపు వేడుకల్లో లేజర్ షో, శాండ్ షో నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి వ్యాఖ్యానం చేశారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గానకచేరీని అందరూ ఆస్వాదించారు.

పుష్కర చివరి రోజు వేడుకలకు రాందేవ్ బాబా హాజరయ్యారు. కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి ఆది పుష్కరాలను అత్యద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వం అందరి ప్రశంసలు అందుకుంది. కాగా, గోదావరిలో పలువురు ముస్లీంలు కూడా పుష్కర స్నానం ఆచరించారు. సుమారు 20 మంది ముస్లీంలు శనివారం కొవ్వూరులో పుష్కర స్నానం చేశారు.

గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

తొలి రోజు జరిగిన తొక్కిసలాట దుర్ఘటన మినహా ఎక్కడా వేలెత్తి చూపలేని విధంగా పవిత్ర గోదావరిమాతకు పన్నెండు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన పుష్కరాలు శనివారంతో ముగిశాయి.

 గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రిలోనే మకాం వేసి ప్రతి క్షణం ప్రత్యక్ష పర్యవేక్షణతో పుష్కరాలు జరిపించారు. ఈ 12 రోజులూ గోదారి తీరం నిత్య వసంతంలా శోభిల్లింది. సుమారు 4.80 కోట్ల మంది ఉభయగోదావరి జిల్లాల్లో పుష్కర స్నానాలు చేశారని అంచనా.

గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

ఉభయ గోదావరి జిల్లాలవాసులు తమ వదాన్యతను చాటుకున్నారు. వీధివీధినా ఉచితంగా భోజన వసతి కల్పించారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులను పెద్ద మనసుతో ఆదరించారు. ఈ పుష్కరాలు ప్రతి ఒక్కరికీ దివ్యానుభూతిని మిగిల్చాయి.

గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

గోదావరి మహా పుష్కర సంబరంతో మరో పన్నెండేళ్లకు సరిపడా సంతృప్తిని నింపింది. ఈ పుష్కర అనుభూతి పది కాలాల పాటు నిలిచిపోవాలన్న లక్ష్యంతో ఈ పుష్కరాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.

గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

రూ.1,500 కోట్లకు పైగా కేటాయించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో స్నానఘట్టాలను సౌకర్యాలతో తీర్చిదిద్దింది. రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం, అంతర్వేదితో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని స్నానఘట్టాలనూ అభివృద్ధి చేసింది.

గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

రాజమండ్రిలోని కోటిలింగాల రేవును ఏకంగా 1,200 మీటర్ల మేర అభివృద్ధి చేసింది. ఈ రేవులో రోజూ కొన్ని లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. రాజమండ్రి నగరం విద్యుత్తు వెలుగుల శోభతో అతి సుందరంగా వెలిగిపోయింది. గోదావరి అఖండ హారతి కనుల పండువగా సాగింది.

గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని సదుపాయాలతో పుష్కర నగర్‌లు నిర్మించింది. తాత్కాలిక బస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. రైల్వే శాఖ రాజమండ్రి, నరసాపురం మీదుగా 483 అదనపు రైళ్లు నడిపింది. ఆర్టీసీ ఉభయ గోదావరి జిల్లాలో రోజుకి సగటున రెండు వేలకు పైగా అదనపు బస్సులు నడిపింది. యాత్రికులకు రోజూ కొన్ని లక్షల మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసింది. ప్రభుత్వం తరఫున లక్షలాది మందికి భోజన పొట్లాలు సరఫరా చేశారు.

గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

ఈ నెల 14న ఉదయం 6.29 గంటలకు కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం చేయడంతో గోదావరి పుష్కరాలు మొదలయ్యాయి. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పుష్కర స్నానం చేశారు.

 గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

తొలి రోజున విషాదం రాజమండ్రిలోని ప్రభుత్వం అధికారికంగా పుష్కరాలు ప్రారంభించిన కాసేపటికే జరిగిన దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుష్కరాల రేవులోకి కొన్నివేల మంది ఒకేసారి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి 27 మంది మృతిచెందారు. సుమారు 35 మంది గాయపడ్డారు.

గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

అంతమంది జనం అక్కడికి వస్తారని ఊహించలేక పోవడం, వచ్చిన జనాన్ని వేరే ఘాట్లకు తరలించడంలో యంత్రాంగం వైఫల్యం దుర్ఘటనకు కారణమైంది. ఈ సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. ముఖ్యమంత్రి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తక్షణం దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. మోహరించిన యంత్రాంగంతొలి రోజు దుర్ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకుని దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. డీజీపీ ఒక సాధారణ పోలీసులా ఘాట్‌ల వద్ద తిరుగుతూ భద్రత పర్యవేక్షించారు. అదనపు డీజీ, ఐజీ ర్యాంకు అధికారులూ ఘాట్ల వద్ద విధులు నిర్వర్తించారు. ప్రతి ప్రధాన ఘాట్‌ వద్ద ఐదారుగురు ఐపీఎస్‌ అధికారులు పనిచేశారు. వివిధ విభాగాధిపతులైన ఐఏఎస్‌ అధికారులు నగరంలోనే ఉండి స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. బస్సులు, రైళ్ల సంఖ్య పెంచారు.

గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

ఈ పన్నెండు రోజలూ రాజమండ్రి రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిలా మారిపోయింది. సీఎం చంద్రబాబు రాజమండ్రిలోనే మకాం వేశారు. ఇక్కడే మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. సింగపూర్‌ బృందం రాజమండ్రికే వచ్చి ముఖ్యమంత్రితో సమావేశమైంది. రాజధాని కేంద్ర ప్రాంత ప్రణాళికనూ అందజేసింది. టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ ఇక్కడే ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

శని, ఆదివారాలు సెలవుకావడంతో జనం సునామీని తలపించారు. ఇస్కాన్‌, రామకృష్ణ మిషన్‌, తితిదే, సత్యసాయి సేవా సంస్థ, కల్కి మానవ సేవా సంస్థ, జైన సంఘం, షిర్డీ సాయి సేవా సంస్థ, ఆర్యవైశ్య సంఘం వంటి పలు పెద్ద, చిన్న సంస్థలు కొన్ని లక్షల మందికి భోజన వసతి కల్పించాయి. స్నాన ఘట్టాల్లో భక్తులకు సేవలందిస్తూ పారిశుద్ధ్య నిర్వహణలో పాలుపంచుకుంటూ విశేష సేవలందించాయి.

 గోదావరి పుష్కరాలు 2015

గోదావరి పుష్కరాలు 2015

పుష్కరాలకు ఒక రోజు ముందే రాజమండ్రి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాలను ప్రారంభించాక హైదరాబాద్‌ వెళ్లాలని, కొన్ని రోజుల తర్వాత రావాలని భావించారు. కానీ తొలి రోజు దుర్ఘటనతో ఆవేదనకు లోనైన ఆయన పుష్కరాలు ముగిసేంతవరకు రాజమండ్రిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. కంట్రోల్‌ రూంలో గంటల తరబడి కూర్చుని స్వయంగా ఘాట్‌ల వద్ద పరిస్థితిని, నగరంలో ట్రాఫిక్‌ని పర్యవేక్షించారు.

English summary
Tens of thousands thronged the banks of the Godavari in Andhra Pradesh to take a holy dip on Saturday, the last day of Godavari maha pushkaralu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more