వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ స‌భ్యులపై స‌స్పెన్ష‌న్ వేటు : జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో తొలిసారిగా: స‌మావేశాలు ముగిసే వ‌ర‌కూ ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

టీడీపీ స‌భ్యులపై స‌స్పెన్ష‌న్ వేటు వేసిన స్పీకర్|Three Members Of The TDP Suspended From AP Assembly

ఏపీ శాస‌న‌స‌భ‌లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తొలి సారిగా టీడీపీ స‌భ్యుల పైన శాస‌న‌స‌భ‌లో స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. శాస‌న‌స‌భ‌ల ప్ర‌శ్నోత్త‌రాల స‌మయంలో టీడీపీ స‌భ్యుడు రామానాయుడు జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో 45 ఏళ్ల‌కే పెన్ష‌న్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించార‌ని..ఎప్ప‌టి నుండి అమ‌లు చేస్తార‌ని ప్ర‌శ్నించారు. దీనికి జ‌గ‌న్ ఏం హామీ ఇచ్చార‌నే విష‌యం పైన స‌భ‌లోనే స్క్రీన్ ద్వారా ప్ర‌జెంటేష‌న్ ఇచ్చినా టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న వీడ‌లేదు. దీంతో..అసెంబ్లీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాద్ ముగ్గురు టీడీపీ స‌భ్యుల మీద స‌స్పెన్ష‌న్ తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. స్పీక‌ర్ ఆ ముగ్గురు స‌భ్యుల మీద స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది...

ముగ్గురు టీడీపీ స‌భ్యుల పై వేటు...

ముగ్గురు టీడీపీ స‌భ్యుల పై వేటు...

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత తొలి సారి ఏపీ శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మీద స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింది. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో టీడీపీ స‌భ్యుడు నిమ్మ‌ల రామానాయుడు పాద‌యాత్ర స‌మ‌యంలో 45 సంవత్సరాలు నిండిన మ‌హిళ‌ల‌కు పెన్ష‌న్ ఇస్తామ‌ని చెప్పార‌ని దీని పైన ప్ర‌భుత్వ వైఖ‌రిని ప్ర‌శ్నించారు. అయితే, ప్ర‌భుత్వం జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్ ఏం చెప్పార‌నే అంశాన్ని స‌భ‌లో వీడియో ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ వీడియోలో జ‌గ‌న్ 45 ఏళ్లు నిండిన బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనార్టీ మ‌హిళ‌ల‌కు వైయ‌స్సార్ చేయూత కింద ప్ర‌తీ ఏడాది ఆర్దిక సాయం అందిస్తామ‌నే విష‌యాన్ని మ‌రో సారి స్ప‌ష్టం చేసారు. అయితే, దీని పైన చ‌ర్చ కోసం టీడీపీ స‌భ్యులు ఆందోళ‌కు దిగారు. ముఖ్య‌మంత్రి..ఆర్దిక మంత్రి సూచించినా వారు విన‌క‌పోవ‌టంతో..అసెంబ్లీ వ్య‌వ‌హారాల శాఖా మంత్రి ముగ్గురు టీడీపీ స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌కు తీర్మానం ప్ర‌తిపాదించారు. దీంతో..అచ్చెన్నాయుడు.. బుచ్చ‌య్య చౌద‌రి.. రామా నాయుడు పైన స‌స్పెన్ష‌న్ వేటు వేసారు.

స‌మావేశాలు ముగిసే వ‌ర‌కూ..

ఈ ముగ్గురు స‌భ్యుల మీద ప్ర‌స్తుత స‌మావేశాలు ముగిసే వ‌ర‌కూ స‌స్పెన్ష‌న్ వేటు వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ స్థానంలో ఉన్న కోన ర‌ఘుప‌తి ప్ర‌క‌టించారు. ఆ ముగ్గురూ స‌భ‌ను వీడాల‌ని సూచించారు. సోమ‌వారం ప్ర‌భుత్వం స‌భ‌లో కీల‌క బిల్లులు ప్ర‌వేశ పెట్టే స‌మ‌యంలో టీడీపీ స‌భ్యులు స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు వెళ్లి నిర‌స‌న‌కు దిగారు. ఈ రోజు స్పీక‌ర్ ఛైర్ వ‌ద్ద‌కు వెళ్లి త‌మ‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ స్పీక‌ర్ మైకు లాగే ప్ర‌య‌త్నం చేసార‌ని చీఫ్ విప్ శ్రీకాంత రెడ్డి పేర్కొన్నారు. ప్ర‌శోత్త‌రాల స‌మ‌యంలో సభ‌కు అడ్డుపడుతున్నందుకె వారి పైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని శ్రీకాంత్ రెడ్డి స్ప‌ష్టం చేసారు. స్పీక‌ర్ సూచ‌న‌లు ప‌ట్టించుకోకుండా టీడీపీ స‌భ్యులు వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ మండి ప‌డ్డారు. దీంతో టీడీపీ స‌భ్యులు స్పీక‌ర్ పోడియాన్ని చుట్టు ముట్టి నినాదాలు కొన‌సాగించారు.

జ‌గ‌న్ అనే నేను..మ‌రోసారి స‌భ సాక్షిగా:

జ‌గ‌న్ అనే నేను..మ‌రోసారి స‌భ సాక్షిగా:

స‌భ‌లో తాను ఇచ్చిన హామీ మీద టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న చేస్తున్న స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ జోక్యం చేసుకు న్నారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ అనే నేను..అంటూ మొద‌లు పెట్టిన ముఖ్య‌మంత్రి మాట త‌ప్ప‌టం..చెప్పిన అంశం నుండి వెన‌క్కు వెళ్ల‌టం త‌న‌కు చేత‌కాద‌ని స్ప‌ష్టం చేసారు. ఆ స‌మ‌యంలో సైతం టీడీపీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగా రు. తాను విశాఖ జిల్లాలో వైయ‌స్సార్ ఆస‌రా గురించి ఏం చెప్పార‌నే విష‌యం పైన వీడియో చూసి స‌భ‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని సీఎం డిమాండ్ చేసారు. తాను చెప్పిన అంశాన్ని రెండు సార్లు వీడియోను ప్ర‌ద‌ర్శించారు. ముఖ్య‌మంత్రి చెప్పినా టీడీపీ స‌భ్యులు విన‌క‌పోవ‌టంతో చిర‌వ‌కు స‌స్పెన్ష‌న్ తీర్మానం ప్ర‌వేశ పెట్ట‌టం..స్సీక‌ర్ ముగ్గురు స‌భ్యుల పైన ఈ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కూ స‌స్పెన్ష‌న్ వేటు వేసారు.

English summary
Three members of the TDP suspended for present sessions by Speaker in AP Assembly. Assembly affairs minister Buggana Rajendra nath introduced suspension resolution in Assembly and Speaker implemented.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X