వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ హైకోర్టులో ముగ్గురు ప్రభుత్వ లాయర్ల మూకుమ్మడి రాజీనామా.. వ్యతిరేక తీర్పులే కారణమా?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అటు హైకోర్టు లోనూ,సుప్రీంకోర్టులోనూ వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.ఈ క్రమంలో అసలు జరుగుతున్న తప్పిదాలపై దృష్టి పెట్టని ఏపీ సర్కార్, న్యాయవాదులపై మాత్రం గట్టిగా దృష్టి పెడుతోంది అన్నది తాజా పరిణామాలతో స్పష్టంగా కనిపిస్తోంది. కోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్ననేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పని చేస్తున్న లాయర్ల పని తీరు సరిగా లేదని భావించిన ఏపీ సర్కార్ వారిని ఇంటికి పంపించే పనిలో బిజీగా ఉంది.అందులో భాగంగా ఒక్కసారే ముగ్గురు లాయర్లు రాజీనామా చెయ్యటం న్యాయవాదుల్లో చర్చనీయాంశంగా మారింది.

అమరావతి లాడ్జీ ఘటన .. కీచక ఎస్సై సస్పెండ్ .. ఎవరైనా సహించం : ఎస్పీ విజయారావుఅమరావతి లాడ్జీ ఘటన .. కీచక ఎస్సై సస్పెండ్ .. ఎవరైనా సహించం : ఎస్పీ విజయారావు

హైకోర్టులో ముగ్గురు ప్రభుత్వ లాయర్ల రాజీనామా .. ఆమోదించిన ప్రభుత్వం

హైకోర్టులో ముగ్గురు ప్రభుత్వ లాయర్ల రాజీనామా .. ఆమోదించిన ప్రభుత్వం

ఇప్పటికే ఢిల్లీ సుప్రీంకోర్టులో నియమించుకున్న న్యాయవాదిని ఇంటికి పంపించిన ప్రభుత్వం, తాజాగా హైకోర్టులో మరో ముగ్గురు న్యాయవాదులతో రాజీనామా చేసేలా చేసింది. ఏపీ హైకోర్టులో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు.పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్ బాబు,షేక్ హబీబ్ లు ప్రభుత్వ న్యాయవాదులుగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక వీరు రాజీనామా చేయడం, వీరి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించటం కూడా వెంటనే జరిగిపోయాయి అంటే ఏం జరిగిందో అన్న చర్చ ప్రస్తుతం జరుగుతుంది.

ప్రభుత్వ వాదన బలంగా వినిపించలేకపోతున్నారన్న కారణం .. లాయర్లపై ప్రభుత్వ అసంతృప్తి

ప్రభుత్వ వాదన బలంగా వినిపించలేకపోతున్నారన్న కారణం .. లాయర్లపై ప్రభుత్వ అసంతృప్తి


ఇప్పటికే వైసిపి అధికారంలోకి వచ్చిన నాటినుండి వరుసగా ప్రభుత్వ నిర్ణయాలపై కేసులు నమోదవుతున్నాయి. ఇక ఈ కేసులలో ఇప్పటికే పలుమార్లు హైకోర్టు అక్షింతలు వేయగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు కూడా ఇచ్చింది. ఇక నిన్నటికి నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కూడా సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి గట్టిగానే గడ్డి పెట్టింది. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున వాదనలు బలంగా వినిపించలేకపోతున్నారన్న కారణంగా ప్రభుత్వ లాయర్లతో రాజీనామా చేయించినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కోర్టుల్లో ఏపీ సర్కార్ కు అడుగడుగునా దెబ్బలే .. అధికారులకు తప్పని తిప్పలు

కోర్టుల్లో ఏపీ సర్కార్ కు అడుగడుగునా దెబ్బలే .. అధికారులకు తప్పని తిప్పలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా 60కి పైగా తీర్పులు వచ్చిన పరిస్థితి ఉంది. విద్యుత్ పీపీఏల దగ్గర్నుంచి,ఇంగ్లీష్ మీడియం జీవో, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు,కర్నూలుకు హైకోర్టు తరలింపు, ఎస్ఈసీ నియామకం వరకూ అనేక అంశాల్లో కోర్టు జగన్ సర్కార్ కు అక్షింతలు వేసింది. ఇక ఉన్నతాధికారులు కోర్టు ముందు హాజరై, సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు సార్లు పోలీస్ బాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏపీ సీఎస్ నీలం సాహ్ని హైకోర్టు ఎదుట హాజరు కావాల్సి వచ్చింది.

ప్రభుత్వ లాయర్ల విషయంలో సీరియస్ గా ఉన్న జగన్ సర్కార్

ప్రభుత్వ లాయర్ల విషయంలో సీరియస్ గా ఉన్న జగన్ సర్కార్

ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై ఏపీ ప్రభుత్వ ఆర్డినెన్స్ రద్దు చేసిన సమయంలో అసాధారణ రీతిలో హైకోర్టు తీర్పు విషయంలో కూడా అడ్వకేట్ జనరల్ ప్రెస్‌మీట్ పెట్టి మరి తమ వాదన వినిపించారు. అయితే ఏది ఎలా ఉన్నా ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ లాయర్ల విషయంలో తీవ్ర అసహనంతో ఉందని తాజా పరిణామాలతో తెలుస్తుంది . ఇక ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కోరుకుంటుంది మాత్రం కోర్టు వ్యవహారాల్లో ఏపీ ప్రభుత్వ వాదనను బలంగా వినిపించే గళాలు.

Recommended Video

#JaganannaChedhodu : Celebrities Big Thanks To AP CM Jagan For Jagananna Chedhodu Scheme
వ్యతిరేక తీర్పులకు వారే కారణమా ? అందుకే రాజీనామాలా..

వ్యతిరేక తీర్పులకు వారే కారణమా ? అందుకే రాజీనామాలా..

ఇప్పటికే లాయర్ల పనితీరుతో తీవ్ర అసంతృప్తి తో ఉన్న ఏపీ ప్రభుత్వం హైకోర్టులో వస్తున్న ప్రభుత్వ వ్యతిరేక తీర్పులకు నైతిక బాధ్యత వహిస్తూ ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులు రాజీనామా చేయగానే ప్రభుత్వం ఆమోదించింది. అయితే ప్రభుత్వ న్యాయవాదుల రాజీనామా ప్రభుత్వ ఒత్తిడి వల్లే అని న్యాయవాద వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది. ఇక రాజీనామా చేసిన న్యాయవాదుల స్థానంలో కొత్త వారిని నియమించడానికి త్వరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. నోటిఫికేషన్ ద్వారా కొత్తవారిని ఏపీ ప్రభుత్వ వాదన బలంగా వినిపించి తాము అనుకున్నది జరిగేలా చూసే వారిని భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

English summary
AP government has sending home the Andhra Pradesh government's lawyers, following a series of setbacks in the court.three lawyers working for government in ap high court resigend and the government accepted the resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X