విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫాదర్‌తో నగ్నంగా మహిళ: ముగ్గురు బ్లాక్‌మెయిలర్ల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

విజయవాడ: అక్రమ సంబంధాలపై దృష్టిసారించి ఓ చర్చి ఫాదర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మరీడు శశిధర్(28), కొర్రపాటి జోసెఫ్(58), మందాడి రామోజీ చౌదరి(29)లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 15రోజులపాటు రిమాండ్‌కు తరలించారు.

కాగా, ప్రధాన నిందితుడు సుధీర్ కోసం గాలింపు చేస్తున్నట్లు తెలిపారు. అతని నేతృత్వంలోనే ముఠాగా ఏర్పడిన ఈ ముగ్గురు బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతూ లక్షల్లో సంపాదించారు. ఆ తర్వాత కోట్లను సంపాదించేందుకు భారీ ఎత్తున బ్లాక్ మెయిలింగ్ చేస్తూ పట్టుబడిపోయారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు సుధీర్.. స్నేహితుడు జోసెఫ్‌ సహాయంతో 64ఏళ్ల బాధిత ఫాదర్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2015, జూన్‌లో సుధీర్‌కు చెందిన కో ఆపరేటివ్ సోసైటీ సంజీవినిలో బలవంతంగా రూ. 50వేలను పెట్టుబడిగా పెట్టించాడు జోసెఫ్.

ఫాదర్ సూచనలతో చర్చిలోని భక్తులు కూడా సుధీర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అయితే, కొంత కాలం తర్వాత తన డబ్బును ఇవ్వాలని ఫాదర్ వారిని కోరాడు. అయితే, ఫాదర్ విజ్ఞప్తిని వారు దాటవేస్తూ వస్తున్నారు.

కాగా, దొనబండలో కొత్త వెంచర్ పెడుతున్నామని అక్కడ ప్రార్థనలు చేయాలని గత సెప్టెంబర్ నెలలో ఫాదర్‌ను ఆహ్వానించారు. దీంతో వారితోపాటు వెళ్లి అక్కడ ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఫాదర్‌ను ఆహారం తీసుకోవాలని కోరడంతో ఆయన అక్కడే భోజనం చేశారు. అయితే, ఆ భోజనంలో మత్తు పదార్థాలు కలిపి ఇవ్వడంతో ఫాదర్ అక్కడే స్పృహ కోల్పోయాడు.

 Three held for blackmailing priest

ఆ తర్వాత ఫాదర్‌ను ఆయన ఇంటి వద్ద దిగబెట్టారు జోసెఫ్, సుధీర్‌లు. కాగా, 10 రోజుల తర్వాత ఫాదర్ వద్దకు వచ్చిన సుధీర్.. ఫాదర్, నగ్నంగా ఉన్న ఓ మహిళతో ఉన్న ఫొటోలను, వీడియోలను చూపించాడు. అప్పటి నుంచి ఫాదర్ ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

కాగా, ఇదే వీడియోను చూపించి మరో ముఠా సభ్యులు శ్రీకాంత్(ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తి), జోసెఫ్, విజయ్, ప్రకాశ్, ప్రశాంత్, సుబ్రమణ్యం, శశిధర్, రాములు గత సెప్టెంబర్ నుంచి ఈ యేడాది మార్చి వరకు డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశారు.

అంతేగాక, మార్చి 10న ఫాదర్ ఇంట్లోకి ప్రవేశించిన ఈ ముఠా సభ్యులు రూ. కోటి ఇవ్వాలని ఆయనను బెదిరింపులకు గురి చేశారు. లేదంటే చంపేస్తామని, ఆ వీడియోలను బయటపెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మిస్తామని ఫాదర్‌ను భయపెట్టారు. దీంతో ముఠా సభ్యులకు డబ్బులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాడు ఫాదర్.

ఆ తర్వాత ముఠా సభ్యులపై ఉన్నత చర్చి ఫాదర్లతో చర్చించి పోలీసులను ఆశ్రయించారు బాధిత ఫాదర్. మార్చి 11న మాచవరం పోలీస్ ష్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గురువారం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 15రోజులపాటు రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితులు గతంలో పలువురు ఫాదర్లను ఇలాగే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజినట్లు సమాచారం.

English summary
City police who maintained utmost secrecy in the case of Catholic Church priest being blackmailed, arrested three accused and produced them before court on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X