వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు గవర్నర్ వద్దకు మూడు రాజధానుల బిల్లులు..ఆపై రాష్ట్రపతి వద్దకు..సర్వత్రా టెన్షన్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపనుంది. దీంతో మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదిస్తారా? లేదా ఆమోదించకుండా పెండింగ్ పెడతారా? అన్నది ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మూడు రాజధానులు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లు గా గెజిట్ నోటిఫికేషన్ వస్తే రాష్ట్రంలో అమల్లోకి వచ్చినట్టే భావించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. గవర్నర్ ఆమోదం పొంది రెండు రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది.

గవర్నర్ వద్దకు మూడు రాజధానుల బిల్లులు ... రాష్ట్రపతి ఆమోదం కూడా

గవర్నర్ వద్దకు మూడు రాజధానుల బిల్లులు ... రాష్ట్రపతి ఆమోదం కూడా

అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను నేడు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం గవర్నర్ కు పంపిన నేపథ్యంలో గవర్నర్ వాటిని పరిశీలించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నట్లు గా సమాచారం. సాధారణంగా రాష్ట్ర పరిధిలో ఉన్న ఏ బిల్లు అయినా గవర్నర్ ఆమోదం పొందితే సరిపోతుంది కానీ, కేంద్ర చట్టాలతో ముడిపడి ఉన్న బిల్లులు కాబట్టి వీటిని రాష్ట్రపతికి పంపనున్నట్లు గా తెలుస్తుంది.

కోర్టులో వ్యాజ్యాలు ఉన్నా సరే బిల్లులు ఆమోదం పొందే అవకాశం ?

కోర్టులో వ్యాజ్యాలు ఉన్నా సరే బిల్లులు ఆమోదం పొందే అవకాశం ?

ఇప్పటికే మూడు రాజధానులు బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై కోర్టులో చాలా పిటీషన్లు దాఖలయ్యాయి. అవన్నీ ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం కాకముందే బిల్లులను ఆమోదించి, అమలుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏపీ లో కనిపిస్తుంది. రాష్ట్రంలో పెద్ద చర్చకు కారణమైన ఈ బిల్లుల విషయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏం నిర్ణయం తీసుకుంటారో అనేది ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మొదటి నుండి మూడు రాజధానుల బిల్లుల వివాదం

మొదటి నుండి మూడు రాజధానుల బిల్లుల వివాదం

ఇప్పటికే సీఆర్డీఏ రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులకు సంబంధించి శాసనమండలిలో వివాదం నడుస్తోంది. వీటిని సెలెక్ట్‌ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్‌ ఆదేశాలివ్వగా అసెంబ్లీ కార్యదర్శి అమలుచేయలేదు. ఆ తరువాత అనూహ్యంగా శాసన మండలి రద్దు చేసి ఆ బిల్లును కేంద్రానికి పంపారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటివరకు శాసన మండలి రద్దు బిల్లుకు సంబంధించి కేంద్రం నుండి ఇలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు.

అసెంబ్లీ నియమావళి ప్రకారం నిర్ణయం తీసుకున్న స్పీకర్

అసెంబ్లీ నియమావళి ప్రకారం నిర్ణయం తీసుకున్న స్పీకర్

ఇటీవల జూన్ 16న శాసనసభ సమావేశాలలో ఈ రెండు బిల్లులను ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదించింది. మళ్లీ శాసనమండలికి బిల్లులు పంపడంతో శాసనమండలిలో చర్చించకుండానే సభ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ నియమావళి, మార్గదర్శకాల ప్రకారం మండలి ఏ బిల్లునైనా తిరస్కరించినా, చర్చించకుండా వదిలేసినా నెల రోజుల తర్వాత ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఆ ప్రకారమే ఈ రెండు బిల్లులు మండలి ఆమోదం పొందినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం పరిగణించి గవర్నర్‌ ఆమోదానికి పంపనున్నట్లు తెలుస్తోంది .

Recommended Video

Tirumala Darshans Should Stop : Ramana Deekshitulu - ఆపాల్సిన అవసరం ఏముంది ? YV Subba Reddy
 మూడు రాజధానుల బిల్లులకు ఆమోదం ?... త్వరలో గెజిట్ నోటిఫికేషన్ ..!!

మూడు రాజధానుల బిల్లులకు ఆమోదం ?... త్వరలో గెజిట్ నోటిఫికేషన్ ..!!

అయితే మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కోర్టులో పలు పిటిషన్లు ఉన్నప్పటికీ బిల్లుల ఆమోదానికి ప్రతిబంధకాలు ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి వాటిని ఆమోదించాక.. రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రభుత్వ అంచనా ప్రకారం మూడు రాజధానుల బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరు అని సమాచారం.

English summary
The AP government will send three capital bills to Governor Bishwabhushan Harichandan today. The government says the three capital bills would have to be deemed to have come into force in the state if the gazette notification came as the governor had approved them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X