వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రచందనం స్మగ్లర్లతో సీఎం చంద్రబాబుకు ముప్పు.. హెచ్చరించిన నిఘా విభాగం!

ఎర్రచందనం స్మగ్లర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని, జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ ఢిల్లీ పర్యటనల్లో ఇకపై మెట్రో రైలులో ప్రయాణం మంచిది కాదని నిఘా విభాగం హెచ్చరించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై రాష్ట్ర నిఘా విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎర్రచందనం స్మగ్లర్లతో చంద్రబాబుకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.

ఈ మేరకు ఏపీ రెసిడెంట్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటనల్లో ఇకపై మెట్రో రైలులో ప్రయాణం మంచిది కాదని, జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ 'మెట్రో' ప్రయాణం ప్రమాదకరమని నిఘా విభాగం హెచ్చరించింది.

cm-chandrababu

'మెట్రో'లో సీఎంకు భద్రత కల్పించడం ఇబ్బందికరమని, ఢిల్లీ పర్యటనలో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో, సాయుధ కమాండో రక్షణలో రోడ్డుమార్గం ద్వారానే చంద్రబాబును తీసుకువెళ్లాలని, ఉగ్రవాదులు, మత ఛాందసవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిఘా విభాగం హెచ్చరించింది.

English summary
Andhra Pradesh Intelligence Department gave a warning to AP Resident Commissioner in Delhi about a threat to CM Chandrababu Naidu from Red Sandal Wood Smugglers. The Officials of the Intelligence Department suggested not to travel in Delhi Metro Rail even chandrababu in under z plus category security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X