హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగ్గురు మ‌హిళా మావోయిస్టుల అరెస్ట్‌: వారిలో ఆర్కే అంగ‌ర‌క్ష‌కురాలు : విశాఖ‌ పోలీసుల వ్యూహం ...!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ లో ముగ్గురు మావోయిస్టుల‌ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేసారు. ముగ్గురు అక్కా చెల్లెళ్లు. వీరు మౌలాలి లో త‌ల దాచుకున్నార‌నే స‌మాచారం తో ప‌క్కా వ్యూహంతో వెళ్లిన విశాఖ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వీరిని అక్ర‌మంగా అరెస్ట్ చేసార‌ని తెలంగాణ ప్ర‌జా ఫ్రంట్ ఆరోపిస్తోంది...

హైద‌రాబాద్ న‌గ‌రంలో నగరంలో ముగ్గురు మహిళా మావోయిస్టులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. అనూష, అన్న పూర్ణ, భవానీలను హైదరాబాద్‌లోని మౌలాలీలో అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వీరు త‌ల దాచుకున్నార‌నే పక్కా సమాచారంతో ఏపీ ఇంటలిజెన్స్‌ పోలీసులు, హైద‌రాబాద్ నగర పోలీసుల సహకారంతో మౌలాలీలో దాడి నిర్వహించారు. ఒక ఇంట్లో ఉన్న ముగ్గురు అక్కాచెల్లెళ్లను అరెస్ట్ చేశారు.

Three Mao sisters arrest by Visakha Police in Hyderabad..

వీరిలో అనూష ...మావో యిస్టు పార్టీలో కీలక నేత ఆర్కేకు అంగరక్షకురాలిగా పనిచేస్తోందని పోలీసులు నిర్ధారించారు. అలాగే అనూష పలు హింసాత్మక సంఘటనలకు పాల్పడినట్లు గుర్తించారు. సిక్కవరప్పాడు, జుడోకో గ్రామంలో పోలీసులపై కాల్పులు, 2018 నవంబర్‌లో ఆర్కే ఆదేశాల మేరకు పోలీసులపై మందుపాతర పేల్చిన ఘటనలో అనూష పాల్గొన్నట్లు పోలీసులు వారి వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Three Mao sisters arrest by Visakha Police in Hyderabad..

ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ల తండ్రి రమణయ్య కుల నిర్మూలణ పోరాట సమితితో పనిచేసినట్లు పోలీసులు చెడుతున్నా రు. 2017లో మావోయిస్టు అగ్రనేత ఆర్కేను అనూష, అన్నపూర్ణలు కలిశారని, అనంతరం అనూష పేరు మార్చుకుని యాంగ్జి అనే పేరుతో మావోయిస్టు కార్యకలాపాల్లో సిద్ధహస్తురాలైందని పోలీసులు గుర్తించారు. అయితే, తెలంగాణ ప్ర‌జా ఫ్రంట్ మాత్రం వీరిని అక్ర‌మంగా అరెస్ట్ చేసార‌ని ఆరోపిస్తోంది. వారు అనూష, అన్న‌పూర్ణ లు చైత‌న్య మ‌హిళా సంఘ ప్ర‌తినిధులుగా...భవానీ ని అమ‌రుల బంధు మిత్రుల సంఘ ప్ర‌తినిధిగా పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న స‌మ‌యం లో ఆ ముగ్గురిని అరెస్ట్ చేసార‌ని..వారిని విడుద‌ల చేయాల‌ని తెలంగాణ ప్ర‌జా ఫ్రంట్ డిమాండ్ చేసింది.

English summary
Visakha Police arrest Three women maoist activists in Hyderabad. Three maoists are sisters. one of them working as body guard ofr R.K.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X