వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంజాన్ కు ప్రకటించారు..బక్రీద్ కు పదవి ఇచ్చారు: వైసీపీ ఎమ్మెల్సీలుగా నామినేషన్లు: ఏకగ్రీవమే..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల నామినేషన్లకు చివరి రోజు కావటంతో..ముగ్గురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసారు. ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ సీట్ల భర్తీ కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. వైసీపీ అధినేత..ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ నుండి ముగ్గురు అభ్యర్ధులను ప్రకటించారు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మూడు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. దీంతో.. ఈ ఎన్నికల్లో పోటీ లేకుండా పోయింది. వైసీపీ ప్రకటించిన ముగ్గురు అభ్యర్ధులు మంత్రి మోపిదేవి వెంకట రమణ..ఇక్బాల్.. చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్లు దాఖలు చేసారు. వారికి మద్దతుగా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసారు. నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉండటంతో..ఆ రోజును వీరిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు.

రంజాన్ కు ప్రకటన..బక్రీద్ కు పదవి

రంజాన్ కు ప్రకటన..బక్రీద్ కు పదవి

వైసీపీలో చేరిన మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో కీలకమైన అసెంబ్లీ స్థానం కేటాయించారు. అనంతపురం జిల్లాలో సినీ నటుడు బాలక్రిష్ట పోటీలో ఉన్న హిందూపూర్ నుండి ఇక్బాల్ ను బరిలోకి దింపారు. హిందూపూర్ టీడీపీకి కంచుకోట. అయితే, ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఇక్బాల్ ఓడిపోయారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రంజాన్ సందర్భంగా గుంటూరులో ఇఫ్తార్ విందు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొన్న ముఖ్యమంత్రి తాను ఎన్నికల్లో అయిదుగురు ముస్లిం అభ్యర్ధులకు సీట్లు ఇచ్చానని..అందులో నలుగురు గెలవగా..ఇక్బాల్ ఓడిపోయారని..ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్ట సభకు పంపుతానని హామీ ఇచ్చారు. దీనికి తగినట్లుగానే జగన్ తాజాగా ఇక్బాల్ ను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఖరారు చేసారు. రంజాన్ సమయంలో ఇచ్చిన హామీని బక్రీద్ నాడు జగన్ పదవి రూపంలో అందించారు. ఇక్బాల్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయగా..అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా సంతకాలు చేసారు. జగన్ మైనార్టీ పక్షపాతి అంటూ ఇక్బాల్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్యేగా ఓడినా..మంత్రి పదవి ఇచ్చి..

ఎమ్మెల్యేగా ఓడినా..మంత్రి పదవి ఇచ్చి..

మోపిదేవి వెంకట రమణ తాజా ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె నుండి ఓడి పోయారు. అయినా..జగన్ ఆయనకు పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. వైయస్ హాయంలో పెట్టుబడులు..మౌళిక వసతుల శాఖా మంత్రి గా పని చేసిన మోపిదేవి వాన్ పిక్ వ్యవహారంలో సీబీఐ విచారణ ఎదుర్కొన్నారు. జగన్ తో పాటుగా జైలు జీవితం గడిపారు. మోపిదేవి తనకు అండగా నిలవటమే కాకుండా..ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు పెట్టుకొని జగన్ ఆయన ఎన్నికల్లో ఓడినా మంత్రి పదవి ఇచ్చారు. మంత్రిగా ఎన్నికైన వారు ఆరు నెలల్లోగా చట్ట సభలకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. దీంతో..మోపిదేవిని ఎమ్మెల్సీ అభ్యర్దిగా ఖరారు చేసారు. గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు మోపిదేవికి మద్దతుగా నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేసారు. నమ్ముకున్నవారికీ, కష్టపడేవారికీ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారని మోపిదేవి వెంకట రమణ చెప్పుకొచ్చారు.
తండ్రికి మించిన తనయుడు జగన్‌అని కొనియాడారు.

ఇచ్చిన మాట కోసం చల్లా రామకృష్ణారెడ్డికి...

ఇచ్చిన మాట కోసం చల్లా రామకృష్ణారెడ్డికి...

కర్నూలు జిల్లాలో సీనియర్ అయిన చల్లా రామకృష్ణారెడ్డి కి జగన్ ఎమ్మెల్సీ అభ్యర్దిగా ఖరారు చేయటంతో ఆయన ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. కర్నూలు ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేసారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి గతంలో టీడీపీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి..ఇవ్వలేదు. ఆయన పార్టీ మారుతారనే ప్రచారం తో ఆయనకు పౌర సరఫరాల కార్పోరేషన్ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. దీంతో..ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ సమయంలో జగన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు కేటాయించలేనని.. అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. దీని మేరకు ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖరారైంది. గన్ ఎన్నికల కోసం పదవులు ఇచ్చే వ్యక్తి కాదన్నారు. ఓడి పోయిన వాళ్లకు కూడా పదవులు ఇచ్చే నైజం ఒక్క జగన్‌కే సొంతమని కొనియాడారు. సీఎం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలను మూడు వర్గాలకు కేటాయించడం గర్వంగా ఉందన్నారు. 2004లో వైఎస్‌తో కలిసి పదేళ్లు పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. జగన్ సీఎం అయ్యాక ఒకటి ఓసీకి వస్తే అది తనకు కేటాయించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

English summary
Three Candiates From YCP filed nominations for MLC Elections in MLA Quota.These three candidates elect unanimously for legislative council.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X