అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజ్యసభలో మూడు రాజధానుల అంశం .. కేంద్రం జోక్యం చేసుకుని అడ్డుకోవాలన్న టీడీపీ ఎంపీ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో గళమెత్తారు. ఈరోజు ఉదయం ప్రశ్నోత్తరాల సందర్భంగా కనకమేడల రాజధాని అంశాన్ని సభలో ప్రస్తావించారు .ఈ విధానాన్ని అంగీకరిస్తే అనూహ్యమైన సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుందని ఎంపీ కనకమేడల రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.

న్యాయ వ్యవస్థపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు .. కౌంటర్ ఇచ్చిన టీడీపీ ఎంపీలు కనకమేడల,రామ్మోహన్ నాయుడున్యాయ వ్యవస్థపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు .. కౌంటర్ ఇచ్చిన టీడీపీ ఎంపీలు కనకమేడల,రామ్మోహన్ నాయుడు

విభజన చట్టం ప్రకారమే ఏపీలో రాజధాని ఏర్పాటు చేశామన్న కనకమేడల

విభజన చట్టం ప్రకారమే ఏపీలో రాజధాని ఏర్పాటు చేశామన్న కనకమేడల

మూడు రాజధానులు వ్యవహారంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2014లో ఆమోదించిన విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని కొనసాగించేలా అవకాశం ఉందని ,ఈ లోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నగరాన్ని ఏర్పాటు చేసుకోవాలని చట్టం పేర్కొందని ఆయన గుర్తు చేశారు. దాని ప్రకారమే ఏపీకి రాజధాని నగరం నగరాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ల్యాండ్ పూలింగ్ చేశారని, కేంద్రం కూడా రాజధాని నిర్మాణానికి 2500 కోట్ల రూపాయల నిధులను ఇచ్చిందని ఆయన రాజ్యసభలో పేర్కొన్నారు.

కేంద్ర నిధులున్నాయి.. మోడీ అమారావతి భూమిపూజలో పాల్గొన్నారని గుర్తు చేసిన ఎంపీ

కేంద్ర నిధులున్నాయి.. మోడీ అమారావతి భూమిపూజలో పాల్గొన్నారని గుర్తు చేసిన ఎంపీ

విభజన చట్టం ప్రకారమే తగిన ప్రదేశాన్ని చూసి ల్యాండ్ పూలింగ్ చేశామని పేర్కొన్న ఎంపీ రవీంద్ర కుమార్ ప్రధాని మోడీ స్వయంగా నాడు అమరావతి భూమి పూజలో పాల్గొన్నారని గుర్తు చేశారు.అంతేకాదు స్మార్ట్ సిటీ మిషన్ కింద కేంద్రం అమరావతి నగరాన్ని ఎంపిక చేసిందని కూడా రవీంద్ర కుమార్ సభలో వ్యాఖ్యానించారు. కానీ ఎలాంటి సహేతుకమైన కారణాలు చూపించకుండానే ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాజెక్టు ను నిర్వీర్యం చేసిందని ఎంపీ కనకమేడల విమర్శించారు.

పెద్ద రాష్ట్రాలలోనే ఒకే రాజధాని ,ఏపీకి మూడు రాజధానులు అవసరమా ?

పెద్ద రాష్ట్రాలలోనే ఒకే రాజధాని ,ఏపీకి మూడు రాజధానులు అవసరమా ?

ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల లో ఒక రాజధాని మాత్రమే ఉంటే కేవలం 13 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే నిర్ణయం మంచిది కాదని కనకమేడల సభాముఖంగా పేర్కొన్నారు. ఈ విధానాన్ని అంగీకరిస్తే ఏపీలో అనూహ్యమైన సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుందని చెప్పిన ఆయన, మూడు రాజధానులు వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Recommended Video

TDP Leader Arvind Kumar Gowda Slams Telangana MP's Response Over Rains
జోక్యం చేసుకోండి.. అడ్డుకోండి .. లేదంటే అనూహ్య సమస్యలు

జోక్యం చేసుకోండి.. అడ్డుకోండి .. లేదంటే అనూహ్య సమస్యలు

ప్రజాధనాన్ని వృధా చేస్తూ అమరావతి రైతులకు నష్టం కలిగించేలా తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయం పై కేంద్ర జోక్యం చేసుకోకుంటే ఊహించని సమస్యలు వస్తాయి అంటూ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. అయితే ఇప్పటికే కేంద్రం రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోనిదని, తాము జోక్యం చేసుకోలేమని కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ ద్వారా స్పష్టం చేసింది. అయినప్పటికీ టీడీపీ మాత్రం మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ కేంద్రం జోక్యం కోరుతూ విజ్ఞప్తులు చేస్తుంది .

English summary
TDP MP Kanakamedala Ravindra Kumar will address the Rajya Sabha on the issue of setting up three capitals in the state of Andhra Pradesh. During the question and answer session this morning, the issue of capital was raised in the House by Kanakamedala. MP Kanakamedala Ravindra expressed concern that accepting this policy would lead to unforeseen problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X