వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురిని హతమార్చి రక్తం శివలింగంపై చల్లి .. గుప్తనిధుల వేటలో నరబలులు ?

|
Google Oneindia TeluguNews

మూఢనమ్మకాలు .. క్షుద్ర పూజలు.. గుప్తనిధుల కోసం తవ్వకాలు ఎపీని వనికిస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిలాలోనూ, కర్నూలు జిల్లాలోనూ ఈ తరహా గుప్త నిధుల వేటలో అమాయకులను హతమారుస్తున్నారు. గుప్త నిధుల పేరుతో సాటి మనుషులనే బలి తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న గుప్త నిధుల తవ్వకాల కోసం కర్నూలు జిల్లాలో ఓ యువకుడిని హతమార్చిన ఘటన మరువకముందే ఇప్పుడు అనంతలో ముగ్గురి దారుణ హత్య కలకలం రేపుతుంది.విచిత్రం ... ఎన్టీఆర్ ఫోటోను వాడేస్తున్న రాజకీయ పార్టీల నేతలు

విచిత్రం ... ఎన్టీఆర్ ఫోటోను వాడేస్తున్న రాజకీయ పార్టీల నేతలువిచిత్రం ... ఎన్టీఆర్ ఫోటోను వాడేస్తున్న రాజకీయ పార్టీల నేతలు

అనంతలో దారుణం .. ముగ్గురి దారుణ హత్య ..

అనంతలో దారుణం .. ముగ్గురి దారుణ హత్య ..

అనంతపురం జిల్లాలో క్షుద్రపూజలు స్థానికంగా కలకలం రేపాయి. కొరసికోటలో అనుమానస్పద స్థితిలో మూడు మృతదేహాలు లభ్యంకావడంతో క్షుద్రపూజలు చేసి హతమార్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇక మంగళవారం చంద్రగ్రహణం కావటంతో క్షుద్ర పూజల కోసం నరబలులు ఇచ్చినట్టుగా కూడా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన వారిని హనుమమ్మ, సత్యలక్ష్మీ, శివరామిరెడ్డిగా గుర్తించారు. మంగళవారం చంద్రగ్రహణం కావడంతో క్షుద్రపూజల సంఘటనలు గతంలోనూ జరగడంతో స్థానికుల వాదనకు బలం చేకూరుస్తుంది . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శివాలయ పూజారితో పాటు మరో ఇద్దర్ని గొంతు కోసి చంపిన దుండగులు

శివాలయ పూజారితో పాటు మరో ఇద్దర్ని గొంతు కోసి చంపిన దుండగులు


ఇక ఘటన ఎలా జరిగిందంటే పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం తనకళ్ళు మండలంలోని ఫ్యాక్షన్ గ్రామమైన కొరసికోట గ్రామానికి కాస్తదూరంలో శివాలయం ఉంది. ఈ గుడికి పూజారిగా మల్లమ్మ అనే మహిళ ఉండేది ఆమె చనిపోయిన తరువాత ఆమె తమ్ముడు అయిన శివరామిరెడ్డి, తండ్రి నారాయణ రెడ్డి ఆలయ నిర్వహణ చేపడుతున్నారు. శివరామిరెడ్డి అక్క కమలమ్మ కూడా అక్కడే ఉంటూ అతనికి వంట చేసి పెడుతూ ఉండేది. ఈ క్రమంలో ఆదివారం సత్యలక్ష్మి అనే మహిళ వీరి ఇంటికి వచ్చింది. ఆమె భర్త కృష్ణమూర్తి కూడా ఆమె వెంటనే వచ్చారు .ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి శివాలయం దగ్గర ఉన్న శివరామిరెడ్డి, కమలమ్మ, సత్యలక్ష్మిలను గొంతుకోసి హతమార్చారు.

రక్తాన్ని శివలింగం మీద చల్లిన ఆగంతకులు .. నరబలులని భయపడుతున్న స్థానికులు

రక్తాన్ని శివలింగం మీద చల్లిన ఆగంతకులు .. నరబలులని భయపడుతున్న స్థానికులు


తర్వాత ఆ రక్తంను గుడిలో ఉన్న శివలింగం మీద, గుడి లో ఉన్న పుట్టల మీద చల్లారు. దీంతో క్షుద్రపూజల కోసమే వీరిని నరబలి ఇచ్చారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. ఒకేసారి మూడు హత్యలు జరగడంతో స్థానికులంతా భయాందోళనలకు గురవుతున్నారు . గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన కొందరు.. క్షుద్రపూజలు చేసి ముగ్గురిని బలి ఇచ్చినట్లు తెలుస్తోందని స్థానికులు అంటున్నారు . క్షుద్రపూజలకోసం ముగ్గురిని అతి దారుణగా హత మార్చినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు . ఏది ఏమైనా ఇవి నిజంగా గుప్త నిధుల కోసం చేసిన దారుణ నరబలులా ? లేకా వ్యక్తిగత కక్షలతో ఎవరైనా వీరిని హతమార్చారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
There is a campaign going on that unidentified persons murdered three members in ananthapur district for hidden treasure in a shivalayam .The unidentified men brutually cut their necks and killed the temple priest and his relatives . Locals are panicking as the three deaths are suspecting that it was human sacrifices
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X